‘మూడు’ను పట్టుకు వేళాడుతున్న జగన్ రెడ్డి!

Publish Date:Apr 2, 2026

Advertisement

వైసీసీ అధినేత జగన్ రెడ్డి ‘మూడు’ పంతం పట్టారా? అంటే అధికారంలో ఉన్నప్పుడూ, ఇప్పుడు అధికారమే కాదు, కనీసం విపక్ష నేత గుర్తింపు కూడా లేకుండా పోయినప్పుడూ కడా ఆయన మూడ్ మూడు మీదే ఉంది. 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టినప్పుడు గతంలో తాను అమరావతికి అసెంబ్లీ వేదికగా సంపూర్ణ మద్దతు ఇచ్చిన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి మరీ మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట మొదలెట్టారు. సరే ఆ ఆటలో ఎంత ఘోరంగా పరాజయం పాలయ్యారో 2024 ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడమే తేల్చేసింది. ఇప్పుడు తాజాగా అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత కల్పిస్తున్న వేళ ఆయన మరో ‘మూడు’ తో ముందుకు వచ్చారు.  

సీఎం హోదాలో నాడు అమరావతి  శాసన రాజధాని , విశాఖ  పరిపాలన రాజధాని , కర్నూలు  న్యాయ రాజధాని అంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడకపోయినా.. అప్పటి వరకూ పరుగెడుతున్న అమరావతి నిర్మాణ పనులను నిలిపివేశారు.  అది పక్కన పెడితే అప్పట్లో మూడు రాజధానుల బిల్లును జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం సమర్థవంతంగా అడ్డుకుంది.  

దాంతో మూడు రాజధానులకు చట్టబద్ధత విషయాన్ని పక్కన పెట్టేసి తన ఇష్టం కనుక మూడు రాజధానులు అనే మూడుముక్కలాటతోనే ఐదేళ్లూ గడిపేశారు. 2024లో ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టిన చందంగా వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైన్ని స్థానాలు కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా రాజధాని అమరావతిని పట్టాలెక్కించింది. ఓ వైపు పనుల వేగాన్ని పెంచుతూనే.. మరో వైపు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా అడుగుల వేగం పెంచింది.  అమరావతిని ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ   అసెంబ్లీలో ఓ తీర్మానం ఆమోదించింది. ఆ తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్రం దానికి పార్లమెంటు ఉభయ సభల ఆమోదాన్ని సాధించింది.  

అయితే ఊరంతటిదీ ఒకదారి.. ఉలిపికట్టెదొక  దారి అన్న చంద్రంగా పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందుతున్న సమయయంలోనే జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరో సారి మూడు రాజధానుల మాట ఎత్తారు. అయితే ఈ సారి అమరావతి, కర్నూలు, విశాఖ అని కాకుండా  మచిలీపట్నం,   విజయవాడ, గుంటూరులను కలిపి రాజధానిగా ఏర్పడాలన్నారు.

  జగన్ ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ‘మూడు’ను పట్టుకు వేళాడుతున్నారంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో  ట్రోల్ చేస్తున్నారు. రాజధానిగా అమరావతి అభివృద్ధి అంటే.. దానికి ఆనుకుని ఉన్న మచిలీపట్నం,గుంటూరు, విజయవాడలు వాటంతటవే ఆటోమేటిగ్గా అభివృద్ధి చెందుతాయనడంలో ఇసుమంతైనా అనుమానాలకు ఆస్కారమేలేదు. అయితే జగన్ మాత్రం మూడు మూడంటూనే  మచిలీపట్నం, విజయవాడ,గుంటూరుల అభివృద్ధికి మోకాలడ్డుతున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.