Publish Date:Apr 27, 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ పర్యటనలో ఉన్నారు. కూతుళ్లతో కలిసి షాపింగ్ చేస్తూ కనిపించారు. బెంగళూరు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం యూరప్‌కు బయల్దేరిన జగన్, విదేశాల్లో కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. సాధారణంగా ఒకే విధమైన వస్త్రధారణలో కనిపించే ఆయన, ఈసారి భిన్నమైన స్టైల్లో ఆకట్టుకున్నారు.
దాదాపు 15 రోజుల పాటు లండన్‌లోనే రాజకీయాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకోనున్నారు. ముఖ్యంగా కూతుళ్లతో సమయం గడపనున్నారు. మే 10న తిరిగి బెంగళూరుకు చేరుకోనున్నారు. విదేశీ పర్యటన కోసం ఇప్పటికే సీబీఐ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అందులో భాగంగా సెక్యూరిటీ డిపాజిట్, వ్యక్తిగత ఈ-మెయిల్, ఫోన్ నంబర్ వంటి వివరాలను కోర్టుకు సమర్పించారు.
మరోవైపు అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసును సీబీఐ కోర్టు విచారిస్తోంది. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. ఇక జగన్ కుమార్తెలు లండన్‌లో నివసిస్తున్నారు. వారిని కలిసేందుకు గతంలోనూ ఆయన యూకే పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటికీ సీబీఐ కోర్టు అనుమతితోనే విదేశీ పర్యటన చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-couple-shopping-abroad-with-daughters-36-218410.html
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో పర్యటించారు
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్న వాహనాలను సీజ్ చేయొద్దన్న కోర్టు ఆదేశాల అమలుపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు కీలక అధికారులకు నోటీసులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది.
అమెరికా అధ్యక్షుడి మానసిక స్థితి సరిగ్గానే ఉందా.. అన్న అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న హెన్రిచ్ క్లాసెన్ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు.
మామూలుగా టెన్త్, ఇంటర్ వంటి రిజల్ట్స్ అంటే వార్తా పత్రికల్లో మరుసటి రోజంతా ఆ హడావుడే కనిపిస్తుంది.
శంషాబాద్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడు చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం దొరక్క.. కుటుంబానికి భారమయ్యానన్న వేదనతో అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు నిర్వహణకు కసరత్తులు వేగవంతమయ్యాయి.