చొక్కా పైకి మడిచే ఉంది: పులివెందులలో జగన్.. ప్రత్యర్థులకు సవాలా, క్యాడర్ కు భరోసానా.?

Publish Date:Oct 28, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  జగన్‌కు దూకుడుగా, ప్రత్యర్థలను రెచ్చగొట్టేలా, అవమానపరిచేలా పరుష పదజాలం ఉపయోగించే నేతగా, ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు ఒకింత వివాదాస్పదమే అయినా జగన్ ది అటువంటి వాటిని ఖాతరు చేసే తీరు కాదు.   2019 ఎన్నికల ముందు వరకూ ఆయన తన ప్రసంగాలలో, ఎన్నికల ప్రచారంలో బోలెడు సార్లు గీత దాటి విమర్శలు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద కాల్చేయాలి అంటూ అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ఏకవచన ప్రయోగాలతో  ఆయన దూకుడు ప్రదర్శించారు. అయితే, 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.

అయితే ఎప్పుడైతే 2024 ఎన్నికల్లో వైసీపీ అవమానకరరీతిలో  ఘోర పరాజయాన్ని చవిచూసిందో.. అప్పటి నుంచీ జగన్ నెమ్మది నెమ్మదిగా తన పాత పంథాలోకి వెడుతున్నారు.  రప్పా రప్పా, సినిమా చూపిస్తా వంటి వ్యాఖ్యలు, హెచ్చరికలతో  పాత జగన్  కనిపించేలా వ్యవహరిస్తున్నారు.  

తాజాగా.. స్థానిక ఎన్నికల నేపథ్యంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. పులివెందులలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యర్థులను రెచ్చగొట్టడమే లక్ష్యంగా పలు సవాళ్లు విసిరారు. వాటిలో  తాను ఇప్పటికే  నేపథ్యంలో పులివెందుల ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, జగన్ మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటికే చొక్కా చేతులు పైకి మడిచి సిద్ధంగా ఉన్నాననీ, ఎవరినైనా, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  తాను పులివెందులలో ఓటు వేస్తాననీ, ఎవరైనా తనను అడ్డుకోవాలనుకున్నా, ఇంకేమైనా చేయాలనుకున్న ప్రయత్నించి చూడాలని సవాల్ విసిరారు. 

అయితే పులివెందులలో జగన్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రత్యర్థులను రెచ్చగొట్టడం కంటే.. సొంత క్యాడర్ ను తాను నిలబడతానన్న సంకేతం ఇవ్వడానికే చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి కాలంలో  పులివెందులలో జగన్ పలుకుబడి, వైసీపీ ప్రతిష్ట ఒకింత మసకబారిన పరిస్థితులు కనిపిస్తుండటంతోనే జగన్ ఈ రీతిలో క్యాడర్ లో ఉత్సాహిం నింపడానికీ, తాను ఉన్నానన్న భరోసా ఇవ్వడానికీ చేసి ఉండొచ్చని అంటున్నారు. అయితే ఇటువంటి దూకుడు వ్యాఖ్యలు నిజంగా పులివెందులలో వైసీపీ క్యాడర్ లో జోష్ నింపుతాయా అంటే అదే పరిశీలకులు అనుమానమేనంటున్నారు. 2024 ఎన్నికల పరాజయం తరువాత.. రాష్ట్రాన్ని వదిలి బెంగళూరులో మకాం వేసిన జగన్ చుట్టపు చూపుగా మాత్రమే ఏపీకి వస్తున్న పరిస్థితుల్లో ఆయనపై క్యాడర్ నమ్మకముంచే అవకాశాలు అంతంత మాత్రమేని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  


[Jagan Comments Pulivendula Local Body Elections, YCP, AP Politics, Andhra Pradesh, Telugu One]

By
en-us Political News

  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.