పులివెందులలో జగన్ కు మరో షాక్: జడ్పీటీసీ తెలుగుదేశం కైవసం.!

Publish Date:Nov 7, 2026

Advertisement

మునిసిపోల్స్ లో పులివెందులలో వైసీపీకి ఎదురైన ఘోర పరాభవం నుంచి తేరుకోకముందే పరిషత్ ఎన్నికలలోనూ ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. పులివెందుల మునిసిపాలిటీని కోల్పోయిన రోజుల వ్యవధిలోనూ వైసీపీ పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని కూడా కోల్పోయింది. . తాజాగా నిర్వహించిన స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో పులివెందుల జడ్పీటీసీ   స్థానాన్ని టీడీపీ  భారీ ఆధిక్యతతో గెలుచుకుంది.  

ఈ పరిషత్ పోరులో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి భారతి ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ప్రత్యర్థిపై నిలకడగా ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. తుది ఫలితం వెలువడేసరికి ఆమె తన  సమీప ప్రత్యర్థి  వైసీపీ అభ్యర్థిపై 1,463 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఫలితం వెలువడగానే కౌంటింగ్ కేంద్రం వెలుపల అలాగే నియోజకవర్గవ్యాప్తంగా టీడీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.

కొద్దిరోజుల క్రితమే నిర్వహించిన పులివెందుల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. పట్టణ ప్రాంతంలో లభించిన ఆ అనూహ్య మద్దతు కాకతాళీయం కాదని, గ్రామీణ ప్రాంత పరిధిలోకి వచ్చే ఈ జడ్పీటీసీ ఎన్నికలలోనూ తెలుగుదేశం విజయం, పులివెందులలో వైసీపీ పట్టు కోల్పోయిందనడానికి తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వరుసగా మున్సిపాలిటీ, పరిషత్ స్థానాల్లో   వైసీపీ పరాజయం పాలుకావడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర  ఆందోళనకు గురిచేయడమే కాకుండా, వారిలో నిరాశను, నిస్ఫృహను నింపింది.  ఫలితాలు అధికారికంగా వెలువడిన వెంటనే స్థానిక నాయకులు బాణాసంచా కాల్చి, ఒకరికొకరు మిఠాయి  తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. స్థానిక స్థాయిలో  సాధించిన ఈ వరుస విజయాలు రాబోయే రోజుల్లో పులివెందుల రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేస్తాయని తెలుగుదేవం శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: ఎస్కార్ట్ నంటూ నీడలా వెంబడించి: చెవిరెడ్డికి చెమటలు పట్టించి, చుక్కలు చూపించిన సుధారెడ్డి.!

వైసీపీకి కంచుకోట అయిన పులివెందులలో చోటుచేసుకున్న ఈ రాజకీయ మార్పు   వెనుక స్థానిక ప్రజల నాడిలో వచ్చిన మార్పే కారణమంటున్నారు.  వరుస ఓటములతో వైసీపీకి తమ సొంత నియోజకవర్గంలోనే ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందా అన్న అంతర్మథనంలో వైసీపీ ఉంది.  

రాబోయే రోజుల్లో   పులివెందులలో తెలుగుదేశం పార్టీ తన పట్టును మరింత పటిష్టం చేసుకునే దిశగా ముందుకు సాగుతుందనడంలో సందేహం లేదు. నియోజకవర్గవ్యాప్తంగా   స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరోవైపు, వరుస పరాజయాల నుంచి కోలుకుని తిరిగి పుంజుకునేందుకు వైసీపీ ఏ విధమైన దిద్దుబాటు చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సి ఉంది.  

మీకు నచ్చవచ్చు: పోటీ నుంచి వైదొలగిన వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థలు: మైదుకూరు, చిన్నమండెంలో వైసీపీకి బిగ్ షాక్.!

పులివెందులలో ఉద్రిక్తత: పార్నపల్లె వద్ద అవినాష్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.!

[Telugudesham Bags Pulivendula ZPTC, Jagan Bastion, Collapse, YCP, Shock, TeluguOne]

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.