Publish Date:Feb 11, 2026
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజున వైసీపీ ఎమ్మెల్యేలు 11 మందీ (జగన్ సహా) అసెంబ్లీకి హాజరై 11 నిముషాలు సభలో ఉండి వాకౌట్ చేయడం తెలిసిందే. వాకౌట్ తరువాత సభ బయటకు వచ్చిన జగన్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులుతో ఒకింత ప్రత్యేకంగా మాట్లాడారు. దగ్గరకు పిలిచి.. మరీ ఆయనతో కొద్ది సేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా దువ్వాడను ఒక సారి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి కలవమని కూడా ఆదేశించారు.
రాజకీయవర్గాలనే కాకుండా ఈ సంఘటన వైసీపీయులను కూడా విస్మయ పరిచింది. ఎందుకంటే దువ్వాడను వైసీపీ నుంచి సస్పెండ్ చేయడానికి బయటకు ఎన్ని కబుర్లు చెప్పినా వాస్తవం మాత్రం ఆయనకు ధర్మాన ప్రసాదరావుతో ఉన్న విభేదాలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ శ్రేణులు కూడా అదే కారణం చెబుతున్నారు.
అది పక్కన పెడితే జగన్ దువ్వాడతో ఇక నుంచీ పార్టీ గొంతు బలంగా వినిపించాలని చెప్పినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సరిగ్గా ఇక్కడే ఇక దువ్వాడ సస్పెన్షన్ ను ఎత్తివేయడం ఖాయమన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దువ్వాడలా నోరు గట్టిగా పారేసుకోగల వ్యక్తులు పార్టీకి చాలా అవసరమని జగన్ భావిస్తున్నారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత కూడా ఇప్పటి వరకూ జగన్ కు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడని దువ్వాడపై సస్పెన్షన్ ఎత్తివేసి కీలక బాధ్యత అప్పగించాలని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సస్పెన్షన్ లో ఉండి కూడా దువ్వాడ లడ్డూ వివాదంపై అధికార కూటమి నేతలపై గట్టిగానే నోరు పారేసుకున్నారని అంటున్నారు.
ఇది పక్కన పెడితే జగన్ దువ్వాడను దువ్వి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి కలవమనడం చూస్తుంటే.. జగన్ పార్టీలో సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ లకు చెక్ పెట్టే ఉద్దేశంలో ఉన్నారా అన్న అనుమానాలు వైసీపీ వర్గాల నుంచే వ్యక్తం అవుతున్నాయి. ధర్మాన బ్రదర్స్ జిల్లాకే చెందిన దువ్వాడను ప్రోత్సహించడం ద్వారా వారికి చెక్ పెట్టాలని, పార్టీలో వారి ప్రాధాన్యత తగ్గించాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. చూడాలి మరి దువ్వాడ ఎంట్రీ ధర్మాన సోదరులపై పార్టీలో ఏ మేరకు ప్రభావం చూపుతుందో?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-check-to-dharmana-brothers-39-213891.html
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.