తిరుమల లడ్డూ వివాదంలో వైసీపీ అధినేత జగన్ ఎంత చౌకబారుగా వ్యవహరించారో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంత హుందాగా వ్యవహరించారు. లడ్డూ వివాదాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి జగన్ తాపత్రేయపడ్డారు. అందు కోసం చేయగలిగినన్ని ప్రయత్నాలు చేశారు. తిరుమల పర్యటనకు రెడీ అయ్యారు. లడ్డూ వివాదం నేపథ్యంలో తన పర్యటనను తెలుగుదేశం, జనసేన శ్రేణులు అడ్డుకుంటాయనీ తద్వారా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనీ జగన్ భావించారు.
అయితే జగన్ పర్యటనను అడ్డుకోబోమని జనసేనాని ప్రకటించడం, ప్రభుత్వం జగన్ తిరుమల పర్యటనకు అన్ని ఏర్పాట్లూ చేయడం, భద్రత కల్పించడంతో జగన్ వ్యూహం విఫలమైంది. అదే సమయంలో డిక్లరేషన్ వివాదం ఆయన మెడకు చుట్టుకుంది. అన్యమతస్థుడైన జగన్ డిక్లరేషన్ ఇస్తేనే తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి అనుమతి ఇస్తామని టీటీడీ స్పష్టం చేసింది. దీంతో జగన్ డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తాను స్వయంగా తనంత తాను తిరుమల పర్యటన రద్దు చేసుకుని ప్రభుత్వం తనను అడ్డుకుందంటూ ఎదురుదాడికి ప్రయత్నించారు.
మరో వైపు ఇదే లడ్డూ ప్రసాదం విషయంలో ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన జనసేనాని పవన్ కల్యాణ్ ఆ దీక్ష విరమణకు తిరుమల వెళ్లారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్న పవన్ కల్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ప్రాయశ్చిత దీక్ష విరమించారు. అయితే ఆయన రెండో కుమార్తె అంజనా పననోవా హిందువు కాదు. కనుక ఆమె తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎ
టువంటి చర్చ, వివాదానికి తావు లేకుండా ఆమె డిక్లరేషన్ ఇచ్చారు. ఆమె మైనర్ కనుక ఆమె డిక్లరేషన్ ఫారంపై పవన్ కూడా సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. లడ్డూ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత.. డిక్లరేషన్‌పై పెద్ద ఎత్తున చర్చ సాగిన విషయం విదితమే. పవన్ కల్యాణ్ చాలా హుందాగా ఆ చర్చకు తన చర్య ద్వారా సమాధానం ఇచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-cheap-tactics-39-186039.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?