మంగళవారం జగన్ కు అప్పుల వారం!

Publish Date:Aug 10, 2023

Advertisement

2019 ఎన్నికలలో విజయం 151 స్థానాలలో విజయం సాధించి   ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం చేపట్టిన జగన్ పార్టీ వైసీపీ నాలుగేళ్ల తరువాత వెనక్కు తిరిగి చూసుకుంటే.. ఆ పార్టీలోముఖ్యమంత్రి జగన్ వినా మరో పేరు గుర్తు చేసుకుందామన్నా గుర్తుకు రాని పరిస్థితి. మొత్తంగా వైసీపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరాఖరికి మంత్రులూ కూడా డమ్మీలే.  మొత్తంగా ప్రస్తుతం 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులుగా గెలిచిన ఎమ్మెల్యేలలో నలుగురిని మినహాయిస్తే మిగిలిన వారంతా అదే పార్టీలో ఇప్పటికీ ఉన్నారు. వారిలో   ఓ పాతిక మంది  మంత్రులు. ఆ మంత్రులలో ఓ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు. వీరికి తోడు ముఖ్య సలహాదారు, వందల సంఖ్యలో సలహాదారులు.. అయితేనేం అందరూ జీరోలే. ఎవరికీ నిర్ణయాధికారం ఉందని భావించలేం.

రాష్ట్రంలో ప్రాజెక్టులు పడకేశాయి. అభివృద్ధి అడుగంటింది.  గతంలో పోలవరం కోసం చంద్రబాబు సోమవారాన్ని పోలవారంగా మారిస్తే.. ఇప్పుడు జగన్ మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చి తన హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిందో చెప్పకనే చెబుతున్నారు.    రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్లకు ఉన్నపాటి అధికారం కూడా జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు లేదు. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలే పలు సందర్భాలలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇలాంటి ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుందని, జనం తమను ఎలా నమ్ముతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడపగడపకూ కార్యక్రమంలో తాము ఎదుర్కొంటున్న నిరసన సెగలకు ఇదే కారణమని అంటున్నారు.  ఏ ప్రభుత్వమైనా సరే  రాష్ట్ర ఆదాయం పెంచుకుని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి కానీ,  గన్ సర్కార్ మాత్రం ఆదాయం సంగతి గాలికొదిలేసి అప్పుల కోసం వెంపర్లాడుతోందని విమర్శిస్తున్నారు.   అ దేశం మొత్తంలో ఇలాంటి తిరోగమన విధానాలను అనుసరిస్తున్న, అవలంబిస్తున్న ప్రభుత్వం ఒక్క జగన్ ప్రభుత్వమేననీ అంటున్నారు. అప్పులు తెచ్చి ఎన్నికలకు ఓట్లు కొనుక్కుంటామని చెప్పే పార్టీ ఒక్క జగన్ పార్టీ మాత్రమేనని చెబుతున్నారు.

  వాస్తవానికి జగన్ హయాంలో మంత్రులు. ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు మాత్రమే కాదు వ్యవస్థలు కూడా ఉనికిని కోల్పోయి డమ్మీలుగా మారిపోయాయని విశ్లేషకులు అంటున్నారు.  జగన్ ప్రభుత్వ విధానాలపై విపక్షాల విమర్శలకు మంత్రుల నుంచి దూషణలే సమాధానంగా వినిపిస్తాయి. పాతిక మంది మంత్రులు, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ప్రభుత్వ విధానాలపై  మాట్లాడరు. అధికారుల నోటి నుంచి మాటలే రావు.

ఇక రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.  వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టారా? కేంద్ర ప్రభుత్వం కడతానన్న పోలవరం ప్రాజెక్టు పనులను రివర్స్ టెండరింగ్ పేరుతో నిలిపివేసి.. ( కాంట్రాక్టర్ ను మార్చాల్సిన అవసరం లేదనీ, పనులు వేగంగా జరుగుతున్నాయనీ పీపీఏ ( పోలవరం ప్రాజెక్టు అథారిటి  చెప్పినా కూడా వినకుండా) చివరికి ఇప్పుడు కట్టలేమ చేతులెత్తేసే పరిస్థితికి జగన్ సర్కార్ దిగజారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధిని అటకెక్కించేసిన  వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

విపక్షాల సభలకు తండోపతండాలుగా పోటెత్తుతున్న జన సందోహం కూడా అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నది.గతంలో పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి చంద్రబాబు సోమవారాన్ని పోలవారంగా మార్చేస్తే.. ఇప్పుడు జగన్  మంగళవారాన్ని  అప్పుల వారంగా మార్చేశారని వెల్లువెత్తుతున్నాయి. 

ప్రతి మంగళవారం రూ.3 వేల కోట్లు అప్పులుగా  తెస్తున్నారంటే.. రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందనడాకి ఇంత కన్నా రుజువేం కావాలన్న ప్రశ్నలు వినవస్తున్నాయి.  

By
en-us Political News

  
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.