వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎజెండా మావిగన్!.. పూటకోమాట.. రోజుకో తీరు.. సలహాలెవరివి జగన్?

Publish Date:Jul 2, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై వైసీపీ అధినేత తీరు పూటకో మాట, రోజుకో తీరు అన్నట్లుగా తయారైంది.  తాజాగా ఆయన వచ్చే ఎన్నికలకు అంటే 2029 ఎన్నికలకు పార్టీ అజెండాను ప్రకటించేశారు.  బుధవారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో  ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో పార్టీ విధానాన్ని ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి, తాను సీఎం అయితే.. మావిగన్ రాజధాని అని ప్రకటించారు. వచ్చే ఎన్నికలకు మావిగన్ తన నినాదమనీ, అదే తమ పార్టీ అజెండా అనీ చెప్పారు.  

అయితే రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన  విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.  గతంలో 2019 ఎన్నికలకు ముందు అమరావతికి మద్దతు పలికిన జగన్, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల నినాదాన్ని ఎత్తుకున్నారు. తీరా ఇప్పుడు ఆ మూడు రాజధానుల ప్రతిపాదనను పక్కనబెట్టి అకస్మాత్తుగా సరికొత్తగా 'మవిగున్' అంశాన్ని తెరపైకి తీసుకురావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా చేస్తామని 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్సీపీ గట్టిగా ప్రచారం చేసింది. అయితే, గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు, మరీ ముఖ్యంగా విశాఖ వాసులు ఈ మూడు రాజధానుల ఆలోచనను నిద్వంద్వంగా తిరస్కరించారు. ఇంతటి వైఫల్యం తర్వాత కూడా జగన్ తన పంథాను మార్చుకోకుండా, ఇప్పుడు సరికొత్త ప్రయోగానికి తెరలేపడం వెనుక ఉన్న వ్యూహం ఎవరిదనే చర్చ నడుస్తోంది. ఎలాంటి ప్రజాదరణ లేదా సెంటిమెంట్ లేని సరికొత్త ప్రతిపాదనను ఎన్నికల అజెండాగా మార్చడం రాజకీయంగా వైసీపీకి, జగన్ కు  ఆత్మహత్యాసదృశ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా నిండా ముంచేసే సలహాలు జగన్ కు ఇస్తున్నదెవరా అన్న చర్చ రాజకీయవర్గాలలోనే కాకుండా వైసీపీలో కూడా విస్తృతంగా జరుగుతున్నది. మావిగన్ రాజధాని అజెండాను ప్రకటించడం ద్వారా జగన్ వచ్చే ఎన్నికలకు మూడేళ్ల ముందే ఓటమికి రెడీ అయిపోయారని నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. 

 అధికార పక్షమైన తెలుగుదేశం కూటమి తొలి నుంచీ అమరావతి ఏకైక రాజధాని అనే స్పష్టమైన, స్థిరమైన స్టాండ్ తో వెడుతుండగా, జగన్ మాత్రం జగన్ మాత్రం ప్రతి ఎన్నికలకూ రాజధాని విషయంలో మాట మారుస్తూ ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతికి పూర్తి మద్దతు ప్రకటించిన జగన్.. ఆ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టగానే మాట మార్చి మూడు రాజధానులంటూ కొత్త పల్లవి ఎత్తుకున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో పరాజయం పాలైన తరువాత ఇప్పుడు మూడు రాజధానులను మూటగట్టి పక్కన పడేసి మావిగన్ అంటూ కొత్త రాగం ఆలపించడం ద్వారా తనకు ఒక స్థిరమైన అభిప్రాయం అంటూ లేదని చాటుకుని ప్రజల దృష్టిలో పలుచన అవుతున్నారని అంటున్నారు. ఈ తరహా వ్యూహాలు జగన్ విశ్వసనీయతను దెబ్బతీయడమే కాకుండా, ఆయన నాయకత్వ పటిమపై కూడా ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయంటున్నారు.  

By
en-us Political News

  
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.