ఎన్నికలే టార్గెట్.. బీజేపీకి జగన్ బంపర్ ఆఫర్లు?

Publish Date:Jul 7, 2023

Advertisement

ఏపీలో రానున్న ఎన్నికలు వైసీపీకి చావో రేవో అన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో వైసీపీ గెలిస్తే.. జగన్ పాలనను ఏపీ ప్రజలు మెచ్చినట్లు రెఫరెండం. జగన్ ఆశించినట్లుగానే మూడు రాజధానులకు ప్రజలు కూడా సిద్ధమేనని వైసీపీ బల్ల గుద్ది చెప్పుకోవచ్చు. ఐదేళ్ల కాలంలో జగన్ తీసుకొచ్చిన పథకాలు మహా గొప్పవిగా ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. అదే ఓడితే జగన్ అడిగిన ఒక్క ఛాన్స్ ఇచ్చి చూశాం.. ఇక చాలు పొమ్మని సాగనంపినట్లే. భవిష్యత్ లో కూడా మరో చాన్స్ అని అడిగే అవకాశం మూసుకుపోయినట్లే. మూడు రాజధానుల నిర్ణయం నుండి తన పాలనలో తీసుకొచ్చిన విధానాలు, తన పనితీరు వంటివాటినన్నిటినీ  ఏపీ ప్రజలు తిరస్కరించినట్లే లెక్క. అందుకే ఈసారి మాయ చేసి.. మంత్రమేసి అయినా మళ్ళీ అధికారం దక్కించుకోవాలని సీఎం జగన్ ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే రానున్న ఎన్నికలకు కేంద్రం సాయం కోసం జగన్ తాపత్రయపడుతున్నారు.

తాజాగా సీఎం జగన్ రెండు రోజులు ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో జగన్ బీజేపీ పెద్దలను కలిసి పలు విషయాలపై చర్చించారు. పెండింగ్ నిధుల మంజూరు నుండి విభజన హామీల వరకు ఈ భేటీలో చర్చించినట్లు ఏపీలో వైసీపీ నేతలు ప్రకటించుకున్నారు. అయితే, జగన్ ఢిల్లీ టూర్ వెనక వేరే కారణం ఉందని రాజకీయ వర్గాలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నాయి. రానున్న ఎన్నికల కోసం ఇప్పటికే పలుమార్లు కేంద్రం సాయాన్ని కోరిన సీఎం జగన్.. ఈ పర్యటనలో బీజేపీ పెద్దల ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తుంది. ఎన్నికలలో తనకు సాయం చేస్తే.. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని బీజేపీకి జగన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. 

రానున్న ఎన్నికలలో ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు దాదాపుగా ఖరారైంది. అప్పుడప్పుడూ పొత్తు ఉంటుందా అనేలా అనుమానాలు కలిగిస్తున్నా.. రెండు పార్టీలు పొత్తుకు సుముఖంగానే ఉన్నటు ఆ రెండు పార్టీల నేతలే సన్నిహితులతో చెప్తున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల శ్రేణులూ సమస్యలపై కలిసే కదం తొక్కుతున్నాయి. అయితే.. టీడీపీ-జనసేనతో బీజేపీ కూడా కలిసి కూటమి అవుతుందా అనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. నిజానికి ఏపీలో బీజేపీ ఓట్లు లేవు. సీట్లు వచ్చే పరిస్థితి అంతకన్నా లేదు. కానీ కేంద్రంలో అధికారం ఉంది కనుక అంతో ఇంతో సాయంగా ఉంటుందనే టీడీపీ-జనసేనలు బీజేపీని కలుపుకుపోవాలని  భావిస్తున్నాయి. కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీకి కూడా దేశవ్యాప్తంగా కలిసి వచ్చే వారిని కలుపుకుపోక తప్పని సరి పరిస్థితి ఏర్పడింది.  అయితే  ఏపీలో బీజేపీ స్నేహం టీడీపీతోనా? వైసీపీతోనా అన్నదే తేలాల్సి ఉంది.

బీజేపీ పొత్తు సస్పెన్స్ కొనసాగుతుండగానే ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ బీజేపీ పెద్దల ముందు భారీ ప్రతిపాదనలే  పెట్టినట్టు తెలుస్తుంది. గత ఐదేళ్లుగా వైసీపీ బీజేపీతో రహస్య చెలిమి చేస్తూనే.. కేంద్రం తీసుకొనే ప్రతి నిర్ణయానికి ప్రత్యక్షంగా  మద్దతు ఇస్తూ వస్తున్నది. ఇకపై కూడా కేంద్రం తనకు మద్దతుగా ఉండాలని కోరిన జగన్.. అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పినట్లు సమాచారం.  వైసీపీ-బీజేపీ ప్రత్యక్ష పొత్తు లేకుండా.. బీజేపీ ఒంటరిగానే పోటీచేయాలని.. రాష్ట్రంలో బీజేపీ పర్ఫామెన్స్ ఎలా ఉన్నా.. కేంద్రం తనకు అండగా ఉండి మళ్ళీ గలిపిస్తే.. తన ప్రభుత్వంలో నాలుగు నుండి ఐదు మంత్రి పదవులు ఇస్తామని జగన్ ఆశ చూపినట్లు చెప్తున్నారు.

లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ కలిపి పార్లమెంటులో ఇప్పుడు వైసీపీకి 46 మంది ఎంపీలు ఉన్నారు. వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అంచనా వేయలేం. టీడీపీ-వైసీపీలలో రానున్న ఎన్నికలలో ఎవరు ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తారో చెప్పలేం. కనుక ఇప్పటికే బలంగా ఉన్న పార్టీని వ‌దులుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉండే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పైగా  అసలు ఓట్లే లేని రాష్ట్రంలో మంత్రి పదవులు దక్కుతాయన్న ఆశ ఒకటి. 2014 ఎన్నికలలో ఇదే విధంగా  తెలుగుదేశం బీజేపీకి మంత్రిపదవులు ఇచ్చింది. పొత్తులో భాగంగా నాలుగు అసెంబ్లీ సీట్లను కూడా అప్పట్లో బీజేపీ గెలుచుకుంది.   ఎన్నికల తర్వాత జగన్ అడ్డం తిరుగుతారా అంటే ఆయన జుట్టు ఇప్పుడు ఉణ్నట్లుగానే అప్పుడు కూడా కేంద్రం చేతిలోనే ఉంటుంది.   ఇన్ని ప్లస్సు పాయింట్లు ఉన్న అవకాశాన్ని బీజేపీ వదులుకుతుంటుందా అని పరిశీలకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

కర్నాటకలో అధికారంలో ఉండీ, అటు కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నా విజయం సాధించలేకపోయిన బీజేపీ.. ఇప్పుడు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వైసీపీని నమ్ముకుని ముందుకు అడుగేస్తుందా అన్న అనుమానాలను సైతం పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ జగన్ ఆఫర్ లను అంగీకరించి.. రాష్ట్రంలో జగన్ పార్టీ ఓడిపోతే అప్పుడు పరువు మంటగలిసిపోతుందన్న భయం కూడా బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమౌతోందంటున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికలలో కూడా ఫలితం అటూ ఇటైతే రెంటికీ చెడ్డ రేవడలా పరిస్థితి మారిపోతుందన్న జంకు కూడా బీజేపీలో కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద బీజేపీ ఏపీ విషయంలో ఎటూ తేల్చుకోలేని డైలమాలో ఉందంటున్నారు. 

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.