పిన్నెల్లికి బెయిలెందుకు రాలేదో తెలుసా?

Publish Date:Jul 19, 2024

Advertisement

ఈవీఎం విధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిలు ఎందుకు రాలేదన్న విషయంలపై న్యాయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తున్న సంఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై కేసు బుక్కైంది. ముందస్తు బెయిలుపై కొన్ని రోజులు పిన్నెల్లి అరెస్టు నుంచి తప్పించుకున్నారు. అయితే  ముందస్తు బెయిలు గడువు ముగియడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో నెల్లూరు జైలుకు ఆయనను తరలించారు. 

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆయనను పరామర్శించేందుకు నెల్లూరు జైలుకు వెళ్లారు. పరామర్శ తరవాత జైలు బయట విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అక్కడ చేసిన ప్రసంగంలో జగన్ పిన్నెల్లిని అడ్డంగా బుక్ చేసేశారు. ఔను పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశారు. నిజమే. అందులో తప్పేముంది అంటూ ఆవేశంగా మాట్లాడారు. పాల్వాయిగేట్ పోలింగ్ బూత్ లో రిగ్గింగు జరుగుతుండటంతో ఆవేశం ఆపుకోలేక  పిన్నెల్లిఈవీఎంను ధ్వంసం చేశారు అంటూ కమిట్ అయిపోయిన జగన్ పిన్నెల్లిని అడ్డంగా బుక్ చేసేశారు. 

పిన్నెల్లేమో కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసి తానా రోజు అసలు పాల్వాయ్ గేట్  పోలింగ్ బూత్ కే వెళ్లలేదని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఆయన బెయిలు పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఎందుకంటే ఆయనకు బెయిలు ఇవ్వవద్దంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ వాదనలో ప్రధానంగా నెల్లూరు జెయిలు బయట పిన్నిల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారంటూ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. పిన్నెల్లి అబద్ధం చెబుతున్నారనీ, ఆయన పార్టీ అధినేతే ఈవీఎం ధ్వసం చేసింది పిన్నేల్లే అని స్పష్టంగా చెప్పారంటూ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో కోర్టు పిన్నెల్లికి బెయిలు నిరాకరించింది.  దీంతో పిన్నెల్లి నమ్మకున్నందుకు నిండా ముంచావు కదా జగనన్నా అంటూ తలబాదుకుంటున్నారు.  

By
en-us Political News

  
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.