Publish Date:Jul 19, 2024
ఈవీఎం విధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిలు ఎందుకు రాలేదన్న విషయంలపై న్యాయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తున్న సంఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై కేసు బుక్కైంది. ముందస్తు బెయిలుపై కొన్ని రోజులు పిన్నెల్లి అరెస్టు నుంచి తప్పించుకున్నారు. అయితే ముందస్తు బెయిలు గడువు ముగియడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో నెల్లూరు జైలుకు ఆయనను తరలించారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆయనను పరామర్శించేందుకు నెల్లూరు జైలుకు వెళ్లారు. పరామర్శ తరవాత జైలు బయట విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అక్కడ చేసిన ప్రసంగంలో జగన్ పిన్నెల్లిని అడ్డంగా బుక్ చేసేశారు. ఔను పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశారు. నిజమే. అందులో తప్పేముంది అంటూ ఆవేశంగా మాట్లాడారు. పాల్వాయిగేట్ పోలింగ్ బూత్ లో రిగ్గింగు జరుగుతుండటంతో ఆవేశం ఆపుకోలేక పిన్నెల్లిఈవీఎంను ధ్వంసం చేశారు అంటూ కమిట్ అయిపోయిన జగన్ పిన్నెల్లిని అడ్డంగా బుక్ చేసేశారు.
పిన్నెల్లేమో కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసి తానా రోజు అసలు పాల్వాయ్ గేట్ పోలింగ్ బూత్ కే వెళ్లలేదని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఆయన బెయిలు పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఎందుకంటే ఆయనకు బెయిలు ఇవ్వవద్దంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ వాదనలో ప్రధానంగా నెల్లూరు జెయిలు బయట పిన్నిల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారంటూ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. పిన్నెల్లి అబద్ధం చెబుతున్నారనీ, ఆయన పార్టీ అధినేతే ఈవీఎం ధ్వసం చేసింది పిన్నేల్లే అని స్పష్టంగా చెప్పారంటూ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో కోర్టు పిన్నెల్లికి బెయిలు నిరాకరించింది. దీంతో పిన్నెల్లి నమ్మకున్నందుకు నిండా ముంచావు కదా జగనన్నా అంటూ తలబాదుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-booked-pinnelly-comits-destroy-evm-25-181041.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.