మళ్లీ జగన్ బీసీ కార్డ్.. మరో సారి జనం ముందుకు వైసీపీ బీసీ నేతలు?

Publish Date:Nov 26, 2022

Advertisement

దిగజారిపోతున్న ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడుకోవడానికి జగన్ పార్టీలోని బీసీ నేతలపై ఆధారపడనున్నారా? ఇప్పటికే ఒక సారి బీసీ మంత్రులను బస్సు యాత్రపేరిట రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి భంగపడిన జగన్ మరోసారి అదే దారిలో నడవనున్నారా? అందుకే బీసీ నేతలతో సమావేశం అవుతున్నారా అన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.  మంత్రి బొత్స సత్యనారాయణ, ముత్యాల నాయుడు, జోగి రమేష్ గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మోపిదేవి వెంకటరమణ, పార్థసారథి, జంగాకృష్ణ మూర్తి, అనిల్ కుమార్ యాదవ్ సహా పార్టీలోని బీసీ నేతలందరూ జగన్ తో భేటీ అయ్యారు.

భేటీ వివరాలు వెంటనే బయటకు తెలయరాలేదు. అయినా ఈ సమావేశంలో జగన్ వారికి మరో సారి ఆవు కథ వినిపించారనీ, ప్రభుత్వం బీసీలకు అందిస్తున్న పథకాలను ఏకరవు పెట్టారనీ, వీటన్నిటినీ బీసీలలో విస్తృతంగా ప్రచారం చేసి వారిని పార్టీకి దగ్గర చేసే బాధ్యతను పార్టీలోని బీసీ నేతలంతా తీసుకోవాలని దిశా నిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. అసలు పార్టీలోని బీసీ నేతలతో జగన్ భేటీకి కారణం కూడా ఇదేననీ అంటున్నారు. ప్రస్తుతం పార్టీలోని సీనియర్ బీసీ నేతలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది.

కేబినెట్ లో సముచిత స్థానం లేకపోవడం.. మంత్రివర్గ పునర్వ్వవస్థీకరణలో ఉద్వాసనకు గురైన వారిలో ఎక్కువ మంది బీసీ నేతలే కావడం ఇందుకు కారణంగా చెబుతున్నారు.  ఇక నామినేటెడ్ పదవుల పందేరంలో కూడా బీసీ నేతలకు జగన్ న్యాయం చేయలేదన్న అసంతృప్తి వారిలో గూడుకట్టుకుని ఉందంటున్నారు. అయితే జగన్ మాత్రం వారి అసంతృప్తిని చల్లార్చేందుకు ఇప్పటి వరకూ ఎటువంటి ప్రయత్నం చేయలేదంటున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ప్రతికూల పవనాలు వీస్తున్న తరుణంలో గట్టెక్కాలంటే.. బీసీల మద్దతే శరణ్యం అన్న భావనతో బీసీ నేతలతో జగన్ బేటీ అయ్యారనీ, అయితే ఈ భేటీలో కూడా వారిలో అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం కాకుండా.. బీసీ నేతలుగా పార్టీకి బీసీలను దగ్గర చేయాల్సిన బాధ్యత మీదే అన్న హుకుం జారీ చేయడానికే పరిమితమయ్యారని అంటున్నారు.

ఈ భేటీతో వైసీపీ బీసీ నేతల్లో అసంతృప్తి మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు మరింత ఎక్కువయ్యాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. విపక్షాల విమర్శలను తిప్పి కొట్టడానికి, బీసీల మద్దతు కూడగట్టడానికి బీసీ నేతలను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు జగన్ పురమాయించారని అంటున్నారు.  

By
en-us Political News

  
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.
టెక్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తూ ప్రముఖ కృత్రిమ మేధ గ్రాఫిక్స్ దిగ్గజం ఎన్విడియా (NVIDIA) సంస్థలో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ సమాన భాగస్వాములుగా ఎదిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
సిఐఐ 31వ భాగస్వామ్య సదస్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ ఊహించని రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తమిళనాడులోని మదురైలో జరిగిన ఒక సంచలన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి.. గతంలో నమోదైన కేసుల విచారణలో భాగంగా న్యాయస్థానానికి హాజరయ్యారు.
వ్యవసాయ రంగంలో సరైన ఆలోచన, పట్టుదల ఉంటే ఏ విధంగా అద్భుతాలు సృష్టించవచ్చో ఒడిశాకు చెందిన ఓ యువ రైతు ఆచరణలో నిరూపించి చూపించారు.
తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంటు సభ్యురాలు సోనియా గాంధీ రాసిన సంచలన ఆత్మకథ
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.