రేవంత్ సభలో జగన్ బ్యానర్లు.!

Publish Date:Jul 11, 2026

Advertisement

ఖమ్మం జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న ఒక భారీ బహిరంగ సభలో ఏపీ  మాజీ సీఎం, వైసీపీ అధినేత  జగన్  బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి.  కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు హాజరైన ఈ వేదిక వద్ద ఇతర పార్టీల నేతల ఫ్లెక్సీలు కనిపించడం  సంచలనంగా మారింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని రైతు సమూహాలతో ముఖాముఖిగా మాట్లాడటానికి, వారి సమస్యలను తెలుసుకోవడానికి పర్యటనకు వచ్చారు.  సీఎం సభా వేదిక వద్దకు చేరుకునే సమయంలో, ఆ ప్రాంతంలో జగన్ ఫొటోలతో  ఫ్లెక్సీలు, బ్యానర్లు భారీగా వెలిశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొంటున్న సభలో పొరుగు రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం బ్యానర్లు రాజకీయ చర్చకు తెరలేపింది.

 ఈ సభా ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి పాత బ్యానర్లు కూడా దర్శనమిచ్చాయి. స్థానిక టీడీపీ శ్రేణులు, పాత అనుబంధాన్ని గుర్తుచేస్తూ ఈ ఫ్లెక్సీలను అక్కడ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒకే వేదిక పరిసరాల్లో కాంగ్రెస్ నాయకులతో పాటు వైసీపీ,  టీడీపీ బ్యానర్లు కనిపించడం విశేషం.  కాగా ఈ బ్యానర్లు.. రాష్ట్రాలకూ, రాజకీయాలకు అతీతంగా పార్టీలు సీఎం రేవంత్ కు మద్దతుగా నిలుస్తున్నాయనడానికి నిదర్శనమని కాంగ్రెస్ శ్రేణులు సంబరపడుతున్నాయి. ఈ పరిస్థితి  తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయంగా మరింత బలోపేతం కావడానికి దోహదం చేస్తుందంటున్నాయి.

 మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది.  

Revanth Reddy Khammam Meeting, YS Jagan Banners Khammam, Telangana Congress Politics, TeluguOne News Political Updates

By
en-us Political News

  
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.