భోగాపురం విమానాశ్రం ప్రారంభోత్సవం.. క్రెడిట్ చోరీకి జగన్ యత్నాలు.!

Publish Date:Jul 30, 2026

Advertisement

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల.. మరో రెండు రోజుల్లో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆగస్టు 1న ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.  ఈ   ప్రారంభోత్సవాన్ని కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా, ఒక వేడుకగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది.  ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చివేసే ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడం ద్వారా  రాష్ట్ర ఆర్థిక పురోగతికి బాటలు పడతాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అయితే ఇక్కడే వైసీపీ తీరు నగుబాటు అవుతోంది.  ఈ విమానాశ్రయ నిర్మాణ  క్రెడిట్ కొట్టేయడానికి వైసీపీ పడుతున్న ఆత్రం, తాపత్రయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వంటి ఉత్తరాంధ్ర నాయకులు సహా ..  పలువురు..  విమానాశ్రయం క్రెడిట్  వైపీపీ ఖాతాలో వేసేందుకు నేల విడిచి సాము చేస్తున్నారు.   2023 మేలో అప్పటి సీఎం జగన్..  ఈ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారనీ, స్వల్ప వ్యవధిలోనే పనులను పరుగులు తీయించారనీ ఊరూవాడా ఏకం చేస్తూ ప్రచారం చేస్తున్నారు.  అయితే అదే సమయంలో  వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో   భోగాపురం విమానాశ్రయ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పాత వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండడం ఆ పార్టీని  ఇరకాటంలోకి పడేయడమే కాకుండా.. నాటి విమర్శలు, నేటి క్రెడిట్ డ్రామాలపై నెటిజనులు పెద్ద ఎత్తున జగన్ ను, వైసీపీనీ ట్రోల్ చేస్తున్నారు.  

ఉత్తరాంధ్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేళ జగన్, వైసీపీ క్రెడిట్ చోరీ ప్రయత్నాలు వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. మరీ ముఖ్యంగా  ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న విశేష సానుకూల స్పదన వైసీపీకి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఈ సానుకూలత.. ఉత్తరాంధ్రలో వైపీపీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందా అన్న భయం ఆ పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర నేతల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  ఆ భయంతోనే   ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్లు   మీడియా ముందుకు వచ్చి క్రెడిట్ జగన్ కు, వైపీపీకీ అపాదించడానికి శతధా ప్రయత్నిస్తున్నారు.  

అయితే ఆ ప్రయత్నాలకు నెటిజనులు  జగన్మోహన్ రెడ్డి పాత ప్రసంగాల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ చేస్తూ గండి కొడుతున్నారు. గతంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూసేకరణ సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన క్రెడిట్ చోరీ యత్నాలను ప్రజల ముందు బ్లాక్ అండ్ వైట్ లో ఎండగడుతున్నాయి.  ఎర్ర బస్సే  సరిగా రాని ఊరికి ఎయిర్ బస్సు ఎందుకు, అయినా ఇప్పటికే పక్కనే విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉండగా, మళ్ళీ వేల ఎకరాలు ధారబోసి భోగాపురంలో ఇంకో విమానాశ్రయం నిర్మించడం దేనికి? అంటూ   ఆయన చేసిన విమర్శలు, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.  ఒక ప్రాజెక్టుపై అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా మాట్లాడడం వైసీపీ స్థిరత్వం లేని రాజకీయాలకు అద్దం పడుతోందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 

భోగాపురం విమానాశ్రయం అంశంలో గతంలో భూసేకరణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన నాటి ప్రతిపక్షం, అధికారంలోకి వచ్చాక కూడా నిర్మాణాన్ని ఏళ్ల తరబడి జాప్యం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలోనే విమానాశ్రయం కోసం భూసేకరణ ప్రక్రియ మెజారిటీ భాగం పూర్తయి, శంకుస్థాపనకు సిద్ధమైనప్పటికీ, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును  సమీక్షల పేరుతో పక్కన పెట్టిందని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ఆ తర్వాత సుదీర్ఘ కాలం అలసత్వం వహించి..  పదవీ కాలం ముగిసే ముందర 2023లో అరకొరగా శంకుస్థాపన డ్రామాలు ఆడారనీ, ఇప్పుడు తీరా ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రపంచ స్థాయి ఎయిర్‌పోర్ట్ ప్రారంభమవుతుంటే మధ్యలో వచ్చి క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నించడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   

Bhogapuram International Airport, YS Jagan Mohan Reddy, AP Politics, Narendra Modi Bhogapuram Airport, Dharmana Prasada Rao YSRCP

By
en-us Political News

  
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బిజీ విద్యార్థులు మరియు ఉద్యోగినుల కోసం ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్ అందిస్తున్న వీకెండ్ బ్యూటీ కోర్సుల వివరాలు. శని, ఆదివారాల్లో మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ నేర్చుకుని ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా మారే సువర్ణ అవకాశం!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.