జగన్ ప్రగతికి ప్రతిబంధకం!

Publish Date:Dec 23, 2024

Advertisement

ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదాన్ని విస్తృతంగా ఉపయోగించారు. అలాగే చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ ఇద్దరూ జగన్  సమాజానికి చీడపురుగుగా అభివర్ణించారు. జగన్ ను మరో సారి అధికారంలోనికి రానీయకూడదని పదే పదే ప్రజలకు పిలుపు నిచ్చారు. సరే ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అధికారానికి దూరమైంది. అయితే అధికారం కోల్పోయిన తరువాత జగన్, ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు చంద్రబాబు, పవన్ కల్యాణ్ విమర్శలు అక్షర సత్యాలని నిరూపించే విధంగానే ఉన్నాయి. 

జగన్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు లేకుండా పోయింది. పరిశ్రమలు రావడం మాట అటుంచి ఉన్న పరిశ్రీమలు రాష్ట్రం దాటి వెళ్లిపోయాయి. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం పనులు నిలిచిపోయాయి. రివర్స్ టెండరింగ్ అంటూ  వేగంగా జరుగుతున్న పోలవరం పనులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక అమరావతిని నిర్వీర్యం చేశారు. భవనాలను పాడుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత అమరావతి, పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. దాదాపు ఐదేళ్ల ప్రతిష్ఠంభన తరువాత అమరావతి నిర్మాణం తిరిగి మొదలైంది. అమరావతి కోసం ఆసియా అభివృద్ధి బోర్డు, ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేశాయి. దీంతో సీఆర్డీయే అమరావతి పనుల కోసం టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. సంక్రాంతి నాటికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులను ప్రారంభించాలని నిర్ణయించింది. వచ్చే మూడేళ్లలో అమరావతి పూర్తి చేయాలన్న సంకల్పంతో చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోంది. 

సరిగ్గా ఇదే సమయంలో జగన్, వైసీపీయులు చేస్తున్న దుష్ప్రచారం, విమర్శలు, ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంకులకు రాసిన లేఖలు, పంపిన ఈ మెయిల్స్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితరుల విమర్శలు అక్షర సత్యాలు అన్న విషయాన్ని రుజువు చేసేవిగా ఉన్నాయి.   రాజధాని అమరావతికి నిధులు ఇవ్వవద్దంటూ ప్రపంచ బ్యాంకుకు ఈమెయిల్స్ వైసీపీయులు ఈమెయిల్స్ పంపారు.   ఆహార భద్రత, పేదల స్థానభ్రంశం, వరద ముంపు వంటి కారణాలు చూపుతూ అమరావతి పురోగతిని అడ్డుకోవడానికి శతధా ప్రయత్నిస్తూ లేఖలు రాయడం, ఈమెయిల్స్ పంపడం ద్వారా రాష్ట్ర ప్రగతికి తాము ప్రతిబంధకమని చాటుకుంటున్నారు.  వైసీపీ ప్రతిపక్షంగా ఉన్న 2014 - 2019 మధ్య కాలంలో కూడా ఆ పార్టీ, ఆ పార్టీ అధినేత వ్యవహార శైలి ఇలాగే ఉంది. అమరావతి పురోగతిని అడ్డుకోవడమే లక్ష్యంగా అప్పుడూ, ఆ తరువాత అధికారంలో ఉన్న సమయంలోనూ, ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా ప్రయత్నిస్తున్నారు. 2019-24 మధ్య కాలంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా మూడు రాజధానులంటూ తగ్లక్ విధానాలతో అమరావతిని నిర్వీర్యం చేశారు. అమరావతికి పోటీగా విశాఖ రాజధాని అంటూ అర్భాటం చేసినా, ఆ దిశగా ఒక్క ఇటుక కూడా పేర్చిన పాపాన పోలేదు సరికదా  రుషికొండకు గుండు కొట్టి పర్యావరణ వినాశనానికి పాల్పడ్డారు. సొంతానికి విలాస భవంతిని నిర్మించుకోవడంపైనే శ్రద్ధ పెట్టారు.  రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు.. స్వప్రయోజనం కోసమే జగన్ తన ఐదేళ్ల అధికారాన్ని వాడుకున్నారు. అభివృద్ధికి తాను, తన పార్టీ పూర్తి వ్యతిరేకమని అధికారంలో ఉండానూ, ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాతా చాటుకుంటున్నారు.  

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.