జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందని ఎప్పటినుంచో అంటున్నారు. లెటెస్ట్‌గా ఢిల్లీ పర్యటనతో ఆ విషయంలో మరింత క్లారిటీ వచ్చిందంటున్నారు. ఇటీవల హస్తినలో విజయసాయికి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ఢిల్లీలో విజయసాయితో సీఎం జగన్.. ఎక్కడా ముఖాముఖి మాట్లాడిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటున్నారు. మంత్రి సింధియాతో మీటింగ్‌లోనూ సాయిరెడ్డిని బయటకు పంపించేశారు జగన్. ఆ రాత్రి డిన్నర్ టైమ్‌లోనూ జగన్‌తో విజయసాయి లేరు. ఇవి చాలవా.. ఆయన ప్రాధాన్యతను ఈయన పూర్తిగా తగ్గించేశారని చెప్పడానికి.
విజయసాయిరెడ్డి స్థానాన్ని.. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డిలు భర్తీ చేశారు. వారిద్దరినీ అన్నిటికీ ముందుంచారు జగన్‌రెడ్డి. ఈ పరిణామంతో ఇక విజయసాయిని పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనని అంటున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవకుండానే తాను ఏపీకి తిరిగి రావడాన్ని జగన్ అవమానంగా ఫీల్ అవుతున్నారు. అమిత్ షా అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేయడంలో విజయసాయి ఫెయిల్ అయ్యారని ఆగ్రహంతో ఉన్నారు. అంతకుముందే కొంతకాలంగా సాయిరెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కావాలనే విశాఖకు పరిమితం చేశారు. తాడేపల్లిలో అడుగు కూడా పెట్టనీయడం లేదు. ఇక ఢిల్లీలోనూ విజయసాయి హవాకు చెక్ పెడుతూ.. ప్రభుత్వ పనుల కోసం ప్రత్యేకంగా రిటైర్డ్ ఐఏఎస్‌ను పెట్టుకున్నారు. పర్సనల్ పనులను ఎంపీలు వేమిరెడ్డి, రామిరెడ్డిలకు అప్పగిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలో, ఏపీలో, పార్టీలో విజయసాయిరెడ్డి ఓ ఉత్సవ విగ్రహం మాత్రమే.
ఉత్తరాంధ్రలో విజయసాయి ఓవరాక్షన్‌పై అనేక ఫిర్యాదులు రావడంతో ఇటీవల ఆయన ఫీజులు పీకేశారని తెలుస్తోంది. ఇక తాడేపల్లి వ్యవహారాలన్నీ సజ్జల చూస్తున్నారు. పేరుకు పార్లమెంటరీ పార్టీ నేతగా పదవి మాత్రం ఉన్నా.. పవర్ మాత్రం కట్ చేసేశారు. బీజేపీతో బాగా అంటకాగడం.. తనకు వ్యతిరేకంగా ఢిల్లీ స్థాయిలో సొంతంగా రాజకీయం చేస్తుండటమే.. విజయసాయిపై జగన్ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. కన్నతల్లి, తోడబుట్టిన చెల్లినే పక్కన పెట్టిన జగన్‌కు.. సూటుకేసు కంపెనీలు, సీబీఐ-ఈడీ కేసులు, జైలులో తోడున్నంత మాత్రాన.. నెత్తిన పెట్టుకుంటారని అనుకోవడం విజయసాయిరెడ్డి అమాయకత్వమే అవుతుందని అంటున్నారు. జగన్ జగనే.. విజయసాయి విజయసాయే...
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-angry-on-vijayasaireddy-in-delhi-tour-39-129764.html
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.