జగన్ ఓ విఫల నేత.. అధినేతను అడ్డంగా బుక్ చేసిన అంబటి?

Publish Date:Mar 16, 2026

Advertisement

వైసీపీ సీనియర్ నాయకుడు,  మాజీ మంత్రి అంబటి రాంబాబు జగన్ ను అడ్డంగా బుక్ చేశారా? అంబటి తన నోటి దూలతో జగన్ ను సోషల్ మీడియాలో ట్రోల్ ఐటెమ్ గా మార్చేశారా? అంటే నెటిజనులు ఔననే అంటున్నారు. విషయం ఏంటంటే.. అంబటి రాంబాబు తాజాగా ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సొంత పార్టీ అధినేత జనగ్ మోహన్ రెడ్డి  విఫలమయ్యారని కుండబద్దలు కొట్టేశారు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.   ఇంటర్వ్యూలో యాంకర్ తన చొక్కాపై ఉన్న లోగోను గురించి యాంకర్ ప్రశ్నిస్తే.. ఆ లోగో నవరత్నాలు పథకాలకు సంబంధించిన లోగో అని అంబటి గొప్పగా చెప్పారు. అక్కడితో ఆగకుండా ఆ పథకాలే కాదు జగన్ నే విఫలమయ్యారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో జగన్ నెటిజనులకు ట్రోలింగ్ ఐటెమ్ గా మారిపోయారు. అసలింతకీ అంబటి రాంబాబు ఉద్దేశమేంటంటే?.. పార్టీ పరాజయం పాలైనంత మాత్రాన జగన్ తమ నాయకుడు కాకుండా పోరనీ, పథకాలు విఫలమైనంత మాత్రాన నవరత్నాలు మంచి పథకాలు కాకుండా పోవనీ చెప్పడమే.

అంబటికి ఏ విషయాన్నైనా వ్యంగ్యవైభవం జోడించి చెప్పడం అలవాటు. అలాగే నోటి దురద కూడా కొంచం ఎక్కువే. ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన జగన్ వైఫల్యం అంటూ చేసిన వ్యాఖ్య కూడా ఆ నోటి దురద కారణంగానే అని పరిశీలకులు అంటున్నారు.  ఇప్పుడు ఆ వ్యాఖ్యలే జగన్ వ్యతిరేకులకు ఆయుధంగా మారాయి. జగన్ ఫెయిల్యూర్ అని స్వయంగా అంబటి రాంబాబు ఒప్పుకున్నారంటూ సోషల్ మీడియాలో మీమ్స్, వీడియోలతో విపరీతమైన  ఓ రేంజ్ లో జగన్ ను ట్రోల్ చేస్తున్నారు.  ఈ పరిస్థితి నిస్సందేహంగా జగన్ ను, వైసీపీనీ, ఆ పార్టీ క్యాడర్ ను ఇబ్బందుల్లో పడేసింది. డిఫెన్స్ లోకి నెట్టేసింది.  

ఇటీవలి కాలంలో అంబటి రాంబాబు రాజకీయాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టై  బెయిల్ పై విడుదలైన తర్వాత ఆయన మరింతగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన జైలుకు వెళ్లిన సమయంలో పార్టీ శ్రేణులు 'కాపు టైగర్' అంటూ అభివర్ణించగా, ఆయన కుమార్తె కూడా మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు వైసీపీ మద్దతుదారుల దృష్టిని ఆకర్షించాయి.

ఈ క్రమంలో అంబటి వరుస  ఇంటర్వ్యూలు ఇస్తూ నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామంపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అంబటి చేసిన వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల వరకు కూడా ప్రత్యర్థి పార్టీలు వార్తల్లో, చర్చల్లో ఉండేలా వాడుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.  సొంత పార్టీ అధినేతనే నేతనే విఫలనేతగా అంబటి అభివర్ణించడంతో ఆయన రాజకీయ భవిష్యత్ పై కచ్చితంగా ప్రభావం పడుతుందని పరిశీలకులు అంటున్నారు.   

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.