విశ్వసనీయత జాగాలో వచ్చి చేరిన కొత్త పదం నిజాయితీ

Publish Date:Sep 30, 2013

Advertisement

 

ఇంతకు ముందు వైకాపా ‘విశ్వసనీయత’కు పేటెంట్ హక్కులు పొందినట్లు మాట్లాడేది. కానీ తెలంగాణాలో జండా పీకేసినప్పటి నుండి దైర్యంగా ఆ పదం పలకలేకపోతోంది. దానికి బదులు ఇప్పుడు కొత్తగా ‘నిజాయితీ’ అనే పదం అందుకొంది. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయాలని చెపుతున్నజగన్, కేంద్రం రాష్ట్ర విభజన ప్రకటన చేసిన తరువాత ఆయన పార్టీ అన్ని రంగులు ఎందుకు మార్చిందో, ఆ క్రమంలో తెలంగాణా ప్రజలను, కొండా సురేఖ వంటి తన పార్టీ నేతలను నిర్దాక్షిణ్యంగా ఎందుకు వదిలించుకొందో మరిచిపోయినట్లున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతున్నప్పుడు ఆయన పార్టీ అంత హటాత్తుగా తెలంగాణాను ఎందుకు వదిలిపెట్టవలసి వచ్చిందో చెప్పాల్సి ఉంది.

 

అదే విధంగా, ఇంతవరకు ఆయనకు, ఆయన పార్టీకి అండగా నిలిచిన కాంగ్రెస్ యంపీ సబ్బం హరిని, కనీసం పిలిచి సంజాయిషీ అయినా కోరకుండా, మీడియా ద్వారానే ‘అతనికి మాకు సంభందం లేదని’ చెప్పి వదిలించుకోవడం ఎటువంటి నిజాయితీ? పైగా అంత నమ్మకస్తుడిగా పనిచేసిన సబ్బం హరికి వైకాపా చివరిగా ఇచ్చిన బహుమానం ఏమిటంటే ‘కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగస్తుడనే ముద్ర.’ దీనిని ఎటువంటి రాజకీయం అనాలి?

 

జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా సమైక్యాంధ్ర గురించి పోరాడితే ఎవరు తప్పపట్టారు. ఇతర పార్టీలతో ప్రమేయం లేకుండా తన పోరాటమేదో తను చేసుకొంటే నచ్చిన వారు వచ్చి కలుస్తారు. నచ్చని వారు దూరంగా ఉంటారు. కానీ ఆ పేరుతో సీమాంద్రాలో పార్టీని బలపరచుకోవడం, ఆ మిషతో తన ప్రత్యర్ధులను రాజకీయంగా దెబ్బతీయాలనుకోవడం గర్హనీయం.

 

ఒకవేళ ఆయనకున్నంత ‘నిజాయితీ’ ఈ రాష్ట్రంలో మరెవరికీ లేదని ప్రజలు భావిస్తే, వారే ఇతర పార్టీలకు, నేతలకు తగిన గుణపాఠం చెపుతారు. ఆ శ్రమ ఆయనెందుకు తీసుకోవడం? ముందు తన నిజాయితీ ఏమిటో నిరూపించుకొంటే చాలు కదా?

By
en-us Political News

  
ఛత్తీస్‌గఢ్‌లో  ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.  ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ధర్మ తాళ్లగూడెంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. నక్సల్స్ ముక్త ఆపరేషన్ లో భాగంగా ఛత్తీస్ గఢ్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో గత కొంత కాలంగా భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు కూంబింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఎన్ కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు.
గ‌త కొన్నేళ్ల నుంచి కొత్త క‌శ్మీరం ఆవిష్క‌రిస్తున్న వేళ‌.. ఎన్న‌డూ లేని విధంగా ప‌ర్యాట‌కులు సంద‌డి చేస్తున్న స‌మ‌యాన‌.. కాశ్మీరం నిజంగానే ఒక భూత‌ల స్వ‌ర్గ‌మా అనిపించింది. క‌శ్మీర్ భార‌త్ లో భాగం అయితే మ‌న‌కు ఇంత‌టి భాగ్యం ల‌భిస్తుందా? అన్న కోణంలో స్థానిక క‌శ్మీరీలు కూడా ఎంతో ఆనందంగా ఉన్న సంద‌ర్భం కూడా ఇదే.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడితో.. భారత్ మొత్తం రగిలిపోతోంది. హిందూ టూరిస్టులే లక్ష్యంగా తీవ్రవాదులు జరిపిన కాల్పులతో.. దేశం ఏ క్షణమైనా పేలేందుకు సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా మారింది. టెర్రరిస్టులు కేవలం హిందువులనే ఎంపిక చేసుకొని మరీ దాడి చేయడానికి కారణమేంటి? హిందువులను చంపడం వల్ల.. వారు సాధించేదేమిటి? పహల్గాం ఉగ్రదాడి వెనకున్న అసలు కోణమేంటి? అన్నది పెద్ద డిబేట్‌గా మారింది.
కాశ్మీర్‌ పహల్గాంలో ఉగ్రవాదుల కిరాతక దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలకు సిద్ధం అయ్యింది.  ప్రాథమికంగా కొన్ని చర్యలను తీసుకుంది. అందులో భాగంగా దేశ సరిహద్దులను మూసేసింది.  వివిధ పనుల నిమిత్తం ఇండియాకు వచ్చిన  పాక్ జాతీయులు మే ఒకటవ తేదీ లోగా భారత్ విడిచి వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం ఇండియా కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని నిర్ధారణ కావడంతో ఇండియా కఠిన చర్యలకు రెడీ అయ్యింది.
మాజీ మంత్రి విడదల రజనీని విశాఖ విమానాశ్రయంలో నిర్బంధించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. వైసీపీ హయాంలో యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ స్టోన్‌ క్రషర్స్ నిర్వాహకులను బెదిరించి రూ.2. 20 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలపై మాజీ మంత్రి విడుదల రజని, ఆమె మరిది గోపి, అలాగే వీరికి సహకరించిన అధికారి జాషూవా, మాజీ మంత్రి విడదల రజని పీఏ రామకృష్ణపైనా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.
వైసీపీ నాయ‌కురాలు, చిలకలూరి పేట మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీకి భారీ షాక్ త‌గిలింది. ఆమె మ‌రిది.. విడ‌ద‌ల గోపీనాథ్ ను ఏసీబీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. విడదల గోపీనాథ్ విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నారన్న కచ్చితమైన సమాచారంలో ఏసీబీ పోలీసులు ఆయనను హైదరాబాద్ లో ఈ తెల్లవారు జామున అదుపులోనికి తీసుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం (ఏప్రిల్ 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 9 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మరో మూడు రోజుల్లో ( ఏప్రిల్ 27) ఇరవై నాలుగేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుని రజతోత్సవ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను ఘనంగా జరుపుకునేందుకు సిద్దమవుతోంది. ఒక విధంగా ఇదొక అపూర్వ సందర్భం.
జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిని చంద్రబాబు ఖండించారు. దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, దేశ సమగ్రత, భద్రత విషయంలో అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారతదేశాన్ని చూసి ఓర్వలేకే ఇలాంటి దాడులు చేస్తున్నారన్నారు.
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్వంలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై పాక్ పౌరులను భారత్ లోకి అడుగుపెట్టనివ్వబోమని ప్రకటించింది. ఇప్పటికే ఇక్కడ ఉన్న పాక్ పౌరులు, పర్యటకులు తక్షణమే తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ జారీ చేసిన ప్రత్యేక వీసాలను రద్దు చేసింది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. కాగా మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ సంగారెడ్డికి వెళ్లనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూతురు ఎంగేజ్మెంట్‌కు హారయ్యేందుకు ఆయన సంగారెడ్డి వెళ్తున్నట్టు సమాచారం.
ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించ తలపెట్టిన బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. పార్టీ నేతలతో కలిసి సభాస్థలిని సందర్శించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటివరకు సహకరించిందని, సభ ముగిసే వరకు ఇదే సహకారం అందించాలని జిల్లా యంత్రాంగాన్నికేటీఆర్ కోరారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక పోరాట సభ కాదని, కేవలం పార్టీ వార్షికోత్సవాన్ని శాంతియుతంగా జరుపుకుంటున్నామని తెలిపారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.