పార్టీపై జగన్ పట్టు జావగారిందా.. గడప గడపకూకు నేతల డుమ్మా అందుకేనా?

Publish Date:May 19, 2022

Advertisement

పార్టీపై పార్టీ నేతలపై, మంత్రులపై, ఎమ్మెల్యేలపై జగన్ పట్టు జావగారిందన్న మాటలు వైసీపీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేల డుమ్మాయే ఇందుకు నిదర్శనమని వారే అంటున్నారు. సీఎం మాట ఇంతకు ముందులా శిలాశాసనంలా చెల్లుబాటు కావడం లేదని చెబుతున్నారు. మూడేళ్ల పాలన విజయాలను ప్రజలలో ప్రచారం చేసుకునేందుకు జగన్ చేపట్టిన గడప గడపకూ కార్యక్రమం  ఒక్క సారిగా వైసీపీ బలహీనతలూ, జగన్ ప్రభుత్వ వైఫల్యాలనూ బట్టబయలు చేసేసింది. ఇప్పటి వరకూ జగన్ గుప్పిట మూసి ఉంచి.. పార్టీలో తానకు తిరుగే లేదనీ,తన మాటను ధిక్కరించే ధైర్యం ఎవరికీ లేదని ఇచ్చిన బిల్డప్ గడప గడపకూ కార్యక్రమంలో పటాపంచలైపోయింది.

జనంలో వైసీపీ, జగన్ సర్కార్ విశ్వసనీయత కోల్పోయాయనడానికి గడప గడపకూ కార్యక్రమానికి ఎదురైన ప్రజా వ్యతిరేకతే తార్కానమని పరిశీలకులు అంటున్నారు.  గడప గడపకూ  మంత్రులు, ఎమ్మెల్యేలను వెళ్లి జనానికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని జగన్ ఆదేశించడంతో ప్రభుత్వ వైఫల్యాలపై జనం ఆగ్రహ జ్వాలలు వైసీపీ నేతలకు చమట్లు పట్టించాయి. మూడేళ్ళుగా ఎమ్మెల్యేలు, మంత్రులను డమ్మీలను చేసి వాలంటీర్లకే పెత్తనం అంతా అప్పగించిన ఫలం ఇప్పుడు గడప గడపకూ కార్యక్రమంలో ప్రజాగ్రహ రూపంలో ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేస్తున్నది.  ఇదే గడప గడపకూ కార్యక్రమం జగన్ కు పార్టీ నేతలపై పట్టు సడలిందన్నవిషయాన్ని కూడా తేటతెల్లం చేసింది. గడప గడపకూ తొలి రోజు వైఫల్యం తరువాత జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలకు విస్పష్ట ఆదేశాలిచ్చినా కూడా వారు ఖాతరు చేయలేదు. అక్కడక్కడా మమ అన్నట్లుగా మాత్రమే ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

సీఎం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ఎక్కడికక్కడ ప్రజాగ్రహంతో నిలిచిపోయింది. పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు, ఇతర ముఖ్య నేతలూ అసలీ కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదు. అక్కడక్కడా వెళ్లిన వారికి ప్రజా నిరసనలు ఎదురై వెనుదిరిగేలా చేస్తున్నాయి.  రోడ్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు,రేషన్, అమ్మఒడి తదితర సమస్యలపై జనం ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. గడప గడపకూ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు డుమ్మా కొడుతుండటంతో ప్రభుత్వ అధికారులు, వలంటీర్లు హాజరై మమ అనిపించేస్తున్నారు. అసలు గడప గడపకూ వైసీపీ పేర ఈ కార్యక్రమాన్ని ఉగాది నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే  పలువురు ప్రజా ప్రతినిథులు కోరడంతో దానిని వాయిదాల మీద వాయిదా వేస్తూ వచ్చారు. ఎలాగోలా ఈ నెలలో కార్యక్రమం పేరును గడప గడపకూ మన ప్రభుత్వం పేర చేపట్టి అధికారులను కవచంగా చేసుకుని మమ అనిపిద్దామని జగన్  చేసిన ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గడప గడపకూ వెళ్లి ప్రజాదరణ పొందితే తప్ప మళ్లీ అధికారంలోనికి రాలేమని.. ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులు కాలేరని జగన్  హెచ్చరిస్తున్నా  ఎమ్మెల్యేలు ఖాతరు చేయడం లేదు. 

గురువారం కోనసీమలో గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు ఎదురైన అనుభవం మరెవరూ ఇక ఈ కార్యక్రమం జోలికి వేళ్లే ధైర్యం చేయకుండా చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజల ప్రశ్నాస్త్రా తట్టుకోలేక తప్పించుకు వెళుతున్న ఎమ్మెల్యేలను వెంబడించి మరీ జనం నిలదీస్తున్నారు. పథకాల అమలులో లొసుగులు, అభివృద్ధి జాడే లేని పాలనపై జనాగ్రహం ఉవ్వెత్తున లేస్తుంటే ప్రజా ప్రతినిధులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీంతో ప్రశ్నిస్తున్న ప్రజలను నియంత్రించేందుకు పోలీసులను రంగంలోకి దింపి ప్రజా ప్రతినిథులు జారుకుంటున్న పరిస్థితి కోనసీమ వ్యాప్తంగా కనిపించింది.

  ఆఖరికి  రైతు భరోసా కార్యక్రమానికి కూడా పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారంటే జగన్ ఆదేశాలకు  గతంలోలా పార్టీలో ఖాతరీ లేదని తేటతెల్లమౌతోంది. లబ్ధిదారుల ఎంపికలో తమ మాటకు విలువ లేనప్పుడు పాల్గొని ప్రయోజనం ఏమిటని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.  అనంతపురం జిల్లాలో రైతు భరోసా కార్యక్రమానికి వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.   చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి ఆర్‌కే రోజా హాజరు కాలేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచం ద్రారెడ్డి హాజరైనా  సమావేశాన్ని త్వరగా ముగించేసి మమ అనిపించారు. అన్నమయ్య జిల్లాలో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మాత్రమే హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలో పాలకపక్ష ప్రజాప్రతినిధులెవరూ పాల్గొనలేదు.

కాకినాడ జిల్లా కేంద్రం బదులు పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దొరబాబు మాత్రమే వచ్చారు. మంత్రి దాడిశెట్టి రాజా, ఇతర ఎమ్మెల్యేలు హాజరు కాలేదు.   శ్రీసత్యసాయి జిల్లాలో పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి తప్ప మిగిలినవారెవరూ రాలేదు. వైఎ్‌సఆర్‌ జిల్లాలో జగన్‌ మేనమామ నియోజకవర్గమైన కమలాపురంలో కార్యక్రమం నిర్వహించారు. జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రఘురామిరెడ్డి, సుధ, రాచమల్లు ప్రసాదరెడ్డి హాజరు కాలేదు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని సింగంపల్లిలో జరిగిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, కలెక్టరు మాత్రమే హాజరయ్యారు. జిల్లా మంత్రి తానేటి వనిత, ఇన్‌చార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ముగ్గురు ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరిగిన కార్యక్రమానికి వైసీపీ ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారు.

కోనసీమ జిల్లాలో మంత్రి చెల్లుబోయిన వేణు ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రాపురంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి, ఎంపీ చింతా అనూరాధ హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌, నలుగురు ఎమ్మెల్యేలురాలేదు. పార్టీలో జగన్ మాట గతంలోలా చెల్లుబాటు కావడం లేదనడానికి ఇదే తార్కానంగా రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది.

By
en-us Political News

  
మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఆయనకు తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కమ్ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలను సెట్ చేసుకుంటే సరిపోతుందని ఆలోచన వచ్చింది.
తెలంగాణ ఉద్యమం అయిపోలేదు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందంటారు కేసీఆర్‌. ఎన్నికల్లో ఓటమి అనేది టెంపరరీ సెట్‌ బ్యాక్‌ మాత్రమే. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు నిబ్బరం ఉండాలి. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని కేసీఆర్ త‌న క్యాడ‌ర్‌కు హిత‌బోధ చేస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు.
ఎవరు ఎంత అధికారంలో అయినా వుండవచ్చు... మా మాటకు ఎదురు లేదు.. మేం చేసిన దానికి తిరుగులేదు అనే ధీమాలో వుంటే వుండొచ్చు..
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ వారం రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఏక‌ప‌క్షంగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని చూస్తున్న అధికారుల జాబితాను రెడీ చేసుకున్న ఈసీ ఆ జాబితాలో ఒక్కొక్క‌రి పై బదిలీ వేటు వేస్తూ వ‌స్తున్న. ఇప్ప‌టికే ప‌లువురు అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసిన ఈసీ.. ఆదివారం (మే6) రాష్ట్ర డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై బ‌దిలీ వేటు వేసింది.
 ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎపిలో నూతన డిజిపి నియామకమయ్యారు. అంతటితో ఆగకుండా ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది. 
ఏపీలో ఎన్నికలు వారం రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అధికార వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో చేసిందేమిటన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక.. చెప్పుకునే గొప్పలు జనం నమ్మడం లేదని ఖరారు కావడంతో ఇక విపక్షాలపై దుష్ప్రచారం, అబద్ధాల వ్యాప్తికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది.
‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక కీలక సీన్ వుంటుంది. ముఖ్యమంత్రి పోస్టులో వున్న రఘువరన్‌ని జర్నలిస్టు పాత్రలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తాడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు.
అబూజ్ మడ్ దట్టమైన అటవీ ప్రాంతం. కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో ఇక్క‌డ జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌ల‌లో 90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.
ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు.
తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్లలో కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగాపోయింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు.
వైసీపీ నాయకుడు జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్‌కట్‌లో ‘నార్సి’ అంటారని,
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.