తెలుగు వీర.. లేవరా?

Publish Date:Jul 6, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్ ప్రభుత్వంలో సలహాదారులు లెక్కకు మిక్కలిగానే ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ముఖ్య సలహదారుడు కూడా ఉన్నారు. మరి ఆ సలహాదారులే మరిచిపోయారో లేక ఆ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడే  మరిచిపోయారో.. అదీ ఇదీ కాకుంటే.. వారంత కలిసికట్టుగా చెప్పినా.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం  ఎవరి మాటలు వినిపించుకోకుండా.. జులై 4న ఛలో చిత్తూరు అంటూ విమానం ఎక్కి వెళ్లి పోయారో ఏమిటో అంటూ ఓ చర్చ అయితే వైసీపీ లోని ఓ వర్గంలో ఊపందుకొంది. 

జులై 4  మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి.  బతుకు తెరువుకి దేశానికి వచ్చి.. భారతీయులను బానిసలుగా చేసిన ఆంగ్లేయులపై విప్లవ శంఖం పూరించిన అగ్గి పిడుగు అల్లూరి 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు.. అదీ ఆయన పుట్టిన గడ్డెపై..  ప్రభుత్వ వర్గాలు ఎంత అట్టహసంగా జరపాలి. కానీ ఆ జాడ.. రాష్ట్రంలో ఎక్కడా.. కనిపించక పోవడంతో ప్రపంచంలోని తెలుగు వారిలో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.  

ఇక పక్క రాష్ట్రం తెలంగాణలోని హైదరాబాద్‌లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు హాజరై అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులర్పించడమే కాకుండా.. ఆయనలోని దేశభక్తి, పోరాట పటిమ..స్ఫూర్తిగా తీసుకోవాలంటూ భవిష్యత్ తరాలకు పిలుపునిచ్చారు. మరి పక్క రాష్ట్రంలో అలా జరిగితే.. ఆయన పుట్టినగడ్డపై ఇంకా ఎంత ఘనంగా నిర్వహించాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? అన్న ప్రశ్నలు వైసీపీ శ్రేణుల నుంచే గట్టిగా వినిపిస్తున్నాయి. 

అదీకాక గత ఏడాది అంటే 2022, జూలై 4వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఇదే ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అప్పటి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్,  కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి,  కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, మంత్రి మంత్రులు  రోజాతో  హాజరయ్యారు. మరి అల్లూరి 125వ జయంతి ఉత్సవాల ప్రారంభానికి హాజరైన.. ఈ ముఖ్యమంత్రివర్యులు.. జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను ఎందుకు అధికారికంగా నిర్వహించలేదని వైసీపీ శ్రేణుల్లోనే అనుమానాలు, అసంతృప్తి వ్యక్తమౌతోంది.  

మరోవైపు అల్లూరి సీతారామారాజు జయంతి ఉత్సవాల వేడుకలు జరపకపోవడానికి జగన్ పార్టీలోని రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలి కారణమని.. ఆయనపై ఆగ్రహంతోనే జగన్ ప్రభుత్వం.. మన్యం వీరుడి జయంతి ఉత్సవాల ముగింపు వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించలేదంటూ మీడియాలో, సామాజిక మాధ్యమంలో   కథనాలు   వెల్లువెత్తుతున్నాయి. అయినా ఇలా ఒకరిపై కోపాన్ని  భారత జాతి కోసం నిప్పు కణంలా మండిన అల్లూరి సీతారామరాజుపై చూపడం సరికాదనే అభిప్రాయం  వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మహానేత పేరుతో విగ్రహాలు, జయంతిలు, వర్దంతిలు, సభలు, సమావేశాలు, ప్లీనరీలు నిర్వహించే ఈ ప్రభుత్వం మన్యం వీరుడి 125వ జయంతి ఉత్సవాలు ముగింపు వేడుకలు.. అదీ ఆయన పుట్టిన గడ్డపై జరపకపోవడం.. కడు శోచనీయమని ప్రజాస్వామిక వాదులు సైతం తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.