జగన్ మావిగన్ బూమరాంగ్.. సొంత పార్టీలోనే వ్యతిరేకత

Publish Date:Apr 14, 2026

Advertisement

 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి అగ్నిగుండంగా మారింది.  మాజీ సీఎం జగన్  తాజాగా తెరపైకి తెచ్చిన  మావిగన్  (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) ప్రతిపాదన  పెను సంచలనానికి దారితీసింది. అయితే, ఈ ప్రతిపాదన పట్ల జనం నుంచి ఇసుమంతైనా సానుకూలత వ్యక్తం కాలేదు. సానుకూలత సంగతి అటుంచి, ప్రతికూలత తీవ్ర స్థాయిలో వ్యక్తం అయ్యింది. జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.  ఈ క్రమంలోనే ముగ్గురు మాజీ మంత్రులు జగన్ తీరును తప్పుబడుతూ గళమెత్తడం పార్టీ అసంతృప్తి, అసమ్మతి ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేసిందంటున్నారు పరిశీలకులు. 

జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదనను ప్రకటించినప్పటి నుండి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. ముఖ్యంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ఏళ్ల తరబడి పోరాటం సాగుతుండగా, మళ్లీ కొత్త ప్రాంతాలను తెరపైకి తెచ్చి ఏం సాధిద్దామనుకుంటున్నారంటూ జగన్ ను నిలదీస్తున్నారు.   క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం  ఈ ప్రాంతంలో పార్టీకి పుట్టగతులుండని పరిస్థితులు ఏర్పడుతున్నాయని వైసీపీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  పార్టీలో కీలకమైన ముగ్గురు నేతలు, మాజీ మంత్రులు ఈ విషయంలో జగన్‌కు గట్టి హెచ్చరికలే జారీ చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఇలాంటి అంశాలను తాము సమర్థించలేమని వారు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారంటున్నారు.  గతంలో రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పటికే కేడర్ ఇబ్బందులు పడుతోందని, ఇప్పుడు  మావిగన్  అంటే ఇక ప్రజల ముందుకు వెళ్లడం అసాధ్యమని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.  అమరావతికి చట్టబద్ధత వచ్చిన తరుణంలో జగన్ మావిగన్ ప్రతిపాదన వ్యూహాత్మక తప్పిదమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ నిర్ణయంతో ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు పార్టీకి తీవ్ర నష్టపోయే అవకాశం ఉంది.  ముఖ్యంగా విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాల్లోని వ్యాపార, వాణిజ్య వర్గాలు కూడా ఈ ప్రతిపాదనపై అయిష్టత వ్యక్తం చేస్తున్నాయి.  జగన్ మావిగన్  నినాదంతోనే ముందుకు సాగితే.. వచ్చే ఎన్నికల నాటికి ప్రజా వ్యతిరేకతే కాకుండా, పార్టీలో అసమ్మతి కూడా పీక్స్ కు చేరు అవకాశం ఉందని అంటున్నారు.   

By
en-us Political News

  
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..!
అర్బన్ నక్సల్, రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు దిమాగీ నక్సల్అ నే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు.
ఈ కొత్త పాలకమండలిలో వివిధ రాష్ట్రాల నుంచి కీలక నాయకులకు చోటు కల్పించారు.  కాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో మొత్తం 13 మంది నాయకులకు అవకాశం దక్కింది. వీరిలో  పురందేశ్వరి ఒకరు. 
వనపర్తి కాంగ్రెస్‌లో టికెట్ వివాదం..నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా..!
ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన మండలిలో ఇరు పార్టీలకు చెందిన నేతలూ.. వ్యక్తిగత దూషణలతో సభలో మాటల యుద్ధానికి దిగారు.  ముఖ్యంగా  మండలిలో విపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల మంటలు రేగాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు.
సెంబ్లీ ఎన్నికలలో తన జన సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ... ఇటీవల బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ బీజేపీ కంచు కోటను బద్దలు కొట్టి మరీ విజయం సాధించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది. 
 ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ..  ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ  సోమవారం ఉత్తర్వులు ారీ చేసింది.  
గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో  వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన  సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం,  షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా  తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు.
వందే మాతరం గేయానికి ఆమె చేసిన అపచారాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఆమెను ఎన్నటికీ క్షమించరన్నారు.  వందేమాతరం గేయానికి చేసిన అపచారానికి ఆ  గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయతో పాటు  40 కోట్ల దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.