ఫస్ట్రేషన్ పీక్స్.. సీఎం నోట బూతుల పంచాంగం!

Publish Date:Jul 21, 2023

Advertisement

ప్రజలలో వ్యతిరేకత తెలిసి ఫ్రస్టేషన్ ఫీలవుతున్నారో.. లేక ఇప్పుడు రాజకీయం అంటే ఇదే అనుకుంటున్నారో కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో తన స్థాయి మరచి ప్రత్యర్థులపై మాటల దాడి చేస్తున్నారు. గత నాలుగేళ్లలో వైసీపీ కోటరీలో కొడాలి నానీ, రోజా లాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నోటి వెంట వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు సైలెంట్ అయ్యారని ప్రత్యక్షంగా జగనే రంగంలోకి దిగినట్లు అనిపిస్తుంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ప్రత్యర్థులపై అమ్మాయిలు, పెళ్లిళ్లు, కాపురాలు, కడుపులు, దౌర్భాగ్యులు, నీచులు వంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే  రాజకీయాలు ఈ స్థాయిలో దిగజారిపోయాయా అనిపిస్తుంది.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనను ఇంటర్వ్యూ చేసిన ఒక విలేఖరి తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు గురించిన ప్రస్తావన చేస్తూ ఏకవచనంలో మాట్లాడారు. వెంటనే కాసు బ్రహ్మానందరెడ్డి ఆ విలేకరిని తీవ్రంగా మందలించారు. అలాగే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డీ కూడా రాజకీయ ప్రత్యర్థులైనా పరస్పరం గౌరవం ఇచ్చి పుచ్చుకునే వారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలూ తప్ప వ్యక్తిత్వ హననానికి పాల్పడే మాటలు వారి నోటి నుంచి మచ్చుకైనా ఎన్నడూ రాలేదు.  అయితే జగన్  అటువంటి రాజకీయ విలువలు, సంస్కారానికి తిలోదకాలిచ్చేశారా అన్నట్లుగా ఆయన మాటలు, ప్రసంగాలు ఉంటున్నాయి. ఇక విషయానికి వస్తే..

ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన సీఎం.. ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమంపై మాట్లాడతారని ఎవరైనా భావిస్తారు. తన కార్యకలాపాలకు ప్రత్యర్ధులు అడ్డు వస్తున్నారని ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టడం సహజం. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం కార్యక్రమం ఏదైనా.. ఎదుట ఎవరు ఉన్నా తన స్థాయిని తానే తగ్గించేసుకునేలా అనుచిత వ్యాఖ్యలకు దిగుతున్నారు.

  వెంకటగిరిలో సీఎం జగన్ ‘వైఎస్‌ఆర్‌ నేతన్న హస్తం’ పథకం కింద ఆర్థికసాయాన్ని విడుదల చేశారు. ఈ సభలో మాట్లాడిన జగన్.. వాలంటీర్లపై కొందరు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైరయ్యారు. వాలంటీర్లపై తప్పుడు వ్యాఖ్యలకు నిర్మాత చంద్రబాబే అని.. పదేళ్లుగా చంద్రబాబుకు ప్యాకేజీ స్టార్‌ వాలంటీర్‌ గా పనిచేస్తున్నారని విమర్శించారు. అంతేకాదు, క్యారెక్టర్‌ లేని వాళ్లంతా వాలంటీర్ల గురించి మాట్లాడతారా అని ధ్వజమెత్తారు. వాలంటీర్లపై తప్పుడు వ్యాఖ్యలకు నిర్మాత చంద్రబాబేనని.. నటన, మాటలు మాత్రమే దత్తపుత్రుడివని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా  ఆయన శృతి మించారు.  

దత్తపుత్రుడికి అమ్మాయిలను లోబర్చుకుని పెళ్లి చేసుకోవడం, నాలుగేళ్లు కాపురం చేయడం..  వదిలేయడం చేస్తాడని.. మళ్లీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం మళ్లీ వదిలేయడం అలవాటన్నారు. 10 మంది అమ్మాయిలతో స్విమ్మింగ్‌పూల్‌లో డ్యాన్స్ చేస్తూ మందుతాగుతూ మరొకరు ఉంటారని అన్నారు. ఇది లోకేష్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యగా కనిపిస్తుంది. అంతటితో ఆగని జగన్..   అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి లేదా కడుపైనా చేయాలని ఇంకో దౌర్భాగ్యుడు అంటాడని నందమూరి బాలకృష్ణపై సెటైర్లు వేశారు. ఇక, 75 ఏళ్ల వయసొచ్చినా చంద్రబాబుకి సిగ్గులేదని, బావమరిది నువ్వు సినిమాల్లోనే చేశావు, నేను నిజ జీవితంలో చేశానంటూ చేసిన వెధవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసలాయన అని చంద్రబాబునాయుడిపై కూడా వ్యాఖ్యలు చేశారు. 

జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అంటూ నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణ సీఎం, మంత్రులను చూసైనా వైసీపీ నేతలు బుద్ది తెచ్చుకోవాలని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. మరికొందరైతే రానున్న ఎన్నికలలో ఫలితాలేంటో జగన్ మోహన్ రెడ్డికి తెలిసిపోయిందని.. అందుకే ఫ్రస్టేషన్ లో  బూతులు లంకించుకుంటున్నారని సెటైర్లు వేస్తున్నారు. ఇక జనసేన కార్యకర్తలైతే జగన్ తాత, ముత్తాల దగ్గర నుండి రెండు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళ జాబితా అంతా బయటపెట్టి మరీ విమర్శిస్తున్నారు.   టీడీపీ నేతలైతే జగన్ వ్యాఖ్యలను మతి స్థిమితం లేని వ్యాఖ్యలుగా కొట్టి పారేస్తున్నారు. జగన్ బూతుల పంచాంగం  ఎంతవరకూ వెళ్తుందో.. ఇంకెంత దిగజారుడు వ్యాఖ్యలు వినాల్సి వస్తుందో చూడాలి మరి.

By
en-us Political News

  
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.