డొనాల్డ్ ట్రంప్ కు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని షాక్.!
Publish Date:Jul 9, 2026
Advertisement
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల మధ్య ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై హాట్ టాపిక్‌గా మారింది. ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న సైనిక దాడులకు తాము ఎంతమాత్రం సహకరించబోమని.. ఇటలీలో ఉన్న తమ సైనిక స్థావరాలను అమెరికా ఇరాన్ పై దాడుల కోసం ఉపయోగించుకోవడానికి అనుమతించే ప్రసక్తే లేదని జార్జియా మెలోనీ విస్ఫష్టంగా తేల్చి చెప్పారు. టర్కీ రాజధాని అంకారా వేదికగా జరుగుతున్న నాటో సదస్సులో పాల్గొన్న జార్జియా మెలోని, ప్రపంచ దేశాల ప్రతినిధులు, మీడియా సమక్షంలో ఇరాన్ పై దాడులకు సహకరించే ప్రశక్తే లేదని ప్రకటించి అగ్రరాజ్యాధినేత ట్రంప్ కు గట్టి షాక్ ఇచ్చారు. పశ్చిమాసియా సంక్షోభంపై ఇటలీ మొదటి నుండి ఒకే స్థిరమైన విధానాన్ని అవలంబిస్తోందన్న ఆమె.. భవిష్యత్తులోనూ తాము ఇలాంటి దాడుల్లో భాగస్వాములం కాబోమని కుండబద్దలు కొట్టారు. జార్జియా మెలోని చేసిన ఈ సంచలన ప్రకటన వెనుక ఒక బలమైన రాజకీయ ఘర్షణ దాగి ఉంది. ఈ నాటో సదస్సుకు కేవలం ఒక రోజు ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటలీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న సైనిక చర్యలకు మద్దతు ఇవ్వడానికి ఇటలీ నిరాకరించడం ఆ దేశం చేస్తున్న ఘోరమైన తప్పదిమంటూ బహిరంగంగా మండిపడ్డారు. అమెరికా లాంటి అగ్రరాజ్యం అధినేత నేరుగా తమ విధానాన్ని తప్పుబడుతూ విమర్శలు చేసినప్పటికీ.. జార్జియా మెలోని తగ్గేదే లే అన్నట్లుగా.. నాటో సదస్సు వేదికగానే అమెరికాకు, ట్రంప్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. తమ జాతీయ ప్రయోజనాలు, శాంతి స్థాపనే తమకు ముఖ్యమని ఇటలీ ప్రధాని విస్పష్టంగా చెప్పారు. పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలో, అమెరికా వ్యూహంతో తాము ఏకీభవించడం లేదని నాటో సభ్యదేశమైన ఇటలీ బహిరంగంగా ప్రకటించడం అంతర్జాతీయ దౌత్య వర్గాలను విస్మయానికి గురిచేసింది. సాధారణంగా నాటో కూటమిలో అమెరికా నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్లడానికి చాలా దేశాలు వెనుకాడతాయి. కానీ.. ఇటలీ ప్రధాని మెలోని మాత్రం ట్రంప్ విమర్శలు చేసినా, తమ దేశ సార్వభౌమాధికారాన్ని, స్థిరమైన విదేశాంగ విధానాన్ని కాపాడుకోవడానికే మొగ్గు చూపారు. ఈ పరిణామం అమెరికా , ఇటలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందా అన్న ఉత్కంఠ ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతున్నది. అగ్రరాజ్యం ఒత్తిళ్లకు తలొగ్గకుండా మెలోని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇటు ఇటలీ దేశ ప్రజల్లోనూ, అటు అంతర్జాతీయంగా యుద్ధ వ్యతిరేక శక్తుల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. అన్ని వర్గాల నుంచీ మెలోనీకి మద్దతు పెరుగుతోంది. Italy Iran strikes, NATO Summit Ankara, US Italy relations, West Asia tensions
http://www.teluguone.com/news/content/italian-prime-minister-giorgia-meloni-shock-to-donald-trump-36-225477.html





