భారత్ సమ్మిట్ వివాదం: తెలంగాణ BJP నేతలపై అమిత్ షా ఆగ్రహం.!
Publish Date:Nov 16, 2026
Advertisement
ఇటలీ నేత ఫిలిబెక్ వ్యాఖ్యలపై కమలనాథుల ఫైర్.! హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. సమ్మిట్లో ఇటలీకి చెందిన రాజకీయ ప్రతినిధి ఫిలిప్పో ఫిలిబెక్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నాయకత్వం వెంటనే స్పందించలేదన్న విమర్శలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. విదేశీ ప్రతినిధులు భారతదేశానికి వచ్చి ఇక్కడి రాజకీయ అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే.. రాష్ట్ర స్థాయి నాయకులు ఉదాసీనంగా ఉండటం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. చట్టపరమైన మార్గాల్లో ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు, కాన్ఫరెన్స్ వీసాపై భారత్కు వచ్చిన విదేశీ ప్రతినిధులు స్థానిక రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వీసా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందా? అనే అంశంపైనా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని తేలితే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే, భారత్ సమ్మిట్ 2026లో విదేశీ రాజకీయ ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు. తన న్యాయ బృందంతో కలిసి సంబంధిత విదేశీ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO)కు ఫిర్యాదు చేశారు. సమ్మిట్లో చేసిన వ్యాఖ్యలపై పార్టీ అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో ఈ వివాదం మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరే అవకాశం ఉంది. అమిత్ షా అసంతృప్తి నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మీకు నచ్చవచ్చు: విజయ డెయిరీ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు కీలక తీర్పు.! మీకు నచ్చవచ్చు: 14 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు..భార్యతో విడాకులు ప్రకటించిన మంత్రి ఆధవ్ అర్జున.! [ Italian leader Filipes remarks at India Summit, Amit Shah, TG BJP Leaders, Filippo Filibeck, Bharat Summit Hyderabad, TeluguOne News ]
http://www.teluguone.com/news/content/italian-leader-filipes-remarks-at-india-summit-25-237226.html




