బీఆర్ఎస్ పై ఐటీ పంజా.. షా పర్యటన ముందు రాజకీయ హీట్

Publish Date:Jun 14, 2023

Advertisement

తెలంగాణ బీఆర్ఎస్ కీలక నేతల నివాసాలు, కార్యాలయాలపై ఇన్ కంట్యాక్స్ దాడులు కలకలం రేపాయి. వరుసగా ముగ్గురు కీలక నేతల ఇళ్లు, ఆఫీసులు, వ్యాపార సంస్థల్లో  ఐటీ దాడులతో ఒక్క సారిగా రాజకీయ వేడి రగులుకుంది. ఇటీవలి కాలంలో  రాష్ట్రంలో ఐటీ దాడుల సంఖ్య తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా కొంత కాలం కిందట బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా జరిగిన దాడుల తీవ్రత  పూర్తిగా తగ్గిపోవడం వెనుక బీజేపీ  కేసీఆర్ కూడా విమర్శలు బంద్ చేయడమే కారణమన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.

ఈ నేపథ్యంలోనే ఒకే సారి ముగ్గురు బీఆర్ఎస్ కీలక నేతలు లక్ష్యంగా ఐటీ దాడులు జరగడం సంచలనం సృష్టించింది.  భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల నివాసాలు, కార్యాలయాలలో  దాదాపు 50 ఐటీ బృందాలు సోదాలు చేపట్టారు. వీరి  నగదు లావాదేవీలపైన ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. ఈ  ముగ్గురూ   బీఆర్ఎస్ కి చెందిన నగదును తమ వ్యాపార సంస్థల ద్వారా సర్క్యూలేట్ చేస్తున్నారన్న ఆరోపణలతో సోదాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. మర్రి జనార్ధన్ రెడ్డికి.. వస్త్ర, జ్యూయలరీ వ్యాపారాలు ఉన్నాయి.  కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎం నియోజకవర్గం గజ్వేల్ ను చూసుకుంటున్నారు. సీఎం తరపున ఆయనే అన్నీ చక్క బెడుతూ ఉంటారు.

పైళ్ల శేఖర్ రెడ్డికి రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు కంపెనీలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.  ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురి నివాసాలు కార్యాలయాలపై ఐటీ దాడులు బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయి.  రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలపై దర్యాప్తు సంస్థలు నజర్ ఇటీవలి కాలంలో  బీజేపీతో ఆ పార్టీ  ఒక అవగాహనకు వచ్చిందన్న ప్రచారం ఇటీవలి కాలంలో  జోరుగా సాగుతుండటం అదీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కమలం  పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారింది. ఒక వైపు కేసీఆర్ మోడీ, బీజేపీ లక్ష్యంగా విమర్శలకు చుక్క పెట్టేయడం, అదే సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల  చంద్రశేఖరరావు కుమార్తె కవితపై దర్యాప్తు  సంస్థల విచారణ వేగం మందగించడంతో బీజేపీ, బీఆర్ఎస్ లు ఒక గూటి పక్షులే అన్న భావన పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అయ్యింది.  

అయితే ఇప్పుడు ఐటీ అధికారులు ముగ్గురు బీఆర్ఎస్ నేతల నివాసాలూ , కార్యాలయాల్లో  సోదాలు  నిర్వహిస్తుండటం, ఆ సోదాలు  చేస్తున్న ఐటీ అధికారులు కేంద్ర బలగాలను భద్రతగా  తెచ్చుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా ఈ సోదాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు సరిగ్గా  ఒక్క రోజు ముందు జరగడం ఆ ప్రాధాన్యతను మరింత పెంచింది.

 కొండాపూర్ లోని లుంబిని ఎస్ఎల్ఎన్ స్ప్రింగ్స్ విల్లాస్ లోని కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో  బుధవారం (జూన్14) తెల్లవారుజాము నుంచే సోదాలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఆయన కార్యాలయాలలో కూడా  సోదాలు జరుగుతున్నాయి. అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని మర్రి జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలతో పాటు నగరంలోని వివిధ రియలెస్టేట్ సంస్థల కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ లో కూడా రెయిడ్స్ జరుగుతున్నాయి.  

By
en-us Political News

  
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.