హైదరాబాద్‌లో ఐటీ దాడులు.. మరో గోల్డ్ మాన్ వద్ద రూ. కోటి బంగారం స్వాధీనం

Publish Date:Apr 3, 2026

Advertisement

హైదరాబాద్‌లో భారీగా బంగారు ఆభరణాలు ధరించి ప్రజల్లో తిరుగు తున్న వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించారు. ఇటీవల వరుసగా గోల్డ్ మాన్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.ఇంతకుముందు కొండ విజయ్ కుమార్ వద్ద అధికారులు భారీ ఎత్తున బంగారం స్వాధీనం చేసుకోగా, మరో కేసులో సూర్య భాయ్ ధరించిన ఆభరణాల్లో ఎక్కువ భాగం కోటెడ్ లేదా రోల్డ్ గోల్డ్ గా తేలిన విషయం తెలిసిందే.  ఇప్పుడు తాజాగా మరో వ్యక్తి ఐటీ అధికారుల వలలో చిక్కాడు. నగరానికి చెందిన యాదగిరి చిన్నగౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ వద్ద నుంచి సుమారు రూ.1 కోటి విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

భారీగా బంగారు ఆభరణాలు ధరించి సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూ ఉండటంతో చిన్న పహిల్వాన్‌పై ఐటీ శాఖ దృష్టి పెట్టింది. టీవీ ఇంటర్వ్యూలు, యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టులను పరిశీలించిన తర్వాత విచారణ ప్రారంభించింది. విచారణలో అతని వద్ద 900 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించి, అందులో 700 గ్రాముల బంగారు ఆభరణాలకు సరైన లెక్కలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుంది. వ్యక్తిగత వినియోగానికి చెందిన 150–200 గ్రాముల బంగారాన్ని తిరిగి ఇచ్చినట్లు సమాచారం. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం–2025లోని సెక్షన్ 247 కింద జారీ చేసిన తొలి వారెంట్ ఇదే కావడంతో ఈ కేసు  ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.  

స్వాధీనం చేసిన బంగారం అద్దె ఆదాయం, భూముల కొనుగోలు–అమ్మకాల ద్వారా వచ్చిందని చిన్న పహిల్వాన్ చెప్పినా, సరైన ఆధారాలు చూపలేకపోయినట్లు అధికారులు తెలిపారు. ఐటీ రిటర్నుల్లో కూడా తక్కువ ఆదాయం మాత్రమే చూపినట్లు వెల్లడించారు. భూములను జీపీఏలపై కొనుగోలు చేసి, అధిక ధరకు మళ్లీ అమ్మి నగదు రూపంలో లాభాలు పొందినట్టు విచారణలో గుర్తించినట్లు సమాచారం.కుటుంబ సభ్యుల ఆర్థిక వ్యవహారాలపై కూడా అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారు. ఒక కుటుంబ సభ్యుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తుండగా, మరొకరు హాస్టల్ వ్యాపారం ద్వారా ఆదాయం చూపించినట్లు తెలిసింది.
 

By
en-us Political News

  
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిత అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రముఖ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.
వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.   ఆమె భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం చెన్నైలోని తేనాంపేట, సెంట్ ఆఫ్‌ రోడ్‌లో ఉన్న ఆమె నివాసంలో ఉంచారు.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుంది.. !
రాష్ట్రపతికి సునీత లేఖ తర్వాత కేసును ఈడీ టేకాఫ్..!
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగుతోంది.
 ఘటనా స్థలాన్ని సందర్శించిన మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. భద్రతా నియమాలు పాటించకపోవడం, క్రమశిక్షణా రాహిత్యం కారణంగానే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్థారంచారు.  
 సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ పరిధిలోని ఎయిల్ జిల్లా మార్రాయా తీరానికి   3.5 నాటికల్ మైళ్ల   దూరంలో ఎనిమిది మంది సాయుధులైన సోమాలియా పైరేట్లు   నౌకపైకి విరుచుకుపడి, దానిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నౌకను నుగాల్ తీరం వైపు  మళ్లించారు.
లండన్ తో పాటు అమెరికాలోని ప్రముఖ నగరాలైన బోస్టన్, న్యూయార్క్ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇందుకు సంబంధించిన  షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
ఆ వివాదాల పరిష్కారం దిశగా ముందుకు సాగేందుకు సదరన్ జోనల్ కౌన్సల్ దోహదం చేసిందన్న ఆశను రేకెత్తించింది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ( తెలంగాణ సీఎం మినహా) ఒకే వేదికపై కనిపిండమే కాకుండా ఆత్మీయంగా ముచ్చటించుకుంటున్న దృశ్యం కన్నుల పండువగా ఉంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.