మంత్రుల గుండెల్లో గుబులు.. వెంటాడుతున్న అరెస్ట్ భయం

Publish Date:Nov 23, 2022

Advertisement

ఆట మొదలైంది.. కాదు.. కాదు.. ఆట క్లైమాక్స్ కు చేరింది.  అయితే, చివరకు ఏమి జరుగుతుంది? ఎండ్ రిజుల్ట్  ఏమిటి? ప్రధాని నరేంద్ర మోడీ పై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు విజయం సాధిస్తారా, లేక ఇటీవల  పునరుద్ధరించిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా ప్రధాని మోడీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబపాలన,అవినీతి పాలనను ఎండగడుతూ తెలంగాణలో   కమల వికాసం ఖాయమంటూ చేసిన హెచ్చరిక, అందుకు అనుబంధంగా  తెలంగాణ రాజకీయాలు ఇకపై రంజుగా ఉంటాయంటూ వినిపించిన భవిష్యవాణి నిజం అవుతుందా అనేది చూడవలసి వుంది.

అయితే,అక్కడ కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెరాసల నడుమ జరుగతున్న రాజకీయ పోరాటానికి, ఉభయ పక్షాలూ  దర్యాప్తు సంస్థలను అస్త్రాలుగా చేసుకోవడంతో  ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే ఆందోళన ఉభయ పార్టీ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.ఓ వంక కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ లిక్కర్ స్కామ్, మరో వైపు తెరాస ఎమ్మెల్యేల ఎర కేసు పోటాపోటీగా ఉత్కంఠ రేకేతిస్తుంటే, మరో వంక తెరాస మంత్రులు, నాయకులు లక్ష్యంగా జరుగతున్న ఐటీ దాడులు మరింత రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి.

నిజానికి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నెలరోజులకు పైగానే తెరాస ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుట్ల కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయినా ఇంతవరకు ఈ కేసును విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యక్షంగా ఎక్కడా ఆమె పేరు ఎత్తలేదు. ఆమెకు నోటీసు అయినా యివ్వలేదు. కానీ, ఈ కుంభకోణంలో ఆమెదే కీలక పాత్ర అని నిరూపించే దిశగా పావులు కదులుతున్నాయనే, సంకేతాలు మాత్రం స్పష్టమవుతున్నాయి. అందుకే,అమెలోనే కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్  కుటుంబంలో, తెరాస నాయకుల్లో కలవరపాటు కనిపిస్తోంది.  

అంతే కాదు, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత  వైపు వేలెత్తి చూపించే అవకాశాన్ని, తెరాస నాయకత్వమే కల్పిస్తోందా, అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కవితను తమ పార్టీలోకి రావాలని బీజేపీ నాయకత్వం ఆమెపై వత్తిడి తెచ్చిందని చేసిన ప్రకటన ఉద్దేశం ఏదైనా  పలు అనుమానాలకు ఆస్కారం కల్పించిందని అంటున్నారు. అంతకు ముందు కవితను వెంట పెట్టుకుని ముఖ్యమంత్రి పది రోజులు ఢిల్లీలో మకాం చేయడం, ఈ  పది రోజుల్లో ఆయన ఏమి చేశారు అనే విషయంగా వస్తున్న కథనాలు లిక్కర్ స్కాం కు సంబంధించి కవిత రియాక్షన్స్,  అలాగే ఆమె ఆకస్మిక ఢిల్లీ పర్యటనలు ఇంకా అనేక పరిణామాలు ఆమె  వైపు వేలెత్తి చూపించే అవకాశాన్ని, కల్పిస్తున్నాయని అంటున్నారు. 

అలాగే, కవితను లిక్కర్ స్కాం నుంచి కాపాడేందుకే ముఖ్యమంత్రి, తెరాస ఎమ్మెల్యేల ఎర కేసును తెర మీదకు తెచ్చారనే అభిప్రాయం బలపడుతోంది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన, ‘సిట్’  సాగిస్తున్న దర్యాప్తు  బీజీపీ నాయకులని ఇరకాటంలోకి నెట్టింది. ఏకంగా, బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసు ఇవ్వడంతో, బీజేపీతో పాటుగా రాష్ట్రీయ స్వయం సీవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ను ఎమ్మెల్యేల ‘ఎర’ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని, బీజేపీ అగ్ర నాయకత్వం గుర్తించింది. అందుకు కౌంటర్ గా మంత్రులు టార్గెట్ గా ఐటీ దాడులకు తెర లేపింది. నిజమే, ఐటీ దాడులు కొత్త విషయం కాదు కానీ, మంత్రులే టార్గెట్ గా ఐటీ దాడులు జరగడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. 

మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఐటీ దాడుల్లో చిక్కిన మంత్రులు చాలా వరకు జైలు పాలయ్యారు లేదా జైలుకు వెళ్లే దారిలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమత బెనర్జీకి అత్యంత సన్నిహితునిగా  పేర్కొనే, పార్థ చట్టేర్జీని, ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన  సత్యేంద్ర జైన్, మహారాష్ట్రలో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మంత్రివర్గంలో కీలక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు నవాబ్ మాలిక్,  అలాగే, ఐటీ దాడులలో చిక్కుకున్న ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,  నాయకులు, అరెస్ట్ కావడంతో, ఇప్పడు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులోనూ గుబులు మొదలైంది. ముఖ్యంగా ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థల ఉచ్చులో చిక్కున్న మంత్రులు ఎప్పడు ఏమవుతుందో అని భయపడుతుంటే, రేపు ఏమవుతుందో అని మరికొందరు మంత్రులు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు.

కేసినో వ్యవహారంలో తలసాని కుటుంబంపై ఈడీ నజర్ పడింది.  గతంలో ఈ  వ్యవహారానికి సంబంధించి చీకోటి ప్రవీణ్ ను విచారించింది ఈడీ. అతను చెప్పిన వివరాల ఆధారంగా కొందరు టీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. అవన్నీ ఒకెత్తు అయితే  ఇప్పడు  మంత్రి తలసాని కుటుంబ సభ్యులు, ఆయన పీఏ ఇతర సన్నిహితులను ఈడీ విచారించింది. అలాగే  అక్రమంగా విదేశాలకు గ్రానైట్ తరలించారనే పాత కేసుకు సంబంధించి మంత్రి గంగుల కమలాకర్ కంపెనీలు, ఇల్లు, ఇతర అనుమానిత ప్రదేశాల్లో ఈడీ, ఐటీ, అధికారులు తనిఖీలు నిర్వహించారు. తాజాగా మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన సోదరులు, కుమారులు, అల్లుడి నివాసాల్లో, విద్యా సంస్థల్లో, లావాదేవీలకు సంబంధించిన బ్యాంకుల్లో ఐటీ సోదాలకు దిగింది. భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

దీంతో, మంత్రులలో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మంత్రి మల్లారెడ్డి బంధు, మిత్రుల ఇళ్లు, ఆయన కాలేజీలు, కార్యాలయాలపై దాడులు కొనసాగుతున్న సమయంలోనే  అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనాయకులతో  అత్యవసర సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఈడీ, ఐటీ దాడుల దృష్ట్యా నేతలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి సూచించారని అంటున్నారు. అయితే, పార్థ చట్టేర్జీ, సత్యేంద్ర జైన్, నవాబ్ మాలిక్ ఉదంతాలు కళ్ళముందు కదలాడుతున్న మంత్రులు ఇతర నాయకులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి, 40కి పైగా తెరాస ఎమ్మెల్యేలపై ఇప్పటికే కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో తెరాస నాయకులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని అంటున్నారు.

By
en-us Political News

  
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.