Publish Date:Nov 23, 2022
మంత్రి మల్లారెడ్డి నివాసాలు కార్యాలయాలు సహా ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి నివాసం, కార్యాలయం అలాగే బంధువులు సన్నిహితుల నివాసాలలో ఐటీ దాడులు జరుగుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు సురారంలోని ఒక ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయన ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుమారులు, కుమార్తె, అల్లుడు, వియ్యంకుడి ఇళ్లలో నిన్న ఉదయం నుంచీ ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి విదితమే. సోదాల నేపథ్యంలో మహేందర్ రెడ్డి నిన్నటి నుంచీ తన నివాసంలోనే ఉన్నారు. ఇంతలో ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. మంగళవారం అర్ధరాత్రి వరకు సోదాలు చేసిన ఐటీ అధికారులు ఎక్కడ సోదాలు నిర్వహిస్తున్నారో అక్కడే ఆ రాత్రి పడుకున్నారు. కాగా ఈ సోదాలలో భారీ ఎత్తున నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇలా ఉండగా అస్వస్థతకు గురైర మహేందర్ రెడ్డి మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. ఇలా ఉండగా మంత్రి మల్లారెడ్డి సోమవారం ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. తెలంగాణలో మోడీ ఆటలు సాగవని పేర్కొన్నారు.
మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఐటీ దాడులు ప్రారంభం కావడం విశేషం. అదలా ఉంచితే తన కుమారుడిని ఐటీ అధికారులు ఐటీ రెయిడ్స్ పేరుతో వేధించడమే కాకుండా కొట్టారని మంత్రి ఆరోపించారు.
తన కుమారుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకు వచ్చిన మల్లారెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. వారు భౌతిక దాడికి పాల్పడటం వల్లనే తన కుమారుడు ఆసుపత్రి పాలయ్యారన్నారు. రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు చేస్తున్నారని విమర్శించారు. రు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/it-officers-man-handled-my-son-says-minister-mallareddy-25-147529.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.