మంత్రి మల్లారెడ్డిపై ఆర్నెళ్ల ముందునుంచే ఐటీ నజర్?!

Publish Date:Nov 24, 2022

Advertisement

ఐటీ దాడుల్లో మంత్రి మల్లారెడ్డి అడ్డంగా దొరికేశారా? కేంద్రంతో కాలు దువ్విన కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకే వరుసగా తెరాస నేతల నివాసాలు, కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నజర్ పెట్టాయా అంటే ఔననే పరిస్థితులే ఉన్నా.. మల్లా రెడ్డి వ్యవహారం కొంచం డిఫరెంట్ అంటున్నారు

పరిశీలకులు. మల్లారెడ్డి వ్యాపారాలు, నివాసాలపై ఐటీ అధికారుల దాడులు కేవలం ప్రస్తతం ఉన్న రాజకీయ వాతావరణం నేపథ్యంలో చేసినవే అనుకోవడానికి వీల్లేదంటున్నారు.  గత కొన్ని నెలలుగా మల్లారెడ్డి వ్యాపార కార్యక్రమాలపై, కార్యకలాపాలపై ఐటీ నజర్ పెట్టిందంటున్నారు. ఏదో రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టించేందకు జరిగిన దాడులలో వీటిని లైట్ తీసుకోవడానికి వీల్లేనంతగా మల్లారెడ్డి ఇరుక్కున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి.

గత కొన్ని నెలలుగా ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి వ్యాపార కార్యక్రమాలు మ‌ల్లారెడ్డి వ్యాపారాల‌పై ఐటీ అధికారులు దాడులను ఒక‌టిరెండు రోజుల్లో ప్లాన్ చేసింది కాద‌ట‌. గ‌త ఆర్నెళ్లుగా ఐటీ అధికారులు మంత్రి మ‌ల్లారెడ్డి, వారి కుటుంబ స‌భ్యుల అకౌంట్‌ల‌లో న‌గ‌దు వివ‌రాల‌పైనా ఆరా తీస్తున్నారంటున్నారు.   రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులుగా, తమ భూమిని కొనుగోలు చేయాలంటూ మంత్రి వ‌ద్ద‌ ఐటీ అధికారులు స్టింగ్ ఆపరేషన్ కూడా నిర్వహించారని విశ్వసనీయంగా తెలిసింది.

వీటన్నిటినీ బట్టి చూస్తే పక్కా ప్రణాళికతోనే మల్లారెడ్డి వ్యాపారాలపై  ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.  మంగ‌ళ‌వారం(నవంబర్ 22) రాత్రి వేర్వేరు చోట్ల నిర్వహించిన సోదాలలో దాదాపు రూ.4 కోట్ల రూపాయల నగదు, ఐటీ రిటర్నులు, పన్ను చెల్లింపులకు సంబంధించిన సీడీలు, కంప్యూటర్ డిస్క్ లు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. బుధ‌వారం(నవంబర్ 23)సైతం కీల‌క ప‌త్రాల‌ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌మాచారం.  

మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై నిర్వహించిన ఐటీ దాడులు ముగిశాయి. సోమవారం నాడు తమ విచారణకు హాజరుకావాలంటూ మల్లారెడ్డి సహా, ఆయన కుమారులు, అల్లుడికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.  ఇప్పటి మల్లారెడ్డి, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో జరిపిన సోదాలలో స్వాధీనం చేసుకున్న నగదు వివరాలనూ ఐటీ అధికారలు వెల్లడించారు. ఆ ప్రకారం మల్లారెడ్డి నివాసంలో - రూ. 6 లక్షలు, మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి నివాసంలో - రూ. 12 లక్షలు, మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి నివాసంలో - రూ. 6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి నివాసంలో - రూ. 3 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో - రూ. 1.5 కోట్లు, త్రిశూల్ రెడ్డి నివాసంలో - రూ. 2 కోట్లు, రఘునందన్ రెడ్డి నివాసంలో - రూ. 2 కోట్లు, ప్రవీణ్ కుమార్ నివాసంలో - రూ. 2.5 కోట్లు, సుధీర్ రెడ్డి నివాసంలో - రూ. కోటి స్వాధీనం చేసుకున్నారు. 

By
en-us Political News

  
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.