Publish Date:Dec 30, 2024
ప్రధాని నరేంద్రమోడీ ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశ వాణి ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఆయన తన మన్ కీ బాత్ లో కొందరు ప్రముఖుల పేర్లు ప్రస్తావించి వారు ఆయా రంగాలలో దేశానికి చేసిన సేవలను ప్రస్తుతించారు. అందులో భాగంగానే ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు ప్రస్తావించి దేశ సంస్కృతి, విలువలకు అద్దం పట్టేలా అద్భుతమైన సినీమాలు చేశారని ప్రశంసలు గుప్పించారు. అక్కినేనితో పాటుగా ఆయన బాలీవుడ్ తొలి సూపర్ స్టార్ అని చెప్పుకోదగ్గ రాజ్ కపూర్, అలాగే అద్భుత గాయకుడు మహ్మద్ రఫీ తదితరుల పేర్లు కూడా ప్రస్తావించారు.
దీంతో తెలుగు రాష్ట్రాలలో కొందరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీయులు సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోడీ ఉద్దేశ పూర్వకంగానే తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరు విస్మరించారంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెట్టేశారు. ఎన్డీయేలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్నప్పటికీ మోడీ తెలుగుదేశం పార్టీని ఇసుమంతైనా ఖాతరు చేయడం లేదనీ, అందుకు తార్కానం తన మన్ కీబాత్ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు పేరు మాత్రమే ప్రస్తావించి, ఎన్టీఆర్ ను విస్మరించారనీ విష ప్రచారం మొదలు పెట్టేశారు.
ఇక్కడ వారు ఉద్దేశపూర్వకంగా విస్మరించిన విషయమేమిటంటే.. ఇది ఏఎన్నార్ శత జయంతి సంవత్సరం. అలాగే నటుడు రాజ్ కపూర్, గాయకుడు మహ్మద్ రఫీల శతజయంతి సంవత్సరం కూడా. అందుకే ప్రధాని మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో వారి పేర్లు ప్రస్తావించి, వారి సేవలను గుర్తు చేసుకున్నారు. అయితే మోడీ మన్ కీబాత్ ను వక్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారి కుత్సితత్వాన్ని బయట పెట్టుకున్నారు. తెలుగు సీని పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ల వంటి వారు. నటన విషయంలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువా అని చెప్పడానికి అవకాశం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/it-is-akkineni-nageswararao-centenary-year-25-190533.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.