సైబరాబాద్ సృష్టికర్త అక్రమ అరెస్టును ఖండించవా కేటీఆర్!

Publish Date:Sep 16, 2023

Advertisement

ఏపి స్కిల్డ్ డెవలప్‌మెంట్ స్కీంలో స్కాం   ఆరోపణలతో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీంతో స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఏమో కానీ.. పక్క రాష్ట్రం తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లోని సైబరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆందోళనలు, ధర్నాలతో కదం తొక్కారు..  తొక్కుతున్నారు. 

ఇటీవల విప్రో సర్కిల్ వద్ద సాప్ట్‌వేర్ ఉద్యోగులు ఆందోళన చేయడమే కాకుండా.. తమ సత్తా ఏమిటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామంటూ క్లియర్ కట్‌గా జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఐ యామ్ విత్  బాబు అంటూ చంద్రబాబుకు మద్దతుగా   ప్లకార్డులు ప్రదర్శించారు. ఇక హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కూడా చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా   ఆందోళనలు, కార్ల ర్యాలీలు సైతం చేపట్టారు. 

అయితే చంద్రబాబు అరెస్ట్‌పై హైదరాబాద్   ఆందోళనలు, ధర్నాలకు దిగడంపై  పోలీసులు గరం గరం అవుతున్నారు. ఆ క్రమంలో సదరు ఈ ఆందోళనల్లో పాల్గొన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు పోలీసులు షాక్ ఇచ్చారు. అనుమతులు లేకుండా ధర్నాలు ఆందోళనలకు దిగితే.. కఠిన చర్యలు తప్పవని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను హెచ్చరించారు. 

ఓ వేళ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆందోళనకు దిగితే... వారు విధులు నిర్వహిస్తున్న ఆయా కంపెనీలకు సైతం నోటీసులు జారీ చేయాల్సి ఉంటుందని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.  

అయితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైబరాబాద్ నగరం ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే..   నాడు చంద్రబాబు నాయుడు దార్శనికతతో చేపట్టిన కార్యక్రమాల వల్లేనని వారు  అంటున్నారు. అటువంటి చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ సర్కార్ ఖండిచాలనీ, అది పోయి చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న వారిపై జులుం ఎమిటనీ నిలదీస్తున్నారు. 

హైదరాబాద్‌లో ఐటీ అభివృధికి బాటలు వేసింది నారా చంద్రబాబు నాయుడు అంటూ ఇప్పటికే పలు వేదికల మీద నుంచి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  స్వయంగా ప్రకటించిన సంగతిని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  అదీకాక.. తెలంగాణలో ఐటీ ఎగుమతులు లక్ష కోట్ల రూపాయిల మార్క్ దాటిందంటూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పలు సందర్భాలలో మీడియా సమావేశాలలో చెప్పారనీ, తెలంగాణ ఆ ఘనత  సాధించడానికి   పునాది వేసింది చంద్రబాబేననీ నెటిజన్లు నిర్ద్వంద్వంగా పేర్కొంటున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిలదీస్తున్న, ఆందోళనలు చేస్తున్న వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు పలకాలనీ, స్వయంగా కేటీఆర్ చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ బహిరంగ ప్రకటన చేయాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు.

అంతేకాదు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఆందోళనలో  ప్రత్యక్షంగా పాల్గొనాలనీ, తద్వారా హైదరాబాద్ నేటి ఈ స్థితికి కారణమైన చద్రబాబుకు థాంక్స్ చెప్పాలనీ సూచిస్తున్నారు.  అయినా.. హైదరాబాద్ నగరం ట్విన్ సిటీస్ స్థాయి నుంచి ట్రిపుల్ సిటీ స్థాయికి ఎదిగిందంటే.. అదంతా నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే కారణమని నెటిజన్లు ఈ సందర్బంగా సోదాహరణగా వివరిస్తున్నారు.    

అయితే.. తెలంగాణలోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆందోళనలకు దిగితే.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చి.. సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు.. గతంలో చంద్రబాబు వల్లే.. ఇక్కడ ఇంత అభివృద్ధి జరిగిందనే ఓ ప్రచారం అయితే ప్రస్తుతం ఊపందుకొందని.. ఆ నేపథ్యంలో ప్రభుత్వంలోని పెద్ద తలకాయాలు.. రంగంలోకి దిగి సైబరాబాద్‌లో ఆందోళనలు, ధర్నాలు చేపట్ట వద్దంటూ.. పోలీసు ఉన్నతాధికారులకు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసి ఉండవచ్చని.. ఈ నేపథ్యంలో సాఫ్ట్ వేరు ఉద్యోగులు చేపడుతోన్న ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారనే ఓ ప్రచారం సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.