ఐటీ కారిడార్ రెస్టారెంట్లలో షాకింగ్ లోపాలు..హోటళ్లలో బొద్దింకలు, పురుగులు

Publish Date:Jun 28, 2026

Advertisement

 

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని ప్రముఖ రెస్టారెంట్లపై సైబరాబాద్ సీఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లోని పలువురు ప్రముఖ రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపాలు, ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు యాజమాన్యాలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు.

గచ్చిబౌలి – షా గౌస్ రెస్టారెంట్
వంటగదిలో ఈగలు తిరగడం, అపరిశుభ్రమైన వాతావరణం, తెరిచి ఉన్న డ్రెయిన్లు, లేబుళ్లు లేని ఆహార పదార్థాలు, నీటి నాణ్యత పరీక్షలకు సంబంధించిన రికార్డులు లేకపోవడం వంటి లోపాలు గుర్తించారు. పరిశుభ్రత అంచనాలో కేవలం 65 శాతం మాత్రమే స్కోర్ రావడంతో వెంటనే లోపాలను సరిదిద్దాలని అధికారులు ఆదేశించారు.

హైటెక్ సిటీ – మెహ్‌ఫిల్ రెస్టారెంట్
వంటగదిలో తగిన స్థలం లేకపోవడం, తడి నేలపై ఆహార వ్యర్థాలు పేరుకుపోవడం, నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలోనే రూమాలీ రొట్టెల తయారీ, పరిశుభ్రత ప్రమాణాల పాటించకపోవడం, ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేకపోవడం వంటి అంశాలు బయటపడ్డాయి. హైజీన్ స్కోర్ 67 శాతం మాత్రమే నమోదవడంతో ఇంప్రూవ్‌మెంట్ నోటీస్ జారీ చేశారు.

మాదాపూర్ – ఐడియల్ కిచెన్
ఈ తనిఖీల్లో అత్యంత ఆందోళన కలిగించిన అంశాలు వెలుగుచూశాయి. ఫ్రీజర్‌లో నిల్వ చేసిన పిండివంటలపై మృత బొద్దింకలు, మినప్పప్పులో పురుగులు, తడి నేలలు, ఆహార వ్యర్థాలు, సరైన నిల్వ సదుపాయాల లేమి, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు మరియు నీటి పరీక్షల రికార్డులు లేకపోవడం గుర్తించారు. ఈ సంస్థకు 67 శాతం హైజీన్ స్కోర్ నమోదైంది.

కొండాపూర్ – పాలమూరు గ్రిల్ అండ్ బార్
లేబుళ్లు మార్పిడి చేసిన ఆహార పదార్థాలు, పాత ఆహారం, గడువు ముగిసిన మష్రూమ్‌లను అధికారులు స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. వంటగదిలో ఈగలు, గ్రీజు పేరుకుపోవడం, తుప్పు పట్టిన ఫ్రీజర్, వేడి నీటితో పాత్రలు శుభ్రం చేయకపోవడం, నీటి నాణ్యత పరీక్షల రికార్డులు లేకపోవడం వంటి లోపాలు గుర్తించారు. ఈ రెస్టారెంట్‌కు కేవలం 60 శాతం హైజీన్ స్కోర్ మాత్రమే లభించింది.

ఈ నాలుగు రెస్టారెంట్ల యాజమాన్యాలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేసిన అధికారులు, నిర్దేశిత గడువులోగా అన్ని లోపాలను సరిదిద్దాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బయట భోజనం చేసే ముందు రెస్టారెంట్ పరిశుభ్రత, ఆహార నాణ్యతపై వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 

By
en-us Political News

  
జింబాబ్వే పర్యటనలో భారత క్రికెట్ జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
నైతిక బాధ్యతతో రాజీనామా చేసిన భారత కేంద్రమంత్రుల చరిత్ర..!
దేశరాజకీయాల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది.
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా నిరసన జ్వాలలు మిన్నంటాయి.
2024 సాధారణ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం గణనీయంగా మారిపోయింది.
ప్రజారోగ్యం కోసమే సంజీవని పథకాన్ని అందిస్తున్నామని...ఆగస్టు నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు
దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన పెద్ద ఎత్తున సాగిన నిరసన ఘట్టం ఎట్టకేలకు ఒక సంచలనాత్మక ముగింపునకు వచ్చింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.
పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య చెలరేగిన తీవ్ర ఉద్రిక్తతలు ఇప్పుడు మొత్తం గల్ఫ్ ప్రాంతానికి విస్తరిస్తున్నాయి.
ఉద్యోగాలే లేకుంటే ఏఐ విజయం ఎందుకు.. మైక్రోసాఫ్ట్ బాస్ సంచలన వ్యాఖ్యలు..
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ పరీక్షా వివాదం విద్యార్థుల ఆందోళనల నడుమ కేంద్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పత్రం ప్రధాన మంత్రికి పంపించిన అనంతరం దేశ యువతను ఉద్దేశించి భావోద్వేగ లేఖ విడుదల చేశారు
  నిరాహార దీక్షలో ఉన్న తనను   సందర్శకులు  కలవకుండా ఆంక్షలు విధించారని వాంగ్ చుక్ ఆరోపంచారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.