సేమ్ టూ సేమ్. ఒకే తరహా అటాక్. ఇంటిపైన హెలికాప్టర్‌తో యూఎస్ నేవీ షీల్డ్ కమెండోల ఎంట్రీ. హోరా హోరీ ఫైరింగ్. టార్గెట్ ఫినిష్. డీఎన్ఏ టెస్ట్ కన్ఫామ్. క్లైమాక్స్‌లో హెలికాప్టర్ ట్రబుల్. దాన్ని బ్లాస్ట్ చేసి.. వచ్చిన దారినే ఎస్కేప్. నిమిషాల్లో బిగ్ టాస్క్ కంప్లీట్. ఇదీ అమెరికన్ ఆర్మీ సత్తా.
సేమ్ టూ సేమ్.. ఆల్‌ఖైదా చీఫ్ బిన్ లాడెన్‌ను చంపినట్టుగానే.. ఇస్లామిక్ స్టేట్-ఐఎస్ చీప్ అల్-ఖురేషీనీ మట్టుబెట్టింది అమెరికా. కాకపోతే.. చిన్న ఛేంజ్. యూఎస్ సోల్జర్స్ తనను చంపకుండానే.. తనకు తాను సూసైడ్ బాంబర్‌గా మారి.. తనతో పాటు తన ఫ్యామిలీనీ పేల్చేసుకున్నాడు ఆ మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్ట్.
సిరియాలో అమెరికా దళాలు చుట్టుముట్టడంతో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) గ్రూప్ చీఫ్ అబూ ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురేషీ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ పేలుడులో ఖురేషీతో పాటు అతని కుటుంబంలోని మహిళలు, పిల్లలు దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అమెరికా కమాండోల దాడిలో ఇస్లామిక్ స్టేట్ కీలక నేత అబూ బకర్ అల్ బగ్దాది హతమయ్యాక 2019 అక్టోబరు 31న ఖురేషీ అతని స్థానంలోకి వచ్చాడు.
సిరియా- టర్మీ సరిహద్దుకు సమీపంలో అత్మేహ్ పట్టణ శివారులోని ఓ ఫామ్‌హౌజ్‌లో ఖురేషీ ఉన్నట్టు నిర్ధారించుకున్న అమెరికా ప్రత్యేక దళాలు సర్జికల్ స్టైక్ చేశాయి. హెలికాప్టర్లతో ఆ భవనంపైకి దిగిన యూఎస్ సోల్జర్స్‌కు.. భవనం లోపలున్న ఉగ్రవాదులకు మధ్య రెండు గంటలకు పైగా హోరాహోరీ ఎన్‌కౌంటర్ జరిగింది. దాడుల్లో అమాయకులెవరూ చనిపోరాదనే అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల వల్లే వైమానిక దాడులు జరపలేదని తెలుస్తోంది.
ఇక తన చావు తప్పదని కన్ఫామ్ చేసుకున్న ఖురేషీ.. అమెరికన్ సైనికుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక.. తనను తాను బాంబులతో పేల్చుకున్నాడు. ఆ పేలుడుతో ఖురేషీతో పాటు ఆరుగురు పిల్లలు, నలుగురు మహిళలు సహా 13 మంది మరణించినట్టు తెలుస్తోంది. డెడ్‌బాడీస్ డీఎన్‌ఏను విశ్లేషించాకే ఖురేషీ మృతిని ధ్రువీకరించినట్టు అమెరికా అధికారులు తెలిపారు. ఈ అటాక్ అనంతరం తిరిగి వెళ్తుండగా ఓ హెలికాప్టర్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తగా దాన్ని అక్కడే ధ్వంసం చేసేసి.. మరో హెలికాప్టర్‌లో వెళ్లిపోయారు ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న సైనికులు. బిన్ లాడెన్‌పై జరిపిన ఆర్మీ ఆపరేషన్‌లోనూ ఇలానే జరగడం ఆసక్తికరం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/islamic-state-chief-khureshi-killed-in-us-army-attack-39-131251.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.