కాంగ్రెస్‌లోకి విజ‌య‌మ్మ‌!.. జ‌గ‌న్‌కు చెక్ పెట్టేందుకేనా!?

Publish Date:Mar 16, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అడ్డగొలుగా విభజించిన పాపానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తగిన మూల్యం చెల్లించుకోంది. విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతే.. తెలంగాణలో మాత్రం ఆ పార్టీ బలంగానే ఉన్నా.. ఆ పార్టీ సీనియర్ నేతల అనైక్యత ఆ పార్టీ పుట్టి ముంచుతోంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీలు గెలుపు నల్లేరు మీద నడక అవుతోంది. ఈ విషయం అందరికి తెలిసిందే.  

అయితే కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ ఆంధ్ర్రప్రదేశ్‌లో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు ఎంత చేయాలో అంత చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం శాయశక్తుల ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులుగా ఉండి.. విభజన కారణంగా ఇతర పార్టీలోకి వెళ్లిపోయిన కీలక నేతలను మళ్లీ సొంత గూటికి తీసుకు వచ్చేలా ప్రయత్నాలను సదరు పార్టీ తీవ్రం చేసినట్లు తెలుస్తోంది. 

ఆ బాధ్యతను మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు కేవిపి రామచంద్రరావు భుజస్కంధాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెట్టిందని విశ్వసనీయ సమాచారం. ఆ క్రమంలో తొలుత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మను మళ్లీ సొంత గూటికి తీసుకు వచ్చేందుకు కేవీపీ శతధా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఆ క్రమంలో కేవీపీ ఇప్పటికే ఆమెతో ఈ అంశంపై మాట్లాడినట్లు సమాచారం. వైయస్ రాజశేఖరరెడ్డి అంటే ఓ బ్రాండ్ అని...  ఆ మహానేత ఇమేజ్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా ఉందని.. ఆయన కాంగ్రెస్ పార్టీ మనిషి అని.. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఎన్ని ఆటు పోట్లు ఏదురైనా ఆ పార్టీ చేయి విడిచిందీ లేదని.. అందుకే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసిందనీ.. అయితే ఈ విషయాలన్నీ నేను కొత్తగా మీకు చెప్పనక్కర్లేదని.. ఇదంతా మీకు తెలుసునని కేవీపీ.. వైయస్ విజయమ్మతో అన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటికిప్పుడు ఓ నిర్ణయం అయితే తీసుకోలేనని.. తనకు కొంత సమయం కావాలని కేవీపీని ఆమె కోరగా.. అందుకే టేక్ యువర్ ఓన్ టైమ్ అని.. వైయస్ విజయమ్మతో కేవీపీ పేర్కొనట్లు తెలుస్తోంది. 

మరోవైపు.. ఆమె కుమారుడు వైయస్ జగన్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమె కుమార్తె వైయస్ షర్మిల.. వైయస్ఆర్ టీపీ స్థాపించి... తెలంగాణలో ప్రజా ప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్రను ఆమె పున:ప్రారంభించారు. వైయస్ విజయమ్మ.. కుమార్తెతో కలిసి అడుగులో అడుగు వేసుకొంటూ ఆ పాదయాత్రలో ముందుకు సాగుతోన్నారు. 

అయితే తెలంగాణలో వైయస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు అంతగా జనాదరణ లభించడం లేదు. అలాగే మీడియాలో కూడా ఆమెకు అంతాగా కవరేజ్ ఇవ్వడం లేదు. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలనే ఆకాంక్ష ఆ పార్ట అధినేత కేసీఆర్‌లో చాలా బలంగా ఉంది. ఆ క్రమంలో ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌లో కేసీఆర్ ఒప్పందం చేసుకుని.. ఆయన చెప్పినట్లు గులాబీ బాస్ నడుచుకొంటున్నారు. ఇంకోవైపు.. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ.. తన హవా కొనసాగించింది. ఈ నేపథ్యంలో కమలదళం కూడా తెలంగాణలో పాగా వేసేందుకు ఎంత చేయాలో అంత చేసేందుకు సిద్ధంగా ఉంది. 

ఇంకోవైపు  రానున్న ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో మూడు రంగుల జెండాను రెపరెపలాడించాలనే లక్ష్యంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.  ఆ పార్టీలోని సీనియర్లు ఎంతగా ఆయన్ని మోకాలడ్డుతోన్నా.. రేవంత్ మాత్రం తగ్గేదే లే అన్నట్లు పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్తున్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, డిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా తెలంగాణలో కనీసం కొన్ని స్థానాలనైనా గెలుచుకోవాలనే లక్ష్యంతో రేపోమాపో .. హైదరాబాద్‌లో ఆయన అడుగు పెట్టనున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య వైయస్ షర్మిల.. తన పార్టీని ముందుకు తీసుకు వెళ్తుందా... అధికారంలోకి రాగలదా? అనే సందేహాలు వైయస్ విజయమ్మ చుట్టుముడుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ విషయంలో ఆమె ఒకొంత ఆందోళన కూడా చెందుతున్నట్లు  సమాచారం. ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లితే.. ఎలా ఉంటుంది అని.. తన చుట్టు ఉన్న అత్యంత ఆప్తులతో వైయస్ విజయమ్మ చర్చించినట్లు తెలుస్తోంది. అదీకాక తన భర్త వైయస్ రాజశేఖరరెడ్డికి... కాంగ్రెస్ పార్టీ అంటే పంచ ప్రాణాలు..  ఆ పార్టీ ఆయనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో అందరికీ తెలిసిందే. అలాంటి కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ప్రాణం పోస్తే.. తన భర్త ఆత్మకు కూడా శాంతి కలుగుతోందనే ఓ విధమైన ఆలోచనతో వైయస్ విజయమ్మ ఉన్నట్లు లోటస్ పాండ్‌లో ఓ చర్చ అయతే నడుస్తోంది. 

ఓ వేళ వైయస్ విజయమ్మ.. కాంగ్రెస్ పార్టీలో చేరితే.. ఆమె కుమారుడు వైయస్ జగన్ పార్టీకి ప్రత్యర్థి పార్టీ అవుతోంది. అంతేకాదు.. తెలంగాణలో పార్టీ స్థాపించిన వైయస్ షర్మిల.. మళ్లీ ఏపీకి వెళ్లి..  సోదరుడు వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతోందా? లేక తల్లిని మాత్రం ఏపీకి పంపించి.. తాను మాత్రం తెలంగాణలోనే ఉంటుందా ? అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. ఏదీ ఏమైనా.. రాష్ట్రాన్ని విభజించి తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ బలం పుంజుకొని.. అధికారంలోకి వస్తే.. చేసిన తప్పులకు సరిద్దిద్దుకునే అవకాశం మాత్రం ఉంటుందని ఆంధ్రరాష్ట్ర ప్రజలు పేర్కొంటున్నారు. మరీ ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.