కొడాలికి వంగవీటి చెక్?.. బెజవాడను వదిలి గుడివాడకు షిఫ్ట్‌?

Publish Date:Mar 8, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి చెక్ పెట్టేందుకు మాజీ ఎమ్మెల్యే, వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? ఆ క్రమంలో గుడివాడ వేదికగా ఆయన.. తన  సామాజిక వర్గం నేతలతో తరచు సమావేశాలు, చర్చలు జరుతున్నారా? అంటే అవుననే అంటున్నారు సదరు పట్టణ పురజనులు. ఆయన తాజాగా గుడివాడలోని ఆర్టీసీ కాలనీలో నియోజకవర్గంలోని కాపు సంఘం ముఖ్య నేతలతో వంగవీటి రాధా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఆ సామాజిక వర్గం నేతలతో పాటు.. వివిధ రాజకీయ పార్టీల నేతలు సైతం పాల్గొన్నారు. అధికార జగన్ పార్టీకి చెందిన నేతలు అయితే ఈ సమావేశానికి అధిక సంఖ్యలో హాజరు కావడం గమనార్హం. 

గుడివాడ మీదుగా... ఏ ఫ్రాంతానికి వెళ్లినా.. సదరు పట్టణాన్ని వేదికగా చేసుకుని వంగవీటి రాధా తరచూ.. ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలతో కీలక సమావేశాలు జరపడం పట్ల.. భవిష్యత్తులో ఆయన ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు అయితే జోరుగా ఊపందుకొన్నాయి. కృష్ణాజిల్లాలో రాజకీయ చైతన్యం చాలా అదికంగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసేందే. అలాంటి జిల్లాలో అదీ బెజవాడను వదిలి గుడివాడ నుంచి వంగవీటి ఎందుకు రంగంలోకి దిగాలనుకుంటున్నారనే ప్రశ్న అయితే జిల్లా వ్యాప్తంగా ఉత్పన్నమవుతోంది. 
 
మరోవైపు.. కొడాలి నాని, వంగవీటి రాధా మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తన స్నేహితుడు కొడాలి నానికి వంగవీటి రాధా ఎందుకు చెక్ పెట్టాలని భావిస్తున్నాడంటే.. అందుకు నియోజకవర్గ ప్రజలు పలు కారణాలు  చెబుతున్నారు. 
 
మంత్రి కొడాలి నానికి గుడివాడ కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో దేవినేని రాజశేఖర్ తనయుడు దేవినేని అవినాష్‌ను సైకిల్ పార్టీ అభ్యర్థిగా బరిలలోకి దింపిందీ టీడీపీ. కానీ ఈ ఎన్నికల్లో కొడాలి నానినే గెలుపొందారు. వంగవీటి ఫ్యామిలీకి, దేవినేని ఫ్యామిలీకి చాలా కాలంగా రాజకీయ వైరం ఉన్న విషయం విధితమే. 

అయితే గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు  అత్యధికంగా ఉన్నాయి. అంతేకాదు.. అభ్యర్థి గెలుపునకు ఈ ఓట్లే అత్యంత కీలకమన్న విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కొడాలి నాని చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. సదరు సామాజిక వర్గానికి చెందిన నేత వంగవీటి రంగాను హత్యకు కారణమైన వారు.. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని. వారిని ఓడించేందుకు మీరంతా ఫ్యాన్ పార్టీకి ఓటు వేయాలని తన ప్రచారంలో కొడాలి నాని పిలుపు నిచ్చారు. అంతేకాదు.. తన గెలుపు కోసం.. సదరు సామాజిక వర్గాన్ని ఎన్ని విధాలుగా .. ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని విధాల కొడాలి నాని వాడుకొని.. ఆ ఎన్నికల్లో గెలుపొందారు. 

ఆ తర్వాత సదరు సామాజిక వర్గాన్ని దూరం పెట్టారనే టాక్ అయితే సదరు నియోజకవర్గంలో జోరుగా వైరల్ అయింది.   సదరు సామాజిక వర్గం వారు.. ఏదైనా పని చేయించుకోవాలని.. మంత్రి కొడాలి నాని వారి వద్దకు వెళ్తే..  రేపుమాపు అంటూ వారిని నానా ఇబ్బందులకు గురి చేసేవారనే టాక్ కూడా గుడివాడలో బలంగానే ఉంది. అంతేకాదు.. వంగవీటి రాధాతోపాటు ఆయన అభిమానులపై కొడాలి నాని తరచు బహిరంగంగానే సెటైరికల్ కామెంట్స్ చూస్తున్నాడనే చర్చ కూడా గుడివాడ నియోజకవర్గంలో చాలా హాట్ హాట్‌గా నడుస్తోంది. 

ఈ నేపథ్యంలో మంత్రి కొడాల నాని వ్యవహారాన్ని .. గుడివాడ వచ్చిన వంగవీటి రాధా ముందు నియోజకవర్గంలోని కాపు నేతలంతా ఉంచినట్లు సమాచారం. అంతేకాకుండా.. బెజవాడను వదిలి గుడివాడ నుంచి ఎన్నికల బరిలోకి దిగితే.. తామంతా మీకు అండగా ఉండడమే కాకుండా.. రానున్న ఎన్నికల్లో మీ గెలుపు కోసం తామంతా శాయశక్తుల కృషి చేస్తామని వంగవీటి రాధతో సదరు సామాజిక వర్గ నేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదీకాక.. గుడివాడ నియోజకవర్గంలో కూడా రాజకీయ చైతన్యం అధికం. ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచి.. కొడాలి నాని కంచు కోటను బద్దలు కొట్టాలనే వ్యూహాంలో బాగంగానే వంగవీటి.. గుడివాడ వేదికగా.. రాజకీయం చేయాలని భావిస్తున్నారనే టాక్ అయితే సదరు నియోజకవర్గంలో వైరల్ అవుతోంది.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.