నిజంగానే తిట్టుకుంటున్నారా? సెంటిమెంట్ రాజేసే కుట్రలా? 

Publish Date:Nov 13, 2021

Advertisement

తెలుగు రాష్ట్రాల మంత్రులు మధ్య మళ్లీ మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ మంత్రులు జగన్ టార్గెట్ గా విమర్శలు చేస్తుంటే.. ఏపీ మంత్రులు కేసీఆర్ ను కార్నర్ చేస్తున్నారు. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెరిగిందా అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో తమకు ఇబ్బందికర పరిస్థితులు ఉండటంతో సెంటిమెంట్ రాజకీయాలు రాజేస్తున్నారనే  చర్చ కూడా వస్తోంది. ప్రస్తుతం ఏపీ తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉంది. రోజురోజుకు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. అటు కేసీఆర్ సర్కార్ పైనా ప్రజల్లో వ్యతిరేకత అంతకంతకు పెరిగిపోతోంది. ఇటీవల జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలోనే అటు వైసీపీ మంత్రులు, ఇటు తెలంగాణ మంత్రులు మాటల మంటలు రాజేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార తెరాస అభ్యర్ధి ఓడి పోయారు. అయినా కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదు. అలాగే ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీకి ఇప్పటికిప్పుడు జరిగే ప్రయోజనం కూడా పెద్దగా ఏమీ ఉండదు. అసెంబ్లీలో తెరాస బలం 103 నుంచి 102కు తగ్గితే, బీజేపీ బలం రెండు నుంచి మూడుకు పెరిగింది. రెండు పార్టీల మధ్య నిండా 100 సీట్ల దూరం వుంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలకు పైగానే సమయముంది. అయినా కేసీఆర్, హుజురాబాద్ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారని, ఒక విధంగా, ఆయన గతంలో ఎప్పుడూ లేనంతగా నిరాశ, నిస్పృహ, ఫ్రస్ట్రేషన్’కు గురవుతున్నారని రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు అయన కొత్త ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు.

కేంద్రం పై విరుచుకు పడడం మొదలు, తాజాగా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తలను రెచ్చగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ  నడుస్తోంది. అందులో భాగంగానే కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపి సెంటిమెంట్ రగిలించే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉన్నారంటున్నారు. అందులో భాగంగానే  మంత్రి ప్రశాంత రెడ్డి పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మీద అసందర్భ విమర్శలు చేశారని అంటున్నారు. తెలంగాణ వస్తే అడుక్కుతింటామని ఆరోజు ఆంధ్రోళ్లన్నారని, ఈ రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. మోకాలుకు బోడి గుండుకు ముడివేసి అనవసర వివాదానికి తెర తీశారు. నిధులు లేక జగన్‌ కేంద్రాన్ని అడుక్కుతింటున్నారని ఎద్దేవా చేశారు. అయితే ఇక్కడ పలికింది ప్రశాంత ‘రెడ్డే’ అయినా, ఆయన చేత ఆ పలుకులు పలికించింది మాత్రం ముఖ్యమంత్రేనని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, సామాజిక  హెచ్చు తగ్గులు సహా  ఆన్ని లెక్కలు చూసుకునే జగన్ ‘రెడ్డి’ పైకి  ప్రశాంత్ ‘రెడ్డి’ ని ప్రయోగించారని అంటున్నారు. 

అయితే ఏపీ మంత్రి పేర్నినాని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.ఏపీకి రావాల్సిన నిధుల కోసమే బిచ్చమెత్తుకుంటున్నామని తెలిపారు. మాటిమాటికి ఢిల్లీకెళ్తున్న సీఎం కేసీఆర్‌..ఏం బిచ్చమెత్తుకోవడానికి వెళ్తున్నారు? అని ప్రశ్నించారు. బయట కాలర్‌ ఎగరేసి..లోపల కాళ్లుపట్టుకునే అలవాటు తమకు లేదన్నారు. తమది స్నేహం అంటే స్నేహం, ఢీ అంటే ఢీ  నైజమన్నారు. తెలంగాణ ప్రభుత్వం దగ్గర చాలా డబ్బులున్నాయంటున్నారని, కాంట్రాక్టర్లకు ఎంత బకాయిలు ఇవ్వాలో అడగాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కలిసి అభివృద్ధి చేసిన.. హైదరాబాద్‌ సొమ్మును అనుభవిస్తున్నారని పేర్నినాని దుయ్యబట్టారు. 

కేంద్రం నుంచి రావల్సినవి తెచ్చుకోవడం మా హక్కు అని కేసీఆర్‌ అన్నారని, నిధులు రాబట్టే విషయంలో మిగిలిన వారు కూడా అలాగే వ్యవహరిస్తారని మేము బిచ్చమెత్తుకుంటే మీకెంటని తెలంగాణ టీఆర్‌ ఎస్‌ నేతలకు సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ నేతలు ఈ విధంగా మాట్లాడటం వారి రాజకీయ అజ్ఞానమే అవుతుం దన్నారు. కేంద్రం నుంచి నిధులను రావాల్సిన పద్ధతుల్లో రాబట్టు కుంటున్నామన్నారు. వారు ఎలా పోవాలో వారు చూసుకోవాలి, మేము ఎలా పోతే వారికేమిటీ అని ఆయన ప్రశ్నించారు. వారి సమస్యల నుంచి తప్పించుకునేందుకే ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశా రు. వారి సమస్యల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే తెలం గాణ నేతలు ఇలా ఎపీ గురించి మాట్లాడుతున్నారన్నారు. 

ఇక కేంద్ర ప్రభుత్వం, బీజేపీ మత విద్వేషాలను రెచ్చ గొట్టి పబ్బం గడుపు గడుపు కుంటోందని, ఆరోపిస్తున్న ముఖ్యమంత్రి, అనవసర వివాదాలను సృష్టించి రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడాన్ని ఎలా సమర్ధించు కుంటారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రి  హుజూరాబాద్ ఓటమిని వ్యక్తిగత ఓటమిగా భావిచడం వల్లనే ఫ్రస్ట్రేషన్’కు గురై తప్పు మీద తప్పు చేస్తూ తమ ప్రతిష్టను తామే దిగజార్చుకుంతున్నారని, ముఖ్యమంత్రి ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి ఎంత త్వరగా బయట పడితే అంత మంచిదని, లేదంటే,రాజకీయాల్లో ఆత్మ హత్యలే కానీ, హత్యలు ఉండవనే నానుడి మరోమారు నిజం అవుతుందని విశ్లేషకులు మిత్ర వాక్యంగా హెచ్చరిస్తున్నారు.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.