వైనాట్ 175.. జగన్ ధీమాకు కారణం ఇదేనా?

Publish Date:Mar 14, 2023

Advertisement

వైనాట్ 175.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాన్ఫిడెన్స్ కు కారణమేమిటో తేలిపోయింది. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలిచి తీరుతామంటున్న వైసీపీ భరోసా ఏమిటో అర్ధమైపోయింది. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఎలా గెలవబోతోందో.. పట్ట భద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ ట్రయలర్ చూపింది. ఆ ట్రయలర్ లోనే అందరికీ వైసీపీ గెలుపు వ్యూహాలేమిటో తేటతెల్లమయ్యాయి.

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏరి కోరి ఏర్పాటు చేసుకున్న వంలంటీర్ల వ్యవస్థ ఏం చేయబోతోందో ఎమ్మెల్సీ ఎన్నికలలో తేలిపోయింది. పేరుకు జరిగినవి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు కానీ పెద్ద సంఖ్యలో అండర్ గ్యాడ్యుయేట్లు ఓటు వేశారు. కేవలం ఆరో తరగతి, ఏడో తరగతి, మహా అయితే టెన్త్ చదివిన వారు పెద్ద సంఖ్యలో ఓట్లు వేశారు. వలంటీర్లు వారికి ఓటింగ్ స్లిప్పులు ఇచ్చారు. అధికారులు దగ్గరుండి ఓట్లు వేయించారు. అడ్డుకున్న వారిపై పోలీసులు కేసులు పెట్టారు. లాఠీ చార్జి చేశారు. మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికను ప్రజాస్వామ్మమే నిర్ఘాంతపోయేంత ప్రశాంతంగా జరిపించారు. కనీస విద్యార్హత లేకుండా ఓటు వేయడానికి వచ్చిన వారిని ప్రశ్నిస్తే.. వారి నుంచి వచ్చిన సమాధానాలు వ్యవస్థలను జగన్ సర్కార్ ఈ నాలుగేళ్ల కాలంలో ఎంతగా నిర్వీర్యం చేసిందో అవగతమౌతుంది. ఒక ఓటరేమో తాను చదివించి  ఏడో తరగతేననీ, అయితే తమ వార్డులో ఈ ఎన్నికలలో ఓటు వేయడానికి తనతో పాటు మరో ముగ్గుర్ని ఎన్నుకున్నారనీ తెలిపారు. వారి విద్యార్హత కూడా ఆరు, ఏడు తరగతులేనట. ఓటింగ్ స్లిప్పులు ఎవరిచ్చారంటే ఇక్కడే ఇప్పుడే ఇచ్చారని చెప్పారు. మరి మీకు ఇక్కడకు వచ్చి ఓటేయాలని ఎవరు చెప్పారంటే.. ఫోన్ వచ్చిందన్నది వారి సమాధానం. ఇంతకీ తాను ఓటు వేస్తున్నది ఏ ఎన్నికకు అన్న సంగతి కూడా ఆమెకు తెలియదు. వచ్చి ఓటేయమన్నారట.. అంతే వచ్చి ఓటేశారు. ఇంత బహిరంగంగా వారి విద్యార్హతలపై వాస్తవం నిగ్గు తేలినా.. వారు ఓట్లు వేయకుండా అధికారులు నిలువరించలేదు.

 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో  ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ మాత్రమే చదివిన వారిని కూడా ఓటర్లుగా ఓట్లు వేయించిన ఘనత జగన్ సర్కార్ ది. ఇందు కోసం ఆయన ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ఎంత గొప్పగా ఉపయోగించుకుందో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక అద్దంపట్టింది.  ఎమ్మెల్సీ ఎన్నికలలోనే ఇంతకు  తెగించిన వైసీపీ రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఇంకెన్ని జగన్నాటకాలకు తెరతీస్తారో అన్న సందేహాలు సర్వత్రా  వ్యక్తమౌతున్నాయి.  ఎంత నిర్భయంగా, ఎంత నిస్సిగ్గుగా వైసీపీ నేతలు వ్యవహరించారంటే.. దొంగ ఓట్లు, దొంగ ఓటర్లను మీడియా లైవ్ లో చూపించినా వెనక్కుతగ్గలేదు. పోలీసుల సంపూర్ణ సహకారంతో దొంగ ఓట్లను యథేచ్ఛగా వేయించుకున్నారు.  దొంగ ఓటర్లను గుర్తు పట్టే టీడీపీ నేతలు… పోలింగ్ ఏజెంట్లను పోలీసులు పోలీసు స్టేషన్లకు తరలించేశారు.  ఈ సందర్భంగా తిరుపతి, పులివెందుల సహా పలు చోట్ల ఘర్షణలు జరిగాయి.  ఆటోడ్రైవర్లు, ఆరేడు తరగతులు చదువుకున్న వారు, ఇంటర్మీయట్ కురాళ్లు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోలీసుల అండతో, వైసీపీ దన్నుతో ఓట్లు వేశారు.  ఇక పోలింగ్ బూత్ ల వద్దే కౌంటర్లు పెట్టేసి మరీ సొమ్ములు పంచారు.

గెలవడం కావాలి, ఎలా గెలుస్తేం ఏం.. మమ్మల్ని అడ్డుకునే దమ్మెవరికి ఉందన్న ధీమా తప్ప వైసీపీలో కనిపించింది. ఈ మాత్రం అరాచకం లేకపోతే మనకు ఓటేసేదెవరు అన్న భావన కూడా వ్యక్తమైంది.  దొంగ ఓట్లతో గెలిచేయగలమన్న ధైర్యం కనిపించింది. ఇదే పద్ధతిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా దున్నేస్తామన్న ధీమా వ్యక్తమైంది. మొత్తం మీద వచ్చే ఎన్నికలు ఎలా జరుగుతాయో.. రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఒక ట్రయలర్, ఒక టీజర్ చూపించారు ముఖ్యమంత్రి జగన్

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.