తెరాస... భారాస డీఎన్ఏ ఒకటేనా?

Publish Date:Jan 7, 2023

Advertisement

ఉభయ తెలుగు రాష్ట్రాలు మళ్ళీ ఒకటవుతాయా? ఒక్కటిగా ఉన్న రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడంలో కీలక భూమిక పోషించిన, తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) పేరును, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చడం వెనక ఇతరేతర కారాణాలు ఉన్నా ఉభయ తెలుగు రాష్ట్రాలను ఏకం చేసే ఆలోచన కూడా వుందా, అంటే, ఉన్నదని కాకున్నా, ఉంటే ఉండవచ్చే అనే అభిప్రాయం   అనుమనాలు వ్యక్తమౌతున్నాయి. నిజానికి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన సమయానికి,ఆయన ప్రధాన లక్ష్యం రాష్ట్ర విభజన కాకపోవచ్చని, దివంగత  మాజీ ముఖ్యమంత్రి  చెన్నారెడ్డిని బాటలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతోనే ఆయన తెరాస స్థాపించారని, అనుమానించిన వాళ్ళు అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. తెలుగు దేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రోజుల్లో కూడా కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ డిమాండ్ ను సభలోనే వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు. 

సరే  అదంతా గతించిన చరిత్ర. అందులో ఏది నిజమో ఏది కాదో, ఇప్పడు అపస్తుతం. అలాగే  కేసీఆర్ కావాలనుకున్నా, మరొకరు వద్దనుకున్నా విడిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ కలపడం అంత తేలికైన వ్యవహారం కాదు. కానీ, ఏపీలో అడుగు పెట్టేందుకు కదులుతున్న బీఆర్ఎస్  స్వరంలో మార్పు అయితే స్పష్టంగా వినిపిస్తోందని అంటున్నారు. ఒకప్పుడు ఆంధ్రా పాలకులు అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని, ‘బ్యాన్’ చేశారని ఆరోపించిన నాయకులే  ఇప్పడు తెలంగాణ పేరు ఉచ్చరించేందుకు కూడా వెనకాడుతున్నారని అంటున్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో  ‘వందే మాతరం’ నినాదం  ఎంత ప్రభావం చూపిందో, అంత కంటే ఎక్కువగా, ప్రత్యేక తెలంగాణ తొలి, మలి దశ  ఉద్యమాలను ప్రభావితం చేసిన, ‘జై తెలంగాణ’ నినాదం భారాస వేదికల నుంచి వినిపించడం లేదని తెలంగాణ ఉద్యమ ప్రజానీకం ఆవేదన, వ్యక్త పరుస్తున్నారు. 

అలాగే, ఇంతవరకు రాష్ట్ర విభజన క్రెడిట్ మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకున్న బీఆర్ఎస్ నాయకులు, ఇప్పడు, తిలా పాపం తల పిడికెడు అన్నరీతిలో కొత్త స్వరాన్ని ఎత్తుకున్నారు. అయితే ఆ మాట నేరుగా కేసీఆర్, కేటీఆర్ లేదా మరో తెలంగాణ నాయకుడో కాకుండా బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు, తోట చంద్రశేఖర్ నోటి ద్వారా చెప్పించారు. చంద్రశేఖర్  ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని కుండ బద్దలు కొట్టారు.   రాష్ట్ర విభజనకు ఒక్క తెరాస మాత్రమే కారణం కాదు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ అందరూ ఓకే చేస్తేనే రాష్ట్ర విభజన జరిగింద నే కొత్త స్వరాన్ని ఎత్తుకున్నారు.  అంతే కాకుండా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనను ఆమోదిస్తూ లిఖిత పూర్వకంగా లేఖ  ఇచ్చారని ప్రత్యేకంగా పేర్కొన్నారు. అయితే, ఇంతవరకు తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన 1200 మంది అమరవీరులు సహా ఉద్యమంలో భాగస్వాములైన అయిన అందరినీ పక్కన పెట్టి,  ఒక్క  కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధ్యమైందని కేసీఆర్ లేకుంటే తెరాస లేదు  తెరాస లేకుంటే తెలంగాణ లేదు అంటూ రాష్ట్ర విభజన క్రెడిట్ మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకున్న బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు ఇలా స్వరం మార్చడం దేనికి సంకేతం? అనే ప్రశ్నకు తెలంగాణ సమాజానికి సమాధానం చిక్కడం లేదు. 

అదలా ఉంటే పూర్వాశ్రయంలో  తెరాస నాయకులుగా పిడికిలి బిగించి, ‘జై తెలంగాణ’ అని నిందించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు  తెలంగాణ పేరు ఉచ్చరించేందుకు కూడా  జంకుతున్నారు. ఎవరో కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం, ‘జై తెలంగాణ’  నినాదాన్ని నాలుక మీద నుంచి చెరిపేశారని  తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు  మేథావులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  ఏదో ఆశించి తెలంగాణ నాదాన్ని, నినాదాన్నివదులుకోవడం ఒక్క రోజు భాగోతానికి మీసాలు గోరుకున్నట్లుందని, కోదండరాం వంటి  ఉద్యమ నేతలు  అంటున్నారు.  

అలాగే, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని మరో మారు కేసీఆర్  ప్రశ్నార్ధకం చేస్తున్నారని కేసీఆర్ ధోరణి   పట్టి పట్టి పంగనామాలు పెడితే, పక్కకెళ్ళి తుదిచేసుకున్నట్లు  ఉందని అంటున్నారు. అయితే మరోవంక మంత్రి కేటీఆర్, తెరాస పేరు భారాసగా మారిందే కానీ, పార్టీ డీఎన్ఎ మారలేదని, అదే రంగు, అదే రుచి, అదే వాసన కొనసాగుతుందని అంటున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు ఏది నిజం ... కేసీఆర్ తల్లి పేరును తుడిచేసుకుంది నిజమా .. అదే డీఎన్ఎ అంటున్న కేటీఆర్ మాటలు నిజామా ? అని ప్రశ్నిస్తున్నారు.

By
en-us Political News

  
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.