కేసీఆర్ అజ్ఞాతవాసం అసలు రహస్యం ఇదేనా?

Publish Date:May 14, 2022

Advertisement

కేసీఆర్ ఎక్కడ? కనీసం టీవీ తెర మీద అయినా, ముఖ్యమంత్రి ముఖం కనిపించక పక్షం రోజులకు పైగానే అయింది. నిజానికి, టీవీ తెర మీద కనిపించి, వినిపించక పోవడమే కాదు, వార్తా పత్రికల్లోనూ ముఖ్యమంత్రి చాలా కాలంగా ‘కనిపించుట’ లేదు. అప్పుడెప్పుడో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కనిపించారు. ఇక ఆ తర్వాత ఆయన ఫార్మ్ హౌస్’కే  పరిమితం అయ్యారు. నిజమే,ఇలా సుదీర్గకాలం, కనిపించకుండా పోవడం కేసీఆర్’కు కొత్త కాదు. గతంలోనూ ఆయన పరిస్థితులు అనుకూలించని అనేక సందర్భాలాలో తెర చాటుకు పోవడం. తిరిగి ప్రత్యక్షం కావడం చాలా కాలంగా  అలవాటుగా వస్తోంది. అలాగే, ఇలా కనిపించకుండా పోయిన ప్రతి సందర్భంలోనూ కేసీఆర్, బాహుబలి రూపంలో రీ ఎంట్రీ ఇవ్వడం కూడా కొత్తకాదు. ఒక విధంగా అలా అదృశ్యం కావడం కేసీఆర్ రాజకీయ వ్యూహంలో భాగమనీ అంటారు. 

\అయితే, ఈసారి ముఖ్యమంత్రి ఏ వ్యూహంతో, మౌన వ్రతం (గిట్టని వారు ఇంకేదో వ్రతం అంటారు అనుకోండి అది వేరే విషయం) పాటిస్తున్నారు? అంటే, పార్టీ వర్గాలు ఒక్కొక్కరు ఒక్కొక్క కథ వినిపిస్తున్నారు. జాతీయ రాజకీయాలు, ముఖ్యంగా  రాష్ట్రపతి ఎన్నికల వ్యూహరచనలో కేసీఆర్ మునిగి తేలుతున్నారని అంటున్నారు. అయితే, మరో వంక జాతీయ రాజకీయాల్లో కేసీఆర్’ చక్రం తిప్పేందుకు గత ఐదారు నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ఫలిచలేదు. అది ప్రత్యక్షంగా కనిపిస్తూనే వుంది. బీజేపీకి ప్రత్యామ్నాయం కోరుకునే ప్రాంతీయ పార్టీలు అన్నీ, కాంగ్రెస్’ను కలుపుకు పోవాలనే కోరుకుంటున్నాయి. నిజానికి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్’ కూడా కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఎదిరించడం అయ్యే పనికాదని,స్పష్టంగా ప్రకటించారు. అంతేకాకుండా, చివరకు, జాతీయ రాజకీయాలలో కేసీఆర్’కు ఒక గౌరవప్రదమైన స్థానం కలిపించేందుకు పీకేతో కుదుర్చుకున్న ఒప్పందం వలన కూడా చేతి చమురు వదలడమే కానీ, ప్రయోజనం అయితే లేదని, పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. 

మరో వంక తెలంగాణలో తెరాస ప్రభుత్వం సాధించిన, ‘అద్భుత’ విజయలాను ఎకరువు పెడుతూ. జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినా, ఎవరూ పట్టించుకోవడం లేదని ఢిల్లీ  రాజకీయ వర్గాల సమాచారం. అందుకే, ముఖ్యమంత్రి ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ వెళతారని, అక్కడే రెండు మూడు వారాలు ఉండి జాతీయ పార్టీ/ కూటమి ఏర్పాటు గురించి సీరియస్’ గా చర్చలు జరుపుతారని, రెండు మూడు వారాల క్రితమే పార్టీ వర్గాల చెప్పినా, ఇంతవరకు ముఖ్యమంత్రి, ఢిల్లీ వెళ్ళలేదు. ఢిల్లీ వెళ్లక పోవడమే కాదు, ఫార్మ్ హౌస్ గడప  కూడా దాటలేదని మీడియాలో వస్తున్న కథనాలు సూచిస్తున్నాయి.   
అయితే ఇప్పుడు తాజాగా, ముఖ్యమంత్రి కేసీఆర్’ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలపై దృష్టి నిలిపారని, ఈ ఎన్నికలలో పార్టీ అనుసరించవలసిన వ్యూహం విషయంలో ఆయన ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారని అంటున్నారు.

బీజేపీ అభ్యర్ధికి మద్దతునిస్తే కాంగ్రెస్ కస్సుమంటుంది. బీజేపీతో అక్రమ సంబందాన్ని అంటగడుతుంది. కాంగ్రెస్ సారధ్యంలో ప్రతిపక్ష కూటమి నిలిపే అభ్యర్ధికి మద్దతునిస్తే, బీజేపీ బుస కొడుతుంది. కాంగ్రెస్, తెరాసల సీక్రెట్ లవ్’ ను బయట పెడుతుంది. ఇదొక విధంగా కరవ మంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా, రాష్ట్రపతి, ఎన్నిక తెరాసకు  అగ్నిపరీక్షగా మారింది. ఈ నేపధ్యంలో మరో ఒకటి రెండు చిన్నా చితక పార్టీలు కలిసి వచ్చినా, మూడో అభ్యర్ధిని నిలిపే ప్రయత్నాలలో ఉన్నారని, అందుకే ఆయన ఫార్మ్ హౌస్’ కే పరిమితం అయ్యారని అంటున్నారు. అయితే, పైకి ఏ కారణం చెప్పినా అసలు కారణం ఇంకేదో ఉందని, బహుశా కేటీఆర్’కు పగ్గాలు అప్పగించేందుకు, గౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు, కావచ్చని అంటున్నారు. అందుకే, తెర మీద కేసీఆర్’ లేని లోటును కేటీఆర్ తీరుస్తున్నారని అంటున్నారు. అయితే, గతంలో ఎప్పుడూ లేని విధంగా కేసీఆర్ ప్రస్తుత అజ్ఞాతవాసం  అసలు రహస్యం ఏమిటన్న విషయంలో  పార్టీ  శ్రేణుల్లో గందరగోళంనెలకొన్నట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.