Publish Date:Jan 27, 2025
జయ శంకర్ భూ పాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం టెంపుల్ ఇన్ చార్జి,ఈ వో మారుతీపై వేటుపడింది. సింగర్ మధు ప్రియ గర్బగుడిలో డాన్స్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. జనవరి 20 వతేదీన సింగర్ మధు ప్రియ ఆలయ ఈవో పర్మిషన్ తీసుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. మధుప్రియకు ఉన్న పాపులారిటీ వల్లే ఈవో అనుమతించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఆమె తప్పించుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒక యూ ట్యూబర్ గా తాను ఆలయ ఈవో పర్మిషన్ అడగడం వెంటనే అనుమతినివ్వడం మధు ప్రియకు అనుకూలంగా మారింది. కాళేశ్వరం టెంపుల్ ఇన్ చార్జి అయిన ఈవో మారుతీ నిర్లక్ష్యం వల్లే సింగర్ మధు ప్రియ డాన్స్ చేసినట్టు దేవాదాయ శాఖ గుర్తించింది. ఈ కారణంగానే ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ జ్యోతి ఈవోను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సింగర్ మంగ్లీ కూడా శ్రీకాళహస్తిలో ఇదే తరహా ఫోట్ షూట్ చేసి వివాదాస్పదమైంది. సింగర్ మధు ప్రియ అయితే శృతిమించింది. ఏకంగా గర్బ గర్బగుడి తలుపులను మూసేసి సింగర్ మధు ప్రియ డాన్స్ చేసింది. ఇప్పటికే ఆలయ పూజారిని బాధ్యుడు చేస్తూ రామకృష్ణకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఈవోను ఏకంగా విధుల్లో నుంచి తొలగించారు. ఆలయ ఈవోను విధుల్లో నుంచి తొలగించడం మధు ప్రియకు సేఫ్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది.. ఈ వ్యవహారంలో ఇంత వరకు మధుప్రియ స్పందించకపోవడం గమనార్హం.
దేవాదాయ శాఖను టార్గెట్ చేస్తూ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఆందోళ చేస్తున్న నేపథ్యంలో దేవాదాయశాఖ ఉద్యోగిసిబ్బందిపై చర్య తీసుకోవడం ప్రారంభమైంది. అయితే మధు ప్రియపై చర్య తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ శాఖ అయిన ఐ ఆండ్ పిఆర్ లో పని చేసే మధు ప్రియ ప్రభుత్వ నిబంధనలు ఉల్లఘించడంతో సర్వత్రా నిరసన వ్యక్తమౌతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-singer-madhu-priya-not-arrested-in-garbagudi-dance-case-39-191904.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.