టీ కప్పులో తుపానేనా?

Publish Date:Nov 11, 2022

Advertisement

విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ కోసం ఏర్పాటు చేసిన ఉమ్మడి నియామకాల బోర్డు విషయంలో తెలంగాణ సర్కార్, రాజ్ భవన్ ల మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణం టీ కప్పులో తుపానులా తేలిపోయిందా? ఉమ్మిడి నియామక బోర్డు విషయంలో గవర్నర్ సందేహాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివృత్తి చేసినట్లు చేస్తే.. తన సందేహాలన్నీ దూది పింజెల్లా తేలిపోయాయని గవర్నర్ తమిళి సై వివాదానికి ముగింపు పలికేశారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.

వర్సిటీల్లో ఖాళీల భర్తీ సజావుగా పూర్తి చేసేందుకు మాత్రమే బోర్డు ఏర్పాటు చేశామని గవర్నర్ తమిళిసైకు మంత్రి సబితా వివరించారు. ఈ విషయంలో గవర్నర్ సందేహాలను నివృత్తి చేసేందుకు మంత్రి సబిత గురువారం సాయంత్రం రాజ్ భవన్ కు వెళ్లారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తనకు ప్రొటోకాల్ ఇవ్వడం లేదనీ, వర్సిటీల నియామకం బిల్లుపై తన సందేహాలను నివృత్తి చేయాలని, రాజ్ భవన్ కు వచ్చి చర్చించాల్సిందిగా సందేశం పంపినా స్పందన లేదనీ తమిళిసై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

రాజ్ భవన్ ప్రగతి భవన్ కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ ను ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో ఇరికించాలని చూశారనీ, తన ఫోన్ ట్యాప్ అవుతోందన్న అనుమానాలు ఉన్నాయనీ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో గవర్నర్ లతో  ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విభేదాలు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా ప్రభుత్వం, గవర్నర్ ల మధ్య గత కొంత కాలం నుంచీ కొనసాగుతున్న ఘర్షణ వాతావరణం ముదిరి పాకాన పడిందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇప్పటికే గత కొద్ది కాలంగా గవర్నర్, కేసీఆర్ మధ్య అగాధం రోజురోజుకూ పెరుగుతోందన్న అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను వెనక్కు పంపకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా గవర్నర్ తన వద్దే పెండింగ్ లో ఉంచుకోవడంతో ప్రభుత్వంలో అసహనం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తమిళిసై మీడియా సమావేశంలో చేసిన తీవ్ర వ్యాఖ్యలతో ఇక ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య విభేదాలు తెగేదాకా వెళ్లిపోయాయా? ఇక అమీ తుమీకే రాజ్ భవన్, ప్రగతి భవన్ లు సిద్ధమైపోయాయా అన్న అనుమానాలు వ్యక్త మయ్యాయి. అయితే ఈ హడావుడీ, ఉద్రిక్త వాతావరణం అంతా ఒక సారి సబిత రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ సందేహాలు నివృత్తి చేస్తామని చేసిన ప్రకటనతో చప్పున చల్లారిపోయింది. సుదీర్ఘ అధ్యయనం అనంతరమే, అన్ని అంశాలనూ పరిగణనలోనికి తీసుకుని యూజీసీ నిబంధనలకు అధిగమించకుండా, న్యాయపరమైన చిక్కుల తలెత్తకుండా అన్ని విధాలుగా పరిశీలించిన అనంతరమే ఉమ్మడి రిక్రూట్ మెంట్ బోర్డును ఏర్పాటు చేశామని సబితా ఇంద్రారెడ్డి గవర్నర్ కు రాజ్ భవన్ కు వెళ్లి మరీ వివరించారు. ఆమె వివరణలో సంతృప్తి చెందిన గవర్నర్ తమిళిసై సంతృప్తి చెందారు.

వర్సిటీల్లో ఖాళీల ప్రక్రియను వీలైనంత సత్వరంగా నష్పాక్షికంగా, పాదర్శకంగా భర్తీ చేయాలని సూచించారు. గవర్నర్ భేటీలో సబితా ఇంద్రారెడ్డితో పాటు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి కూడా పాల్గొన్నారు.  తెలంగాణలో ఇప్పటికే  వైద్యఆరోగ్య శాఖ, పోలీసు తదితర శాఖలు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసి నియామకాలు చేపట్టాయన్నారు. ఆ నియమకాలన్నీ పాదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగాయని వారు గవర్నర్ వివరించారు.  ఈ వివరణతో సంతృప్తి చెందినట్లు గవర్నర్ తెలిపారు. దీంతో పెండింగ్ లో ఉన్న బిల్లులకు ఆమెదం తెలపాల్సిందిగా మంత్రి సబిత గవర్నర్ ను కోరారు. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపడతామన్నారు.  

By
en-us Political News

  
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.