ప‌వ‌న్ కేంద్రంలో మంత్రినా? రాష్ట్రంలోనా? ఎక్క‌డో ఓ చోట‌ మంత్రి అవ్వ‌డం మాత్రం ప‌క్కా! 

Publish Date:Mar 10, 2024

Advertisement

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సారి మంత్రి అవ్వ‌డం మాత్రం ప‌క్కాన‌ట‌. ఎమ్మెల్యేగా గెలిస్తే రాష్ట్రంలో మంత్రి ప‌ద‌వి, ఎంపీగా గెలిస్తే కేంద్రంలో మంత్రి అయిపోయిన‌ట్లే. అవును....
పవన్ కల్యాణ్ స్కెచ్.. మామూలుగా లేదు. రెండు చోట్ల నుంచి పోటీ చేస్తార‌ట‌.  ఐతే గత ఎన్నికల్లో కూడా జనసేనాని రెండు చోట్ల పోటీ చేశాడు. ఓడిపోయాడు.  ఈసారి పవన్ పోటీ చేసేది రెండు అసెంబ్లీ స్థానాల్లో కాదట. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానానికట. ఇప్పటికే ఖరారైన పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ.. కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటార‌ట.
జనసేనకు మంచి ఊపుందని భావిస్తున్న నేపథ్యంలో పవన్ రెండు చోట్లా జయకేతనం ఎగురవేస్తాడని కూటమి భావిస్తోంది. రెండు చోట్లా గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వేరే అభ్యర్థిని గెలిపించుకుంటారని.. తర్వాత పవన్ ఎన్డీయేలో చేరి కేంద్ర మంత్రి కూడా అవుతాడని జనసేన వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 
గత ఎన్నికల్లో రెండు చోట్లా పవన్ కల్యాణ్ ను ఓడించింది వైసీపీ. అందుకే ఈసారి కూడా  ప‌వ‌న్‌పై పోటీకి ధీటైన నుగుణంగా క్యాండిడేట్ ను డిసైడ్ చేసి బరిలోకి దింపాలనుకుంటోంది వైసీపీ. 
పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో రెండు అసెంబ్లీ సీట్లలో పోటీ చేశారు. 
గాజువాక, 
భీమవరం స్థానాల్లో పోటీ చేసిన ఆయన .. రెండు చోట్లా ఓడిపోయారు. 

ఎంపీగా ఎన్నికైతే కేంద్రంలో మంత్రి పదవి తీసుకునే అవకాశం కలుగుతుందనే ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్నార‌ట‌. బీజేపీ పెద్దల కోరికమేరకే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే ఎంపీగా, 
ఎమ్మెల్యేగా పోటీ చేస్తే విమర్శలు వస్తాయనే భయం కూడా జనసేనను వెంటాడుతోంది. 
ఒకవేళ ఎంపీగా గెలిస్తే పవన్ ఢిల్లీ వెళ్లి కూర్చుంటాడని.. 
రాష్ట్రాన్ని, పార్టీని గాలికొదిలేస్తాడని వైసీపీ నేతలు ప్రచారం చేస్తారు. వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ పవన్ అసెంబ్లీకి వెళ్లి జగన్‌ను ఎదుర్కోవడమే కరెక్ట్ అంటున్నారు.

By
en-us Political News

  
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.