విపక్షాల ఐక్యత సాధ్యమేనా?

Publish Date:Mar 29, 2023

Advertisement

విషయం ఏదైనా, వివాదం ఏదైనా  దేశంలో ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒకే ఎజెండాతో ముందుకు సాగుతున్నాయి. ఇదే ఆఖరి అవకాశం.. ఇప్పడు కాకపోతే, ఇంకెప్పుడూ కాదు.. సమీప భవిష్యత్ లో బీజేపీని దెబ్బతీయడం అయ్యేపని కాదు అని కృత నిశ్చయానికి వచ్చేశాయి. అందుకే ఎలగైనా 2024 ఎన్నికల్లో  మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కలిసి కదులుదామని అన్ని పార్టీల నాయకులు, ఎవరి స్థాయిలో వారు ప్రయత్నిస్తున్నారు. 

కొద్ది రోజుల కిందట అంటే  మార్చి 17న  సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి,తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీతో  భేటీ అయ్యారు.  రెండు గంటలకు పైగానే ఈ ఇరువురూ సమావేశమయ్యారు.

అయితే అఖిలేష్, మమతా బెనర్జీతో ఎందుకు సమావేశమయ్యారు, అంతసేపు ఆ ఇద్దరు ఏం చర్చించారు అన్నది పక్కన పెడితే.. వాస్తవానికి ఆ ఇద్దరే కాదు.. ఏ ఇద్దరు ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు, ఎక్కడ కలిసినా ఒకటే విషయం చర్చకు వస్తున్నది.    2024 ఎన్నికల్లో బీజేపీ ని ఓడించడం ఎలా? మోదీని గద్దె దించడం ఎలా? అన్నదే ఆ చర్చ. ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మొదలు ఒకటి రెండు ఎంపీ సీట్లకు పరిమితమైన సిపిఐ, సిపిఎం వంటి  జాతీయ పార్టీల వరకూ,  జాతీయ రాజకీయాల్లో జెండా ఎగరేసేందుకు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నతృణమూల్, బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ,ఉప ప్రాంతీయ పార్టీల వరకూ ఏ రెండు పార్టీలు. ఏ  ఇద్దరు నాయకులు కలిసినా బీజేపీని ఓడించడం ఎలా, మోడీని గద్దె దించడం ఎలా? అనే ఏక సూత్ర ప్రణాళిక పైనే చర్చిస్తున్నారు. 
వాస్తవానికి 2019 ఎన్నికలలో బీజేపీ వరసగా రెండవసారి  ముందుకు మించిన సొంత బలం (303) తో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రతిపక్ష పార్టీలలో  గుబులు మొదలైంది. 2024 పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న వెంటాడి వేధిస్తోంది.

ముచ్చటగా మూడవ సారి బీజేపీ గెలిస్తే  మోడీ మళ్ళీ ప్రధాని అయితే, తమ పరిస్థితి ఏమిటనే భయం మొదలైంది.  అందుకే  అప్పటి నుంచే బీజేపీని ఓడించడం ఎలా? మోడీని గద్దె దించడం ఎలా? అనే రెండు అంశాల చుట్టూనే ప్రతిపక్ష పార్టీల ఆలోచనలు గింగిరాలు తిరుగుతున్నాయి. అందరూ అదే మాట్లాడుతున్నారు. అన్నీ పార్టీలూ అందుకే ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే ఒకరి ఆలోచనకు, ఇంకొకరి ఆలోచనకు, ఒకరి మాటకు ఇంకొకరి మాటకు పొంతన ఉండడంలేదు, పోలిక కుదరడం లేదు. అందుకే  ప్రతిపక్షాల  ఐక్యత   ఇప్పటి వరకూ ఎండమావిలా మిగిలి పోయిందని పరిశీలకులు  అంటున్నారు. 

కోల్‌కతాలో మమతా బెనర్జీ, అఖిలేష యాదవ్ కూడా  అదే విషయం చర్చించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన అఖిలేష్ యాదవ్  అదే విషయం స్పష్టం చేశారు.  మీరు ఫ్రంట్ అంటారా, పొత్తంటారా ఘటబంధన్  అంటారా అది మీ ఇష్టం.. కానీ, కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీల కొత్త కూటమి త్వరలో ఏర్పడబోతోంది  అని ప్రకటించారు. అదే విషయం మమతా దీదీతో చర్చించానని చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్  పార్టీ  ప్రాంతీయ పార్టీల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఎక్కడుండాలో అక్కడుంటే  మంచిదని హస్తం పార్టీకి ఓ చురక కూడా అంటించారు.

అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ భట్టాచార్య, మరో అడుగు ముందుకేసి, కాంగ్రెస్ పార్టీ  ప్రతిపక్ష పార్టీల  పెద్దన్న పాత్ర పోషించాలనుకుంటే కుదరదని  కురువృద్ద కాంగ్రెస్ పార్టీ ఆ భావన నుంచి బయటకు రావాలని, ‘మా తాతలు నేతులు తాగారు’ అంటే కుదరదని కుండబద్దలు కొట్టారు.  ప్రస్తుతం కాంగ్రస్ పార్టీ ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ గా మాత్రమే మిగిలిందనే నిజాన్ని మరిచి పోరాదని గుర్తు చేశారు.  తృణమూల్  ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ పార్టీలకు సమ దూరం పాటిస్తుందనీ అన్నారు. అయితే అదే సమయంలో ఆయన, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, త్వరలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల నాయకులను కలుస్తారని అంటున్నారు. ఎందుకు, ఏమిటీ అనే వివరణ లేదు. అందుకే రాజకీయ విశ్లేషకులు, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ కోల్ కతా వేదికగా జరిపిన తాజా చర్చలు  ప్రతిపక్ష పార్టీల అయోమయ స్థితికి, అధ్వాన పరిస్థితికి అద్దం పడుతున్నాయని అంటున్నారు.  

2019 నుంచీ బీజేపీ ప్రత్యర్ధి పార్టీల ఐక్యత కోసం జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఈ ప్రయత్నాలు ఒకడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్నట్లు సాగుతున్నాయి. 2024 వరకూ కూడా ఇదే పరిస్థితి కొనసాగినా ఆశ్చర్య పోనవసరం లేదని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.