ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహ ఐదు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది.రాజకీయ పార్టీలు ప్రచార జోరు సాగుతోంది. మరో వైపు కరోనా కొత్త, పాత వేరియంట్ల విజృంభణ కొనసాగుతోంది. దేశంలో ఏ రోజుకు ఆరోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను సమీక్షించేందుకు ఎన్నికస సంఘం అధికారులు- ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో, ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపుర్ రాష్ట్రాల్లోని కొవిడ్ పరిస్థితులను ఆయన వివరించారు.
నిజానికి, ఇప్పటికే డిసెంబరు 27న ఒకసారి ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో కరోనా పరిస్థితులను సీఈసీకి రాజేశ్ భూషణ్ వివరించారు.ఆ సమయంలో... ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని సీఈసీ ఆదేశించింది. ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీలు షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంమవుతున్నాయి. అయితే, జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహించడం కోవిడ్ పరిస్ధితిని మరింత తీవ్రం చేస్తుందని జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహిస్తే కరోనా మరింత ప్రబలే ప్రమాదం ఉందని ఎన్నికల సంఘానికి జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ వీకే పౌల్ తెలిపారు. దీంతో వీటి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఆయన సూచించారు.
మరోవైపు ప్రస్తుత పరిస్ధితుల్లో ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోల నిర్వహణపై రాజకీయపార్టీలు తమంతట తామే నిర్ణయాలు తీసుకోవాలని ఎన్నికల సంఘం కోరింది. తద్వారా తాము జోక్యం చేసుకోకముందే స్వచ్చంధంగా వీటిని కట్టడి చేయాలని సలహా ఇచ్చింది. పరిస్దితి విషమించిన తర్వాత ఎవరూ చేయగలిగేది ఏమీ ఉండదని చెప్పకనే చెప్పింది. ఇప్పటికే యూపీ సహా ఇతర ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు తమ ర్యాలీలు, రోడ్ షోలు రద్దు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా యూపీలో తమ ర్యాలీలు రద్దు చేసుకోవడంతో పాటు బీజేపీ ర్యాలీలు రద్దు చేయాలని ఈసీని కోరుతోంది. ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్‌లలో రాజకీయ పార్టీలు వాస్తవ పరిస్దితుల ఆధారంగా సన్నద్ధం కావాలని, వ్యాక్సిన్లు వేచించుకోవాలని కూడా ఈసీ ఇప్పటికే కోరింది. కానీ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఓమిక్రాన్ వేరియంట్ ఈ సమయంలో ఎన్నికల నిర్వహణపై ఆందోళనలకు కారణమవుతోంది. పరిస్ధితి మరింత ముదిరితే ఎన్నికలు వాయిదా వేయడం మినహా ఈసీ కూడా చేయలగిదిందేమీ లేదనే వాదన వినిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-omicron-effect-five-states-assembly-elections-postpone-39-129752.html
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే నేత ఇలంగోవన్ బహిరంగంగానే ఆరోపించారు. తమ మద్దతుతోనే రాజ్యసభ నామినేషన్లు దక్కించుకుని.. కూటమి ద్వారానే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, ఇప్పుడు స్వార్థం రాజకీయంతో వేరే పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం దారుణమన్నారు.
దేశవ్యాప్తంగా విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, మూల్యాంకన వ్యవస్థ వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.