నరేష్.. పవిత్ర.. పబ్లిసిటీ స్టంటేనా?
Publish Date:Jan 6, 2023
Advertisement
ఒకనాటి హీరో... ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేశ్, పవిత్ర లోకేశ్ ఇద్దరు మళ్లీ పీటలెక్కబోతున్నారంటూ ఇ ఓ ప్రచారం అయితే గత కొంత కాలంగా జోరుగా సాగింది. కొత్త ప్రారంభం.. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలంటూ.. ఈ జంట.. కన్నుల పండగగా.. అదీ కొవ్వొత్తల వెలుగులో లిప్‌లాక్ చేసుకొంటూ ఓ వీడియో నూతన సంవత్సరం ప్రారంభ వేళ.. విడుదల చేశారు. సదరు వీడియో చివరల్లో.. గెట్టింగ్ మ్యారీడ్ సూన్ అంటూ మూక్తాయింపు ఇవ్వడంతో ఇంత కాలం జోరుగా సాగిన ప్రచారం వాస్తవమే అని అందరూ అనుకున్నారు. అంతేకాదు దీనికి మళ్లీ పెళ్లి అనే ప్రకటనతోపాటు #పవిత్రానరేశ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో సదరు వీడియో విడుదల కావడంతో వాళ్లిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని కన్ ఫర్మ్ చేసేసుకున్నారు. అయితే ఫిల్మ్ నగర్ వర్గాలు మాత్రం ఈ వీడియో కేవలం పబ్లిసిటి జిమ్మిక్కేనని అంటున్నాయి. మళ్లీ పెళ్లి అనే చిత్రంలో నరేశ్, పవిత్రా లోకేశ్ జంట కలిసి నటిస్తున్నారని.. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగానే దీనిని విడుదల చేశారని.. ఆ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నరేశ్, పవిత్రా లోకేశ్‌లు ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది. మరో వైపు నరేశ్ భార్య రమ్య రఘుపతి.. ఈ జంటని కర్ణాటకలోని మైసూర్‌లోని ఓ హోటల్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొవడానికి సంబంధించిన వీడియోలు.. ఇటీవల హల్ చల్ చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే నరేశ్, పవిత్రా లోకేశ్‌తో ఓ వీడియో తీసి వదిలితే.. మంచి పబ్లిసిటి వస్తోందనే ఆలోచనతో ఈ వీడియోను రూపొందించార ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఓ వదంతిని జస్ట్ అలా వదిలితే.. వచ్చే పబ్లిసిటి అలా ఇలా కాదు.. ఓ రేంజ్‌లో ఉంటుందనే ఓ ఆలోచనతో ఈ వీడియోను షూట్ చేసినట్లు ఫిలింనగర్‌లో టాక్ సాగుతోంది. మరో వైపు.. ఈ చిత్రం నరేశ్, పవిత్రల బయోపిక్ అని కూడా ఫిలింనగర్‌లో చర్చ నడుస్తోంది. వీరిద్దరిపై ఇటీవల వచ్చిన వార్తల నేపథ్యంలో ఓ రియల్ స్టోరీతో....రీల్ స్టోరిగా తెరకెక్కించాలని చూస్తున్నారనే టాక్ సైతం హల్ చల్ చేస్తోంది. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ సైతం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. ఈ జంట సహజీవనంలో ఉందో లేదో.. అలాగే వీరిద్దరు పెళ్లి చేసుకుంటారో లేదో ఎవరికీ తెలియదని.. కానీ ప్రస్తుతం ఈ జంట వెండి తెరపై నటిస్తోందని.. దానిని తెలివిగా క్యాష్ చేసుకోవడం కోసం.. ఈ వీడియోని రిలీజ్ చేశారని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/is-naresh-pavitra-lokesh-lip-lock-video-a-publicity-stunt-39-149624.html





