బాబ్జీ మరణం.. ఆ పాపం కొడాలి నానిదేనా?

Publish Date:Mar 24, 2022

Advertisement

గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆడపా వెంకట రమణ అలియాస్ బాబ్జీ ఇటీవల ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృత్తి పట్టణంలో చిచ్చు రేపుతోంది. మంత్రి కొడాలి నాని కుటిల రాజకీయాలకు అడపా బాబ్జి బలయ్యారనే చర్చ పట్టణంలో తెగ వైరల్ అవుతోంది. బాబ్జీ మృతిని ఆయన అనుచరులు తట్టుకోలేకపోతున్నారట. దాంతో కొడాలి నానిపై వారంతా ఏకంగా నిప్పులు చెరుగుతోన్నట్లు సమాచారం.

గతంలో ఆడపా బాబ్జీ బావమరిది విజయ్.. కొడాలి నాని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే.. కోట్లాది రూపాయిలు మేర సర్ధారని తెలుస్తోంది. ఆ తర్వాత  కొడాలి నానిని అతడు నగదు ఇవ్వాలని కోరగా.. చూద్దాం.. చూద్దామంటూ కాలయాపన చేశారట. ఈ నేపథ్యంలో విజయ్ ఆత్మహత్య చేసుకోన్నారని.. ఆ సమయంలో అతడు సూసైడ్ నోటు కూడా రాశారని.. అందులో మంత్రిగారి పేరు కూడా స్పష్టం చేశాడని సమాచారం. అయితే ముందుగానే ఈ విషయం తెలుసుకున్న మంత్రిగారు రంగంలోకి దిగి.. చక్రం తిప్పి. సూసైడ్ నోట్‌ను సైడ్ చేశారనే టాక్ అయితే గుడివాడులో గుప్పుమంటోంది. విజయ్ మరణంతో ఆ నగదంతా.. అతడి బావా అడపా బాబ్జీ.. చెల్లించాల్సి వచ్చిందట. 

మరోవైపు ఆడపా బాబ్జీ కూడా ఆ కొడాలి నానితో ఉన్న స్నేహ బంధం వల్ల.. చాలా పెద్ద మొత్తంలో ఆయనకు నగదు ఇచ్చారట. ఆ తర్వాత ఆడపా బాబ్జీ తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ క్రమంలో ఆయన.. కొడాలి నానిని కలిసి.. గతంలో ఇచ్చిన నగదు తిరిగి ఇవ్వాలని ప్రాధేయపడ్డారని... దానిదేముందీ ఇచ్చేద్దామంటూ కొడాలి నాని చాలా కూల్‌గా సమాధానం ఇవ్వడంతో... విషయం అర్థమైన.. ఆడపా బాబ్జీ... తీవ్ర ఆందోళనతోపాటు ఒత్తిడికి గురై మరణించారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. 

అందుకే బాబ్జీ అంత్యక్రియల సమయంలో శ్మశానం వేదికగా ఆయన అభిమానులు.. కొడాలి నానిపై దాడికి యత్నించడం.. ఆ క్రమంలో మంత్రిగారి ఫ్యాన్స్ రంగంలోకి దిగడం.. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బండ బూతులు తిట్టుకోన్నారని తెలుస్తోంది. అయితే అదే సమయంలో అడపా బాబ్జీ అభిమాని ఒకరు.. నేరుగా కొడాలి నాని కాలర్ పట్టుకొగా.. అక్కడే ఉన్న పలువురు వెంటనే స్పందించి.. అతడి ప్రయత్నానికి అడ్డం పడ్డారనే తెలుస్తోంది. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా సదరు మంత్రిగారు.. తన అధికారిక పెత్తనాన్ని చెలాయించారని సమాచారం. దీంతో ఈ విషయం ఏ మీడియాలో కానీ.. సోషల్ మీడియాలో కానీ.. ఎక్కడ కనిపించలేదు.. వినిపించలేదు. కానీ ఈ విషయం.. గుడివాడ పట్టణంలో హాట్ టాపిక్ అయి కూర్చొంది. మరోవైపు నగదు తీసుకుని.. ఆ నగదు చెల్లించకుండా.. ఇంత మంది ఊసురుపొసుకొంటున్న కొడాలి నాని.. ఇంకా ఎంత మంది ఊసురు తీస్తాడోననే ఓ విధమైన భయాందోళనలో గుడివాడ ప్రజలు ఉన్నారనే అంటున్నారు.  

కొడాలి నాని.. ఆడపా బాబ్జీ లాంటి నమ్మకమైన వ్యక్తిని కోల్పోవడం.. నిజంగా  ఆయనకు కోలుకోలేని దెబ్బ అని గుడివాడ వాసులు పేర్కొంటున్నారు. ఆడపా బాబ్జి లాంటి నమ్మకమైన వాడు..  కొడాలి నానికి మళ్లీ దొరకరనే టాక్ కూడా బలంగా ఉంది. ఇన్నేళ్లు.. కొడాలి నాని గెలుపు కోసం.. పట్టణంలో యువతనంతా ఒకే తాటిపైకి తీసుకు వచ్చిన ఘనత ఈ ఆడపా బాబ్జీదేనని వారంతా ఈ సందర్భంగా గుర్తు చేసుకొంటున్నారు. అలాంటి నేత గుడివాడ రాజకీయ ముఖ చిత్రం నుంచి కనుమరుగు కావడంతో.. కొడాలి నాని బలమంతా గాలి తీసిన బెలూనులా మారి పోయిందని వారు చెబుతున్నారు. అడపా బాబ్జీ మృతితో పార్టీలోని కేడర్ అంతా చెల్లాచెదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో కొడాలి నాని.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం అంత సులువు కాదని టాక్. 

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.