కిషన్ రెడ్డికి కేసీఆర్ ఎలక్షన్ ఫండింగ్! టీఆర్ఎస్- బీజేపీ కుమ్మక్కు?
Publish Date:Nov 10, 2021
Advertisement
టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటంలో దూకుడు పెంచుతున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొంపల్లిలో జరుగుతున్న కాంగ్రెస్ శిక్షణా తరగతుల్లో రెండో రోజు రేవంత్ రెడ్డి పార్టీ కేడర్ కు సందేశం ఇచ్చారు. టీఆర్ఎస్, బీజేపీలపై విరుచకుపడ్డారు. కేసీఆర్ ను ఉద్దేశించి సంచలన కామెంట్లు చేశారు. సీఎం కేసీఆర్ ప్రెస్మీట్లు కల్లు కాంపౌండ్‌ను తలపిస్తున్నాయని రేవంత్‌రెడ్డి విమర్శించారు. బండి సంజయ్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బండి సంజయ్ ను కేసీఆర్ 6 ముక్కలు చేస్తా అన్నా.. అరవింద్ ,బండి సంజయ్ లు ఎంధుకు నోరు విప్పడం లేదని నిలదీశారు. కమలం, కారు పార్టీలు డ్రామా ఆడుతున్నాయని.. రాష్ట్రంలో కాంగ్రెస్‌పై చర్చ జరగకుండా ఉండేందుకు ఉమ్మడి వ్యూహం రచిస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నీళ్లు, నిధుల పేరుతో కేసీఆర్ రూ.వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని బయటపెట్టే ధైర్యం మాకుంది.. బీజేపీ ప్రభుత్వం విచారణ జరుపుతుందా అని ప్రశ్నించారు. మోడీ ,అమిత్ షా లకు చిత్తశుద్ధి ఉంటె కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులో జరిగిన అవినీతి పై సీబీఐ విచారణ కు ఆదేశించాలని అన్నారు. విద్యుత్ ప్రాజెక్టుల్లోనే కేసీఆర్ రూ.వెయ్యికోట్ల అవినీతి చేశారని, మంత్రులు ఇసుక మాఫియా చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మండిపడ్డారు. కేసీఆర్ అవినీతిని నిరూపిస్తానని, అలా నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ఇచ్చిన డబ్బులను తమిళనాడు ఎన్నికలకు కిషన్ రెడ్డి తరలించారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తమిళనాడు లో బీజేపీ ఎన్నికల ఖర్చు అంత కేసీఆర్ పెట్టుకున్నాడని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ని మరోసారి చేసేందుకు కేసీఆర్ మోడీ తో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. యూపీలో ఎంఐఎం చేత వంద సీట్లకు పోటీ చేయించి ప్రతిపక్ష ఓట్లను చీల్చి బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. పవర్ ప్రాజెక్టులలో కేసీఆర్ వెయ్యి కోట్ల అవినీతి కి పాల్పడ్డారని రేవంత్ ఆరోపించారు.గచ్చిబౌలి ,నార్సింగి లలో వేల కోట్ల రూపాయల భూములను పప్పు , బెల్లం లా కేసీఆర్ తన మనుషులకు కట్టబెట్టారని మండిపడ్డారు. నెక్లెస్ రోడ్ లో సంజీవయ్య పార్క్ ను మంత్రి తలసాని ఆక్రమించారని, దానిపై విచారణ కు ఆదేశించే ధైర్యం బీజేపీ కి ఉందా అని ప్రశ్నించారు. ట్యాంక్ బండ్ పై నిర్మిస్తున్న అమరవీరుల స్పూపంలో కూడా అవినీతి జరిగిందన్నారు.
http://www.teluguone.com/news/content/is-kcr-given-election-fund-to-kishan-reddy-39-126133.html





