నిద్రలోనే గుండెపోటు ప్రమాదాలు.. దీని లక్షణాలు ఏంటంటే..

Publish Date:Oct 20, 2024

Advertisement

ప్రపంచంలో ఎక్కువమంది ప్రాణాలు తీసే జబ్బు గుండెపోటు. కరోనా తరువాత ఈ గుండె సంబంధ సమస్యలు మరింత పెరిగాయి. గుండె బలహీనం కావడం, తొందరగా అలసిపోవడం, ఒత్తిడిగా అనిపించడం వంటి సమస్యలు చాలామందిలో ఎక్కువయ్యాయి.  ప్రతిరోజూ వ్యాయామం చేసేవారు, చక్కని ఆహారపు అలవాట్లు కలిగినివారు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అది కూడా సైలెంట్ అటాక్ లో చిక్కుకుంటున్నారు. గుండె ఆగిపోవడాన్ని వైద్య పరిభాషలో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అని కూడా అంటారు. ఇది  గుండె శరీర అవసరాలకు తగినంత రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు వచ్చే పరిస్థితి.

 హార్ట్ ఫెయిల్యూర్ అకస్మాత్తుగా రావచ్చు.  ఎందుకంటే అప్పటికి  గుండె బలహీనమై ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్  లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి. నేటికాలంలో ఉన్న పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని అన్ని సమయాలలో గమనించుకోవడం ఎంతో ముఖ్యం.  రాత్రి నిద్రపోతున్నప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ కు సంబంధించి సమస్యలు కొన్ని వస్తుంటాయి. వీటి లక్షణాల గురించి తెలుసుకుంటే..

శ్వాస వేగంగా ఉండటం..

 శ్వాస వేగంగా ఉండటం అనేది హార్డ్ ఫెయిల్యూర్ కు దారితీసే లక్షణం. దీన్ని రాత్రి నిద్రించే సమయాల్లో గమనించవచ్చు.  దీనిని పార్క్సిస్మల్ నాక్టర్నల్ డిస్‌ప్నియా (PND) అంటారు. ఇది సాధారణంగా గాఢ నిద్రలోకి జారుకున్న కొన్ని గంటల తర్వాత జరుగుతుంది.ఈ సమస్య ఉన్న వ్యక్తి ఉబ్బరంతో మేల్కొంటాడు.  ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు  ఊపిరి పీల్చుకోవడానికి కూర్చోవడం లేదా నిలబడటం చాలా ముఖ్యం.  నిద్రపోతున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది అనిపించినప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు.  అది కార్డియాక్ అరెస్ట్‌కు సంకేతం .

గుండెదడ..

భయంగా ఉన్నప్పుడు గుండె దడగా ఉంటుంది. ఆ పీలింగ్ చాలామంది జీవితంలో ఒక్కసారి అయినా అనుభూతి చెంది ఉంటారు. అయితే  గుండె ఆగిపోయేముందు వ్యక్తుల హృదయ స్పందన అకస్మాత్తుగా పెరుగుతుంది. దీనిని టాచీకార్డియా అంటారు. ఇది ఒక నిమిషంలో గుండె 100 సార్లు కంటే ఎక్కువ కొట్టుకునే పరిస్థితి . ముఖ్యంగా నిద్రలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అజాగ్రత్తగా ఉండకూడదు.


దగ్గు.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది..

హార్ట్ ఫెయిల్యూర్  ప్రాధమిక దశ శ్వాసలో గురక ప్రారంభమవుతుంది. ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు, బ్రోన్కియోల్స్ వాటిని దూరంగా ఉంచే ప్రయత్నంలో కుంచించుకుపోతాయి.  దగ్గుతో పాటు గురక కూడా వస్తుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు ఈ సమస్య అనుభవంలోకి వస్తుంటుంది.  ఈ పరిస్థితిని కార్డియాక్ ఆస్తమా అని పిలుస్తారు, దీనిలో ఒక వ్యక్తి నోటి నుండి నురుగు, గులాబీ రంగులో ఉండే కఫం కూడా బయటకు వస్తుంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..

రాత్రి నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే , అది గుండె వైఫల్యం యొక్క లక్షణం. హాయిగా ఊపిరి పీల్చుకోవడానికి, దిండు సహాయం తీసుకుని నిటారుగా కూర్చోవాలి. ఈ పరిస్థితిని ఆర్థోపెనియా అంటారు. ఇప్పటికే గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నవారు ఈ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

అకస్మాత్తుగా మెలకువ రావడం..

రాత్రి నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా మేల్కొలపడం కూడా కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ ఫెయిల్యూర్  ప్రధాన లక్షణం. కొన్ని సందర్భాల్లో ఛాతీ నొప్పి కూడా ఎదురవుతుంది. తక్షణ చికిత్స అందించకపోతే వ్యక్తి స్పృహ కోల్పోవచ్చు. కొన్ని సందర్భాల్లో చికిత్స ఆలస్యం మరణానికి కూడా దారితీస్తుంది.

ఎవరైనా సరే నిద్రిస్తున్నప్పుడు పైన పేర్కొన్న ఏవైనా లక్షణాలు ఎదుర్కొంటుంటే వెంటనే చికిత్స తీసుకోవాలి.హార్ట్ ఫెయిల్యూర్ అనేది అత్యవసర సహాయం అవసరమయ్యే పరిస్థితి. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ఒక వ్యక్తి ప్రాణాలను నిలబెడుతుంది.


                                                 *నిశ్శబ్ద.


 

By
en-us Political News

  
రోజంతా అలసటగా, నీరసంగా అనిపిస్తుందా? ఎంత విశ్రాంతి తీసుకున్నా శరీరంలో శక్తి లేకపోతే, అది కేవలం సాధారణ అలసట మాత్రమే కాకుండా Chronic Fatigue Syndrome (CFS) అనే ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
టి కాలంలో రోజులో మూడు పూటలా ఆహారం తీసుకోవడం కామన్.  ఉదయం టిఫిన్, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తప్పకుండా చేస్తారు.
మధుమేహం అనేది వేగంగా పెరుగుతున్న ఒక  వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కొందరికి కాలివేళ్లు , చేతివేళ్ల కీళ్లలో నొప్పి, మోకాళ్లు , చీలమండలలో వాపు, , నడవడంలో ఇబ్బంది వంటివి ఎదురవుతుంటాయి.  ఇవి యూరిక్ యాసిడ్ పెరగడానికి సంకేతాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మినుముల పులగం అనేది మన సంప్రదాయ ఆహారాల్లో ఎంతో విలువైనది. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్, బలం, శక్తిని అందించే సహజమైన ఆహారం.
వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, వర్షం, నీరు నిలవడం, వరదలు వంటివి  వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అనేది పెద్దవారికే వచ్చే వ్యాధి అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ సమస్య పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం.  ఈ విషయాన్ని పేపర్ లు,  టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా ఏకంగా  సిగరెట్ ప్యాకెట్ ల పైన కూడా రాసి ఉంటుంది. ఇలా ఎవరు ఎంత చెప్పినా సరే..
గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలకు ఇంట్లోనే వాము, ధనియాలు, జీలకర్ర, సోంపుతో ఆయుర్వేద చూర్ణం ఎలా తయారు చేయాలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించిన పూర్తి వీడియో.
మోకాళ్ల నొప్పి ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మెట్లు ఎక్కడం, నడవడం, ఎక్కువసేపు నిలబడటం వంటి రోజువారీ పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఈ వీడియోలో యోగా ఆచార్య ధాకారం గారు మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే ...
గాలి కాలుష్యం, ఆహార కాలుష్యం, నీటి కాలుష్యం.. ఇలా ప్రతిదీ కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉన్నాయి.  బయటకు వెళ్లినప్పుడు వాహనాల పొగతో పాటు ఎన్నో కారణాల వల్ల గాలి కాలుష్యం అవుతుంది.
రోజుకు కేవలం 5 నిమిషాలు ఉద్గీత ప్రాణాయామం చేస్తే శరీరం, మనసుకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? సరైన విధానం, శాస్త్రీయ ప్రయోజనాలు, ఎవరు చేయాలి? ఎవరు చేయకూడదు? అనే వివరాలను సీనియర్ యోగా థెరపిస్ట్ శ్రీమతి శ్రావంతి రఘు ఈ వీడియోలో వివరించారు.
Black Spots on Onions,Are They Safe to Eat,Black Mold on Onions,What Black Spots on Onions Really Mean
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.