వంద గ్రాముల కందిపప్పు.. నాలుగు టమాటాలు.. నాలుగు ఆలుగడ్డలు.. వరద బాధితులకు జగన్ సాయం

Publish Date:Jul 19, 2022

Advertisement

ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించి ప్ర‌జ‌ల‌కు, పంట‌ల‌కు తీవ్ర నష్టం వాటిల్లినప్పుడు ప్ర‌భుత్వాలు ముంపు బాధితులకు తక్షణం నిత్యావసరాలు అందించి ఆదుకోవడం కనీస ధర్మం, బాధ్యత.   కానీ జగన్ ప్రభుత్వం ఈ విషయంలో ఘోరంగా విఫలమైంది. వ‌ర‌ద బాధితుల‌కు వంద గ్రాముల కందిప‌ప్పు, నాలుగే నాలుగు ట‌మాటాలు,ఆలూ ఇవ్వ‌డం హాస్యాస్ప‌ద‌మ‌ని తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు విమర్శించారు.   

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇటీవ‌లి ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో భారీ వరదలు తీవ్ర‌ న‌ష్టం కలిగించాయి గోదావ‌రి ప‌రీవాహ‌క ప్రాంతాల్లోకి వ‌ర‌ద నీరు చేరి ప‌లు చోట్ల లోత‌ట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వ‌ర్షాలు తెరిపివ్వ‌గానే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి ఏరియ‌ల్ స‌ర్వే చేప‌ట్టి ప‌రిస్థితులు తెలుసుకున్నారు. ప్ర‌జ‌లను వెంట‌నే ఆదుకోవ‌డానికి బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు.. ఒక్కోకుటుంబానికి  2 వేల రూపాయల నగదు తాగునీరు, రేషన్, పశుగ్రాసం అందించాలని  అధికారులను ఆదేశించారు.  లంక గ్రామాల్లో బాధితులకు అధికారులు చేసిన వరద సాయం  ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆవేదన కలిగిస్తుంది. 

జగన్ ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా  ముంపునకు గురై సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన లంక గ్రామాల ప్ర‌జ‌ల‌కు ప్రభుత్వం తరఫున వంద‌ గ్రాముల కంది పప్పు.. నాలుగంటే నాలుగు టమాటాలు, నాలుగు ఉల్లిపాయలు, నాలుగు బంగాళాదుంపలు అందిస్తున్నారు. అస‌లీ లెక్క‌లేమిటో, ఎవ‌రు చెప్పారో తెలీదు. కానీ   ఖ‌చ్చితంగా అంతే ఇస్తున్నారు. ఈ మాత్రం దానికే ఎంతో గొప్పగా బాధితులను ఆదుకుంటున్నామంటూ ప్రచారం చేయంచుకుంటున్న ప్రభుత్వం విమర్శల పాలౌతోంది.  వరద బాధితులకు ఇదేనా సాయం అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇక వరద బాధితులకు ప్రభుత్వ సాయంపై ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్ర బాబు నాయుడు ట్విట్టర్ ద్వారా విమర్శనాస్త్రాలు సంధించారు.

 అల్లూరి జిల్లా చింతూరు మండలం చట్టిలో గోదావరి వరద సాయంపై మీడియాలో వచ్చిన కథనంపై చంద్రబాబు ట్వీట్ చేశారు.   నాలుగు ఉల్లి పాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళా దుంపలు!.ఇదీ గోదావరి వరద బాధితులకు మీ ప్రభుత్వం ఇచ్చిన సాయం....లెక్క చూసుకో జగన్ రెడ్డి... నాలుగంటే నాలుగే!. అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.   మరోవైపు చంద్రబాబు నాయుడు వరద ప్రాంతాల్లో పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈనెల 21న కోనసీమ జిల్లా పి.గన్నవరం, రాజోలులో చంద్రబాబు పర్యటిస్తారు. 22వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, ఆచంటలో వరద బాధితులను పరామర్శించ నున్నారు.

By
en-us Political News

  
ప్రధాని మూడోసారి ప్రధానిగా అయ్యాక రెండోసారి ఎపిలో పర్యటిస్తున్నారు. ఆయన విశాఖకు చేరుకోవడం చర్చనీయాంశమైంది. కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. సిరిపురం చౌరస్తానుంచి ఏయు ఇంజినీరింగ్ కాలేజివరకు ర్యాలీ నిర్వహించారు
ఫార్ములా-ఈ కార్‌ కేసులో  ఏసీబీ విచారణకు తన వెంట న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ కు ఒకే సమయంలో మోదం; ఖేదం కలిగేలా కోర్టు తీర్పు వెలువరించింది.
ఇప్పటికే ఫార్ములా ఈ రేసు కేసులో చిక్కులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుపై మరో ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదు ఔటర్ రింగు రోడ్డు టెంటర్లలో అవినీతికి సంబంధించింది.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ఏసీబీ విచారణకు తన వెంట న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసుకున్న లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు అందుకు నో చెప్పింది.
ఫార్ములా ఈ రేస్ కేసులో ఎసిబి విచారణకు కెటీఆర్ న్యాయవ్యాదులను అనుమతించకపోవడంపై బుధవారం హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. న్యాయవాదులను అనుమతించకపోవడానికి కారణమేమిటని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని  ప్రశ్నించింది
ఎన్నికల వ్యూహకర్త, జనసూరజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఆయన ఇటీవల ఆమరణ నిరాహార దీక్ష చచే పట్టారు. పోలీసులు ఆ దీక్షను భగ్నం చేశారు. అయితే ఆ దీక్ష కారణంగా ఆయన అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.
మావోయిస్టుల నుంచి ముప్పు ఉందన్న సమాచారం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడికి భద్రత పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జడ్ ప్లస్ క్యాటగరి భద్రత ఉన్న చంద్రబాబు సెక్యూరిటీలోకి కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు వచ్చి చేరాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఉన్నట్లా లేనట్టా అన్న చర్చ జరుగుతోంది. ఈ సారి సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు డీఏలను ప్రకటించే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరిగింది.
గత వారం  రోజులుగా మీడియాలో వస్తున్న ప్రచారంపై  ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు  టీం ఖండించింది. . ఈ ప్రచారంపై కుట్ర కోణం ఉందని ఆరోపించింది.
తెలుగురాష్ట్రాలను చలి పులి చంపేస్తోంది. రెండు రాష్ట్రాలలోనూ కూడా తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఉదయం పది గంటల వరకూ కూడా బయటకు రావడానికి జంకుతున్న పరిస్థితి.
మొదటి వారం చివరి రోజున జెపిసి నివేదికను లోకసభ సమర్పించాల్సి ఉంటుంది.  పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్బంగా సవరణ బిల్లు ను కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును  ప్రవేశ పెట్టారు. 
బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ పార్టీకి చెందిన నేత‌లు ఒక‌రి త‌రువాత ఒక‌రు జైలుకెడుతున్నారు. త్వ‌ర‌లో కేటీఆర్ కూడా జైలుకెళ్లే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో పార్టీ భ‌విష్య‌త్ పై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ, ఈడీలు దూకుడు పెంచాయి. ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసిన తరువాత ఇక తప్పించుకోవడం సాధ్యం కాదని అర్ధం చేసుకున్న నిందితులు విచారణ సంస్థలకు సహకరించకతప్పని పరిస్థితుల్లో పడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.