2026 డీలిమిటేషన్ సెగ.. పార్లమెంట్‌లో ఓటమి.. బీజేపీ రాజకీయ విజయం?

Publish Date:Apr 20, 2026

Advertisement

దేశ రాజకీయాల్లో ఇప్పుడు  2026 డీలిమిటేషన్  ఒక హాట్ టాపిక్ గా మారింది. లోక్‌సభ స్థానాల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్),  మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన కీలక బిల్లులు పార్లమెంట్‌లో అవసరమైన మెజారిటీ లేక వీగిపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రతిపక్ష కూటమి దీనిని కేంద్ర ప్రభుత్వ ఓటమిగా అభివర్ణిస్తున్నప్పటికీ, లోతుగా పరిశీలిస్తే ఇది అధికార బీజేపీకి వచ్చే ఎన్నికల కోసం ఒక బలమైన ప్రచార అస్త్రాన్ని అందించినట్లు కనిపిస్తోంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 81, 82 ప్రకారం..  ప్రతి జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగడం అనేది ఒక అనివార్యమైన ప్రక్రియ. ఇది ఏ రాజకీయ పార్టీ సొంత నిర్ణయం కాదు..  రాజ్యాంగబద్ధమైన విధి. గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో..  ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు.  అయితే, 2026 గడువు సమీపిస్తుం డటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.  దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మహిళా రిజర్వేషన్ల అమలు కూడా డీలిమిటేషన్‌తోనే  ముడిపడి ఉంది.  2023లో ఆమోదించిన బిల్లు ప్రకారం, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళలకు 33 శాతం కోటా అమల్లోకి వస్తుంది.  దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఒక మధ్యేమార్గంలా '  50శాతం సీట్ల పెంపు'ఫార్ములాను ప్రతిపాదించింది. అంటే..  అన్ని రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న సీట్లపై 50 శాతం అదనంగా కేటాయిం చడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గకుండా చూడాలనేది కేంద్రం వాదన. అయితే, దీనివల్ల బీజేపీకి మహిళా రిజర్వేషన్ క్రెడిట్ దక్కుతుందని, ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగి తమ పట్టు తగ్గుతుందని భావించిన డిఎంకె వంటి ప్రాంతీయ పార్టీలు, ఇండియా కూటమి దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతిపక్షాల అడ్డంకులతో ఈ 50 శాతం అదనపు సీట్ల ఫార్ములా తిరస్కరణకు గురైంది. 

అయితే, ఇదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారే అవకాశం ఉంది. ప్రత్యేక ఫార్ములాలు ఏవీ లేకపోతే.. ఇప్పుడు డీలిమిటేషన్ పూర్తిగా జనాభా ప్రాతిపదికన మాత్రమే జరుగుతుంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలు దీనివల్ల సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంది. మరోవైపు..  జనాభా భారీగా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలకు లోక్‌సభలో బలం పెరుగుతుంది. అంటే.. పార్లమెంట్‌లో బిల్లును అడ్డుకోవడం ద్వారా విపక్షాలు దీర్ఘకాలంలో దక్షిణాది గొంతుకను బలహీనపరిచాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలను బీజేపీ తనకి అనుకూలమైన నేరేటివ్‌గా మార్చుకునే పనిలో పడింది.  మేము మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని మహిళా ఓటర్లకు..  దక్షిణాది సీట్లు తగ్గకుండా మేము రక్షించే ప్రయత్నం చేస్తే విపక్షాలే చెడగొట్టాయి అని దక్షిణాది ప్రజలకు బీజేపీ వివరించే అవకాశం ఉంది. 

అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తమ ప్రాతినిధ్యాన్ని విపక్షాలు అడ్డుకుంటున్నాయనే భావనను కలిగించడం ద్వారా 2029 ఎన్నికల అజెండాను బీజేపీ ఇప్పుడే సిద్ధం చేసుకుంటోంది.  ప్రతిపక్షాలు పార్లమెంటరీ పోరాటంలో తాత్కాలిక విజయం సాధించినప్పటికీ, ప్రజాక్షేత్రంలో ఓటర్ల సెంటిమెంట్‌ను గమనించడంలో  మాత్రం ఘోరంగా విఫలమయ్యాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా మహిళా సాధికారతకు అడ్డుపడ్డారనే ముద్ర పడటం విపక్షాలకు నిస్సందేహంగా పెద్ద మైనస్ అవుతుంది. డీలిమిటేషన్ అనేది రాజ్యాంగబద్ధంగా ఎలాగూ జరుగుతుంది..  కానీ కేంద్రం ఇచ్చిన వెసులుబాటును కాలదన్నడం ద్వారా ప్రతిపక్షాలు ఇసుమంతైనా దూరదృష్టి లేకుండా వ్యవహరించి,  పార్లమెంట్‌లో ఈ బిల్లు పాసు కాకుండా అడ్డుకోవడం ద్వారా బీజేపీకి ఒక  ఎలక్టోరల్ గిఫ్ట్ గా మారే లా చేశాయని చెప్పవచ్చు.  

- సీతారాం కంఠంనేని

By
en-us Political News

  
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.